వై.యస్. రాజశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో (2), లు → లు (3), తో → తో , సాంప్రదాయా → సంప్ using AWB
పంక్తి 29:
 
==బాల్యం, విద్యాభ్యాసం==
వై.యస్.రాజశేఖర్ రెడ్డి జూలై 8, 1949 న వైఎస్ఆర్ జిల్లా, [[జమ్మలమడుగు]]లోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించాడు.<ref>http://www.aponline.gov.in/quick%20links/cm/cmprofile.html</ref> ఆయన తల్లిదండ్రులు [[జయమ్మ]], [[రాజారెడ్డి]]. ఆయన తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండటం వల్ల ఆయన పాఠశాల చదువంతా [[బళ్ళారి]]లోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత విజయవాడ [[లయోలా కళాశాల]]లో చేరాడు. 1972లో [[గుల్బర్గా విశ్వవిద్యాలయం]] నుంచి వైద్యవిద్యలో పట్టా పుచ్చుకున్నాడు. గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్యవృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థిసంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. [[శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల]] (యెస్.వి.ఆర్.ఆర్), [[తిరుపతి]] నుంచి హౌస్‌సర్జన్ పట్టా పొందాడు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖరరెడ్డి యెస్.వి.ఆర్.ఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్‌సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
 
తరువాత కొద్దిరోజులపాటు [[జమ్మలమడుగు]]లోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేశాడు. ఆ తరువాత 1973లో పులివెందులలో తండ్రి వై.ఎస్.రాజారెడ్డి పేరుతో కట్టించిన 70 పడకల ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశాడు. ఆ ఆసుపత్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. వాళ్ళ కుటుంబం పులివెందులలో ఒక పాలిటెక్నిక్ కళాశాల మరియు డిగ్రీ కళాశాలను కూడా నెలకొల్పారు. తరువాత వాటిని లయోలా సంస్థలకు అప్పగించారు. పులివెందుల దగ్గరిలో ఉన్న [[సింహాద్రిపురం]]లో ఉన్న కళాశాలను మాత్రం ఇప్పటికీ వీరి కుటుంబమే నిర్వహిస్తోంది.
పంక్తి 44:
 
===ముఖ్యమంత్రిగా===
2004 మే లోమేలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికస్థానాలు సాధించడంతో అదివరకే పార్టీలో పేరుసంపాదించిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు. పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయటం, జలయజ్ఞంలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలు పైనే చేశాడు. 2009 ఏప్రిల్లో జరిగిన 13వ శాసనసభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించడానికి కృషిచేసి వరుసగా రెండో పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాడు.
 
== వివాదాలు, విమర్శలు==
1600 ఎకరాల భూమిని డిసెంబర్ 2006లో ప్రభుత్వానికి అప్పగించటం విపక్షాల విమర్శకి గురయ్యింది. చట్టాన్ని అతిక్రమించి భూమిని కలిగివున్నందుకు విపక్షాలు రాజశేఖరరెడ్డి రాజీనామా చేయాలని కోరాయి.<ref>{{cite news |title= I've 1,000 acres more, says CM |url= http://timesofindia.indiatimes.com/Cities/Hyderabad/Ive_1000_acres_more_says_CM/articleshow/843875.cms |work=Times of India |location=India |date= 19 December 2006 |accessdate=26 May 2009}}</ref>.ముఖ్యమంత్రి పదవిలొపదవిలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమ ఆస్తులు సంపాదించారని విపక్షాలు మరియు పత్రికలు ఆయనపై ఆరోపణలు చేసాయి. అక్రమ ఆస్తుల సంపాదన కేసులో 2011లో ఆయనపై మరియు ఆయన సకుమారుడు జగన్ పై సి.బి.ఐ వారు అభియోగ పత్రం జారీ చేసారు.
 
ఇదివరకు ఏ ముఖ్యమంత్రిపై రాని అవినీతి విమర్శలు వైఎస్సార్ పై వచ్చాయి. వైఎస్సార్ కేబినెట్లో పనిచేసిన మంత్రులు సైతం వైఎస్సార్ పై విమర్శలు కురిపిస్తున్నారు. కేంద్రమంత్రులు, ప్రస్తుత రాష్ట్రమంత్రులు కూడా విమర్శలు లేవదీశారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని లూటీచేశాడని దేవాదాయశాఖ మంత్రి [[రామచంద్రయ్య]] విమర్శించగా<ref>ఈనాడు దినపత్రిక తేది 16-04-2012</ref> వైఎస్సార్ హయంలో బాక్సైట్ గనులను అడ్డగోలుగా, కీలక చట్టాలను తుంగలో తొక్కి మరీ ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టినట్లు కేంద్ర గిరిజన శాఖ మంత్రి [[కిశోర్ చంద్రదేవ్]] ఆరోపించారు.<ref>ఈనాడు దినపత్రిక 22-04-2012</ref> వైఎస్సార్ కాలంలో జరిగిన భూపంపిణీకి కాగ్ సైతం తప్పుపట్టింది.<ref>విశాలాంధ్ర తేది 30-03-2012</ref> వైఎస్ కాలంలో ఆయన కుటుంబం మాత్రమే బాగుపడింది కాని సామాన్య ప్రజలు బాగుపడలేరని<ref>ఆంధ్రప్రభ 08-09-2010</ref> ప్రజలకు పప్పుబెల్లాలు పంచి కొడుకుకి కోట్ల రూపాయలు దోచిపెట్టిన మహానుభావుడని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించాడు.<ref>ఈనాడు 28-04-2012</ref> వైఎస్ ని నమ్మి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టితే ఆయన తన అవినీతితో కొడుక్కి లక్ష రూపాయలు దోచిపెట్టాడని పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఆగ్రహించాడు.<ref>ఈనాడు 23-04-2012</ref> ధనయజ్ఞం చేసి వేలకోట్లు మాయం చేశారని [[యనమల రామకృష్ణుడు]] విమర్శించాడు.<ref>ఈనాడు 16-04-2012.</ref> అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఫించన్లు, కిలో రెండు రూపాయల బియ్యం, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఎంగిలి మెతుకులు విసిరి విలువైన భూములు, ఖనిజ సంప్దను కొట్టేశారని సీపీఐ నేత నారాయణ విమర్శించారు.<ref>ఈనాడు 10-06-2012</ref> వైఎస్ కేబినెట్లో పనిచేసిన అప్పటి మంత్రి [[శంకర్రావు]] వైఎస్ పై చేసిన అవినీతి ఆరోపణలను సుమోటాగా స్వీకరించి హైకోర్టు విచారణ చేపట్టింది. అరవిందో, హెటిరో సంస్థలకు అడ్డగోలుగా భూములు కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా జగన్ సంస్థలలో పెట్టుబడులు వచ్చేలా చేయడం వెనుక అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్, [[జగన్]] లు మరికొందరితో పన్నిన నేరపూరిత కుట్ర ఉందని, వీరు ప్రభుత్వాన్ని మోసం చేశారని సీబీఐ తొలి చార్జిషీట్ లో స్పష్టంగా పేర్కొంది.<ref name="ఈనాడు 05-05-2012">ఈనాడు 05-05-2012</ref> తెలంగాణాకు 50 ఏళ్ళలో జరిగిన అన్యాయం ఒక ఎత్తయితే, వైఎస్సార్ అయిదేళ్ళ పాలనలో సాగిన అన్యాయం ఒకెత్తు అని మాజీ హోంశాఖ మంత్రి [[దేవేందర్ గౌడ్]] ఆగ్రహించాడు.<ref name="ఈనాడు 05-05-2012"/> తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తనయుడి సంస్థలలో అనుమాస్పద రీతిలో వేలకోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చిచేరినట్లు కాగ్ అక్షింతలు వేసింది<ref>http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=5&ContentId=94373</ref> రాంకీకి ప్రయోజనాలు కల్పించడానికి దాని చైర్మెన్ [[అయోధ్య రామిరెడ్డి]]తో కలిసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ కుట్ర పన్నినట్లు సీబీఐ వెల్లడించింది.<ref name="ఈనాడు 08-05-2012">ఈనాడు 08-05-2012</ref> "వైఎస్సార్ ప్రభుత్వం నిబంధనాలకు విరుద్ధంగా జడ్చర్ల సెజ్ లో హెటిరో, అరవిందో గ్రూపులకు చెరో 75 ఎకరాలు కట్టబెట్టింది. రంగారెడ్డి జిల్లా పాశమైలారంలో 30 ఎకరాల భూమిని నిబంధనలు విరుద్ధంగా అరవిందో నుంచి ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కు బదిలీ చేసింది. జడ్చర్లలో 150 ఎకరాల భూమిని తక్కువ ధరకే కేటాయించిం"దన్నది సీబీఐ అభియోగం.<ref name="ఈనాడు 08-05-2012"/> అవినీతి నిరోధక చట్టం కింద అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ నేరానికి పాల్బడ్డారని సీబీఐ తేల్చి చెప్పింది. క్విడ్ ప్రో కో రూపంలో పత్రిక ప్రారంభం కాకమునుపే అందులో అధిక ప్రీమియంతో పెట్టుబడులు వచ్చాయని సీబీఐ చార్జిషీట్లో తెలిపింది.<ref>ఈనాడు 22-05-2012.</ref> వాన్‌పిక్ ప్రాజెక్టుకు సంబంధించి [[నిమ్మగడ్డ ప్రసాద్]] కు వైఎస్ చాలా అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ పేర్కొంది.వాన్‌పిక్ ప్రాజెక్టుతో పాటు షిప్‌యార్డ్, [[ఒంగోలు]]లో గ్రీన్‌ఫీల్డ్ ఏర్ పోర్టుతో పాటు భారీ ఎత్తున అసైండ్, ప్రభుత్వ భూములను కట్టబెట్టడం, స్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీ, సీనరేజి ఫీజుల మినహాయింపు వంటి అక్రమ ప్రయోజనాలెన్నింటినో నిమ్మగడ్డ కంపెనీలకు కల్పించారాని తెలిపింది. ఈ ప్రయోజనాలకు ప్రతిఫలంగా నిమ్మగడ్డ జగన్ కంపెనీల్లో రూ.854 కోట్ల రూపాయలు పెట్టారని తెలిపింది.<ref>ఈనాడు 25-05-2012</ref>
 
==2009 ఎన్నికలు==
పంక్తి 55:
 
==కుటుంబం==
వై.యస్. రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి. వారికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు [[జగన్మోహన్ రెడ్డి]] ప్రస్తుతం కడప లోక్‌సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.ఆయన చాలా వ్యాపారాలతో పాటు [[సాక్షి_సాక్షి (దినపత్రిక)|సాక్షి]] దినపత్రిక, సాక్షి టీవీ చానల్ కూడా నిర్వహిస్తున్నాడు. కూతురు షర్మిళ. తండ్రి రాజారెడ్డి ముఠాకక్షల కారణంగా బాంబుదాడిలో మరణించడం జరిగింది.
గుల్బార్గా లోగుల్బార్గాలో వైద్యవిద్య చదువుతున్నప్పటి నుంచీ ఆయనకు అత్యంత ఆప్తమిత్రుడు కె.వి.పి. రామచంద్రరావు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాక ఆయన్ను సలహాదారుగా నియమించుకున్నాడు.
 
==క్రైస్తవ్యం==
వై.యస్. రాజశేఖరరెడ్డి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సి.ఎస్.ఐ) అనే చర్చికి చెందిన [[ప్రొటెస్టెంటు]] క్రైస్తవుడు. ఈయన తాత బ్రిటీషు మిషనరీల ప్రభావంతో క్రైస్తవమతం పుచ్చుకున్నాడని<ref>http://news.rediff.com/special/2009/sep/07/dr-ysr-was-a-very-devoted-christian.htm</ref><ref>http://specials.rediff.com/election/2004/may/12sld3.htm</ref>, తండ్రి రాజారెడ్డి మిలటరీలో పనిచేస్తూ [[బర్మా]]లో ఉండగా, అక్కడ క్రైస్తవం పుచ్చుకున్నాడని రెండు వేర్వేరు కథనాలు ఉన్నాయి. ఈయన కుటుంబం [[పులివెందల]]లోని సి.ఎస్.ఐ చర్చికి హాజరౌతుంది. రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లోనూ, మరలా 2009లోనూ కుటుంబసమేతంగా [[బెత్లహాము]]యాత్రకు వెళ్ళివచ్చాడు.<ref>http://election.rediff.com/report/2009/may/25/loksabapoll-ysr-to-visit-bethlehem.htm</ref> క్రైస్తవులైనా పారంపరికంగా వచ్చిన హిందూ సాంప్రదాయాలనిసంప్రదాయాలని వీడలేదు. రాజశేఖరరెడ్డి తిరుమలను అనేకమార్లు సందర్శించి వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకొని పూజలు చేశాడు.<ref>http://www.hindu.com/2005/05/06/stories/2005050612790300.htm</ref><ref>http://www.hindu.com/2009/02/04/stories/2009020450910200.htm</ref><ref>http://www.hindu.com/2009/09/05/stories/2009090559220400.htm</ref> అయితే రాష్ట్రంలో క్రైస్తవ ప్రభావం పెంచడానికి, మతమార్పిళ్ళను ప్రోత్సహించడానికి తోడ్పడ్డాడని కొంతమంది ఈయన్ను విమర్శించారు.<ref>http://www.haindavakeralam.com/HkPage.aspx?PAGEID=9124&SKIN=B</ref> ఈయన అల్లుడు [[అనిల్ కుమార్]] మత ప్రచారకుడు. బ్రాహ్మణుడైన అనిల్ కుమార్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మీలాను పెళ్ళి చేసుకున్న తర్వాత క్రైస్తవం స్వీకరించి మతప్రచారకుడయ్యాడు. ఈయన ప్రాభవం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే పెరగడంతో ఎన్నో విమర్శలకు ఊతమిచ్చినట్టైంది.
 
==హెలికాప్టర్ ప్రమాదంలో మృతి==
[[సెప్టెంబర్ 2]], [[2009]] న [[చిత్తూరు]] జిల్లా పర్యటనకు బయలుదేరగా ఉదయం గం.9.35 నిమిషాలకు [[హెలికాప్టరు‌]] తో సంబంధాలు తెగిపోయాయి.<ref>ఈనాడు దినపత్రిక, తేది 03-09-2009</ref> ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్ళు లభించాయి. వై.ఎస్.తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.<ref>ఈనాడు దినపత్రిక తేది 04-09-2009</ref> తమ అభిమాన నాయకుని మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్ర మంతా దాదాపు 67 మంది మరణించారు. వీరిలో చాలా మంది గుండె ఆగి మరణించగా కొద్ది మంది ఆత్మహత్య చేసుకున్నారు.<ref>http://in.news.yahoo.com/43/20090904/812/tnl-67-die-after-ysr-s-death-bereaved-so.html</ref> ప్రమాదస్థలమైన [[రుద్రకొండ]] [[కర్నూలు]]-[[ప్రకాశం జిల్లా]] సరిహద్దులో [[ఆత్మకూరు]] - [[వెలుగోడు]] కు సమీపంలోని [[నల్లమల]] అడవుల్లో ఉంది. హెలికాప్టర్‌ కూలిన ప్రాంతం కర్నూలు జిల్లా ఆత్మకూరునుంచి 8 కిలోమీటర్ల దూరంలోని [[నల్లకాలువ]] గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని [[రుద్రకోడూరు]] గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో ప్రమాద స్థలి మరో 16 కిలోమీటర్లు దూరం ఉంది.<ref>http://www.suryaa.com/showStateNews.asp?ContentId=13914</ref>
; ప్రమాదంపై విచారణ సంఘము