శిబి చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: బడినది. → బడింది., , → , using AWB
పంక్తి 1:
{{Underlinked|date=నవంబర్ 2016}}
'''శిబి చక్రవర్తి''' గొప్ప దాత మరియు దయా గుణము కల [[చక్రవర్తి]] అని పేరుగాంచాడు. ఇతడు ఉశీనరుడు అనే మహారాజు కుమారుడు. ఇతని చరిత్ర మహాభారతం, రామాయణం పురాణాలలోనూ బుద్ధుల జాతక కథలలో పేర్కొనబడినది.
 
'''శిబి చక్రవర్తి''' గొప్ప దాత మరియు దయా గుణము కల [[చక్రవర్తి]] అని పేరుగాంచాడు. ఇతడు ఉశీనరుడు అనే మహారాజు కుమారుడు. ఇతని చరిత్ర మహాభారతం, రామాయణం పురాణాలలోనూ బుద్ధుల జాతక కథలలో పేర్కొనబడినదిపేర్కొనబడింది.
 
భృగుతుంగ పర్వతం మీద ఓ సారి పెద్ద ఎత్తున యజ్ఞం చేసాడు శిబి చక్రవర్తి. ఎందరో మహర్షులు ఆ యజ్ఞానికి హాజరయ్యారు.అందరికీ ఘనంగా మర్యాదలు జరిగాయి. అందర్నీ గొప్పగా సత్కరించాడు చక్రవర్తి. ఆయన ఔదార్యానికి, దాననిరతికి తాపసులందరూ ఆశ్చర్యపోయారు. శిబి చక్రవర్తి దానశీలతను పదే పదే ప్రజలందరూ ప్రశంసించారు. ఈ వార్త ఇంద్రుడి వరకూ వెళ్ళింది. ఆయన చక్రవర్తి ఔదార్యాన్ని పరీక్షిద్దామనుకున్నాడు.
Line 10 ⟶ 12:
డేగ మాటలకు సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. శిబి చక్రవర్తి కూడా ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ "ఓ శ్యేనరాజమా! చూడబోతే నీవు ధర్మాధర్మ విచక్షణ తెలిసిన దానిలా ఉన్నావు. శరణన్న వారిని రక్షించటం రాజ ధర్మం. నీ ఆకలిబాధ తీరడానికి ఏ ఆహారం కావాలో చెప్పు. నువ్వు కోరిన ఆహారాన్ని నీకు ఇస్తాను. ఈ పావురాన్ని మాత్రం నీకు వదలిపెట్టను" అన్నాడు.
 
"నేను కోరిన ఏ ఆహారమైనా ఇస్తారా" అని గట్టిగా అడిగింది డేగ. "నిరభ్యంతరంగా!" "అలాగైతే రాజా! నీ శరీరంలో ఈ పావురమంత మాంసాన్ని కోసి నాకివ్వు" అంది డేగ. శిబి చక్రవర్తి నవ్వుతూ,"అలాగే! నీకు సంతోషం కలిగించటం కంటే నాకేం కావాలి?" అని అప్పటికప్పుడు ఒక కత్తి , త్రాసు తెప్పించాడు. సదస్యులందరూ నిశ్చేష్టులయ్యారు. శిబి చక్రవర్తి ఆ పదునైన కత్తిని తీసుకన్నాడు. తన శరీరం నుంచి మాంసాన్ని కోసి త్రాసులో వేశాడు. పావురం బరువుకు సరికాలేదు. మరికొంత మాంసం కోసి వేశాడు.అప్పుడూ సరిపోలేదు. మరికొంత జోడించాడు. ప్రయోజనం లేకపోయింది.అది చూడలేక సభలోని వారంతా కళ్ళు మూసుకున్నారు. ముఖంలో బాధను కనబడనీయకుండా చిరునవ్వు నవ్వుతూ చక్రవర్తి మరికొంత మాంసాన్ని కోసి త్రాసులో వేశాడు. ఫలితం లేకపోయింది. రాజుగారి శరీరం రక్తం ఓడుతుంది.చివరకు తానే వెళ్ళి పళ్ళెంలో కూర్చున్నాడు. తనను తానే దానంగా సమర్పించుకున్నాడు.
 
అప్పుడు ప్రత్యక్షమయ్యారు - ఇంద్రుడు, అగ్ని. "రాజా! నీ దానగుణం నిరుపమానమైంది. నీవంటి ఉత్తముడు ఇంతవరకూ ఈ పుడమిపై పుట్టలేదు. నీ ఔదార్యాన్ని పరీక్షించడానికి నేను డేగగా, అగ్ని పావురంగా వచ్చాము. నీ కీర్తి చిరస్ధాయిగా వర్ధిల్లుతుంది" అని ఆశీర్వదించాడు ఇంద్రుడు.
 
ఆయనకు మళ్ళీ తేజోరూపం ప్రసాదించాడు. కృతజ్ఞతగా శిబి చక్రవర్తి చేతులు జోడించాడు. <ref>http://bhaktisudha.com/index.php?option=com_content&view=article&catid=0&id=219&Itemid=55</ref>
 
==ఇవి కూడా చూడండి==
Line 24 ⟶ 26:
*http://moralstories.wordpress.com/2006/07/11/the-story-of-the-great-shibi-chakravarti/
*http://bhaktisudha.com/index.php?option=com_content&view=article&catid=0&id=219&Itemid=55
 
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/శిబి_చక్రవర్తి" నుండి వెలికితీశారు