విముక్త: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , → using AWB
పంక్తి 29:
‘కేవలం ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళలకు స్వేచ్ఛ వచ్చినట్టు కాదు…చట్టసభల్లో మహిళలు విధాన నిర్ణయకర్తలు అయినపుడే అది సాధ్యపడుతుంది’ అని రచయిత్రి, స్త్రీవాద ఉద్యమకారిణి ఓల్గా స్పష్టంగా చెబుతారు.<ref>[http://palapitta.net/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81/224/ “విముక్త – కథా సంపుటి”]</ref>

విముక్త సంకలనంలోని కథలు రామాయణ కథా నేపథ్యం లోనేపథ్యంలో సీత సూత్రధారిగా నడిచేవి. పురాణ కథలను తీసుకొని స్త్రీవాద దృక్కోణంతో మాత్రమే గాక, ఓ నూతన ఒరవడితో తిరగరాయడమనేది అద్భుత విషయమైతే ఆ అద్భుతాన్ని తనదైన శైలిలో అలతి అలతి పదాలతో సరళంగా, క్లుప్తంగా రాయడం ఓల్గా గారికే చెల్లింది. ఈ కథలన్నీ కూడా చదువరుల హృదయాలను హత్తుకొని, ఏకబిగిన చదివిస్తాయి.
పౌరాణిక పాత్రల్లోని ఉదాత్తత, సహనశీలత, సంపూర్ణత వారి జీవితాల్లోని ఆయా సందర్భాల్లో వారనుభవించిన మౌన సంఘర్షణ లోంచి రూపుదిద్దుకున్నవే! సామాజిక కట్టుబాట్లు, నైతిక, నిర్దేశిక సూత్రాలననుసరించి పితృస్వామ్య ఆధారిత కుటుంబ వ్యవస్థ తన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న ఆదేశిక సూత్రా ల అంతర్వాహినియే ఆయా పాత్రల గుణగణాలు.<ref>[http://www.namasthetelangaana.com/EditPage/article.aspx?category=4&subCategory=1&ContentId=490659 స్త్రీల అస్తిత్వ సాధికారత పునర్నిర్వచనం విముక్త..]</ref>
==ఈ పుస్తకం గురించి ఓల్గా చెప్పిన విషయం==
::: ఈ కథలు వర్తమాన సమాజంలో స్త్రీల వేదనలకు ప్రాతినిధ్యం వహించే కథలు కూడా.
ఇవాల్టి సమాజంలో అనేక ఆంక్షలకూ అవమానలకూ హింసలకూ గురై వాటినధిగమించి
లేస్తున్న స్త్రీలు కొందరైతే, వాటిలోనే కూరుకుపోయి వాటిని దాటలేక, దాటాలని తెలియక,
నానా యాతనలు పడుతున్న స్త్రీలెందరో - తమను హింసించే భర్తల నుండి విముక్తం కావాలనే
స్పృహ లేకుండా వారిని ద్వేషిస్తునే, అసహ్యించుకుంటునే వారిని గట్టిగా పట్టుకునే స్త్రీలు - ద్వేషంతో
తమను తాము హింసించుకోడం అలవాటైన స్త్రీలు - ఆ స్త్రీల కోసం ఈ కథలు.
{{in5|50}}– [[ఓల్గా]], ''రచయిత్రి''
==అవార్డులు==
చిన్న కథల సంకలనం ‘విముక్త’ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ సంకలనాన్ని డాక్టర్ కె.రామచంద్రమూర్తి, డాక్టర్ ఎ.మంజులత, డాక్టర్ జి.యోహాన్‌బాబుల జ్యూరీబృందం ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.<ref>[http://kinige.com/book/Vimukta 2015 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు పొందిన పుస్తకం]</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/విముక్త" నుండి వెలికితీశారు