శారద: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారత జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మళయాళీ → మలయాళీ (4), పెళ్లి → పెళ్ళి using AWB
పంక్తి 39:
 
==నేపధ్యము==
చిన్నతనం నుంచి ఈవిడకు భరత నాట్యం నేర్పించారు. అలా కొన్ని నాటకాల్లో నటించే అవకాశం వచ్చింది. వీరి కుటుంబాల్లో ఇలాంటి వాటికి అంగీకరించరు. ఆడపిల్లలకు 14 ఏళ్లకే పెళ్లిపెళ్ళి చేసేస్తారు. కానీ ఈమె ఆసక్తి, ప్రతిభ చూసి వీళ్ళఅమ్మ ధైర్యం చేసి పంపించింది. ఇది నచ్చక వీరితో మూడేళ్ల పాటు ఎవరూ మాట్లాడలేదు.
రక్త కన్నీరు’ నాటకం ఈవిడ జీవితాన్ని మలుపు తిప్పింది. అందులో నటుడు నాగభూషణంగారి పక్కన హీరోయిన్ వేషం.
 
వీళ్ళ నాన్నగారు వెంకటేశ్వర్లుది బంగారు నగల తయారీ వ్యాపారం. బర్మా వెళ్లాలనుకుని, కొన్నాళ్లు మద్రాసులో కాపురం పెట్టారు. రెండు మూడేళ్లు ఉండి, కుదరక తిరిగి తెనాలి వెళ్లిపోయారు. ఆ సమయంలోనే ‘కన్యాశుల్కం’లో నటించే అవకాశం వచ్చింది. 1955లో [[కన్యాశుల్కం]] సినిమాలో బాలనటిగా ఈమె రంగ ప్రవేశం చేసింది. 1955 నుండి 1961 బాలనటిగా ఉన్న శారద, ఆ తరువాత హాస్యనటిగా కొనసాగినది. ఈమె 1975లో ఒక మళయాళీనిమలయాళీని పెళ్ళి చేసుకొని [[కేరళ]]కు తరలి వెళ్ళింది. అక్కడ ఉన్న సమయములో అనేక మళయాళమలయాళ సినిమాలలో నటించింది. ఈమె నటించిన మళయాళమలయాళ చిత్రం స్వయంవరంలో నటనకు గాను శారదకు జాతీయ అవార్డు లభించింది. ఈ సినిమా చాలా విజయవంతమవడముతో నాలుగు భాషలలో తీశారు. అదే పాత్రను ఈమె నాలుగు వేర్వేరు భాషలలో పోషించవలసి వచ్చింది. హిందీ మరియు తెలుగు భాషలలో తీసిన స్వయంవరం సినిమాలు కూడా విజయవంతమయ్యాయి.
శారద మళయాళంలోమలయాళంలో నటించిన తులాభారం సినిమాకు మరియు తెలుగులో నటించిన నిమజ్జనం సినిమాలకు గాను రెండు సార్లు ఉర్వశి ఆవార్డు అందుకొన్నది. ఈ సినిమాలు విడుదలైన తర్వాత అప్పటిదాక హాస్య ప్రధాన పాత్రలలో నటించిన శారదకు గంభీరమైన పాత్రలు రావటం మొదలయ్యింది. ఇతర దక్షిణాది భాషల సినిమాలలో నటిస్తూ జిజీ అయిన శారద చండశాసనుడు సినిమాతో తిరిగి తెలుగు సినిమా రంగములో ప్రవేశించింది.
తెనాలి పట్టణానికి చేనేత వర్గానికి చెందిన శారద 1996వ సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెనాలి పార్లమెంటు సీటుకు పోటీ చేసి ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగం బసవపున్నయ్యపై గెలిచారు.పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న కాలములో తన నియోజక వర్గానికి రైల్వే లైనును మంజూరు అయ్యేలా చేసింది. రోడ్లు మరియు పాఠశాలలు కట్టించింది. అయితే రెండేళ్లకే అప్పట్లో లోక్‌సభ రద్దు కావడంతో తిరిగి 1998వ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. రెండవ పర్యాయం లోక్‌సభకు పోటీచేసినప్పుడు పి శివశంకర్‌ పై ఓడిపోయింది. 24.2.2009 మహాశివరాత్రి రోజున ఆమె ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
8 సంవత్సరాల తర్వాత తిరిగి సినిమా రంగములో ప్రవేశించి మూడో విడత ప్రారంభించింది.
పంక్తి 49:
 
==శారద నటించిన తెలుగు చిత్రాలు==
*[[శారద]]
*[[నిమజ్జనం]]
*[[ఊర్వశి]]
"https://te.wikipedia.org/wiki/శారద" నుండి వెలికితీశారు