శివ (1989 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (5), కి → కి (6), గా → గా , పోయినది. → పోయింది., → (6), ( using AWB
పంక్తి 2:
{{సినిమా|
name = శివ |
director = [[ రాంగోపాల్ వర్మ ]]|
year = 1989|
image=SivaSiva.jpg|
language = తెలుగు|
production_company = [[అన్నపూర్ణ స్టూడియోs & ఎస్.ఎస్.క్రియెషన్స్ ]]|
music = [[ఇళయరాజా]]|
starring = [[అక్కినేని నాగార్జున ]],<br>[[రాంజగన్]],<br>[[అమల ]],<br>[[రఘువరన్]],<br>[[చిన్నా]]|
}}
టైటిల్ రోల్ ని [[అక్కినేని నాగార్జున]] పోషించిన '''శివ''' చిత్రం మాఫియా నేపథ్యంలో కాలేజీ కుర్రాళ్ళ మధ్య జరిగే రాజకీయాలపై చిత్రీకరించబడ్డ సినిమా. [[అమల]] కథానాయికగా, [[రఘువరన్]] ప్రధాన ప్రతినాయకుడుగా, అతని సహచరుడుగా [[తనికెళ్ళ భరణి]] నటించారు. భరణి కథ కూడా అందించారు. సీఎన్ఎన్-ఐబిఎన్ రూపొందించిన భారతదేశ 100 ఉత్తమ చిత్రాలలో శివ కూడా ఒకటి. [[ఇళయరాజా]] స్వరాలని కూర్చారు. [[రాంగోపాల్ వర్మ]]కి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. [[తమిళం]] లో ఉదయం గాఉదయంగా అనువదించబడగా, [[హిందీ]] లో 1990 లో పునర్నిర్మించారు. ఈ చిత్రంలో చూపిన కళాశాల ప్రాంగణం [[సికింద్రాబాద్]] లోని కీస్ ఉన్నత పాఠశాలది.
==కథ==
(కల్పిత) వి ఏ ఎస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్సెస్ కళాశాల ఎదురుగా గణేశ్ ([[తనికెళ్ళ భరణి]]) తన అనుచరులతో ఎదురుచూస్తున్న సన్నివేశంతో చిత్రం మొదలవుతుంది. జెడి (జెడి చక్రవర్తి) సైగతో గణేశ్ బృందం ఒక విద్యార్థిని దారుణంగా హతమారుస్తారు.
 
జెడి విద్యార్థి నాయకుడని, కాలేజీ లోకాలేజీలో ఎదురు లేని మనిషి అని, ఆ కళాశాల స్టూడెంట్ యూనియన్ కి ఏకపక్ష ప్రెసిడెంట్ అని తెలుస్తుంది. గణేష్ ద్వారా జెడి కిజెడికి ఆ ప్రాంతంపై గుత్తాధిపత్యం చలాయిస్తున్న భవానీ ([[రఘువరన్]]) తో పరిచయం ఉంటుంది. విద్యార్థులతో ఉన్న ఈ సంబంధంతోనే భవానీ రాజకీయ నాయకుడైన మాచిరాజు ([[కోట శ్రీనివాస రావు]]) యొక్క రాజకీయ మరియు నేర కార్యకలాపాలకి విద్యార్థులని ఉపయోగించుకొంటూ మాచిరాజుకు వెన్నుదన్నుగా ఉంటాడు.
 
ఇటువంటి కళాశాలలో శివ ([[అక్కినేని నాగార్జున]]) విద్యార్థిగా చేరతాడు. మల్లి ([[శుభలేఖ సుధాకర్]]), ఆశ ([[అమల]])తో స్నేహం కలుగుతుంది. అమ్మాయిలను ఇబ్బంది పెట్టటం, అధ్యాపకులని అవమానపరచటం వంటి పనులతో అల్లరి చేస్తున్న జెడి కిజెడికి శివ తారసపడతాడు. మొదటి సారి స్నేహితుల అభ్యర్థన మేరకు జెడిని క్షమించినా రెండవసారి శివని జెడి కవ్వించి రెచ్చగొట్టటంతో సైకిల్ చైనుతో జెడి, అతని అనుచరులపై తిరగబడతాడు. అంతేకాక కళాశాల ప్రాంగణంలోనే జెడి నిజెడిని వెంబడించి అతనిని అతికిరాతకంగా శిక్షిస్తాడు. అదివరకూ ఎవరూ తనని ఎదిరించలేరన్న ధీమాతో ఉన్న జెడి శివ తెగింపుకి నిశ్చేష్టుడౌతాడు.
 
ఈ అనూహ్య సంఘటన మరో రెండు పర్యవసానాలకి దారి తీస్తుంది. మొదటిది జెడి గణేశ్ ని రంగంలోకి దింపగా, రెండవది స్నేహితులు శివని ఎన్నికలలో నిలబడటానికి ప్రోత్సహించటం. కానీ శివ అర్హుడైన తన సహచరుడు జగన్ ([[రాంజగన్]]) ని ఎన్నికల్లో నిలబెట్టమని కోరతాడు. గణేశ్ శివ ప్రయత్నాలని ఆపమని కోరతాడు. కానీ శివ తమ కళాశాల వ్యవహారాలలో వీధి రౌడీల జోక్యం అనవససరమని స్పష్టం చేస్తాడు.
 
గణేశ్ బెదిరించే ప్రయత్నం చేయటంతో శివ అతనికి కూడా దేహశుద్ధి చేయటంతో వ్యవహారం భవానీ దాకా వెళుతుంది. మొదట ఆగ్రహించినా తర్వాత శివలో భవానీ జెడికి ప్రత్యామ్నాయ శక్తిని గమనిస్తుంటాడు. భవానీ జగన్ ని హతమార్చగా శివ ఎన్నికల్లో నిలబడటానికి అంగీకరిస్తాడు.
 
కార్మిక నాయకుడు కృష్ణారెడ్డి నికృష్ణారెడ్డిని భవానీ మోసం చేయటంతో అతను శివ పంచనచేరతాడు. శివ అతని బలగాన్ని కోరి అతనికి సాయపడతాడు. శివపై తనకున్న ప్రేమని ఆశ వ్యక్తపరచటంతో వారి వివాహం జరుగుతుంది.
 
శివ పై భవానీ దాడులు మొదలవుతాయి. శివ వాటిని తిప్పికొట్టడంతో బాటు భవానీ బలగాల్ని తన వైపు తిప్పుకొంటాడు. పర్యవసానంగా మాచిరాజు భవానీ కిభవానీకి సహకారాన్ని ఆపుతాడు. దెబ్బతిన్న భవానీ శివ ఇంటిపై దాడి చేస్తాడు.
 
చివరకి జరిగే యుద్ధంలో శివ భవానీని హతమార్చి మహానగరాన్ని ఒక సంఘ వ్యతిరేక శక్తి నుండి కాపాడగా, తన స్వంత అన్న కిఅన్నకి ఏకైక కుమార్తె అయిన కీర్తిని ఈ యుద్ధంలో పోగట్టుకొంటాడు.
 
'సంగీతం - ఇళయరాజా'''
పంక్తి 47:
==విశేషాలు==
* శివ పాత్రకి నాగార్జున, తెలంగాణా యాస గల గణేశ్ పాత్రకి భరణి, మాఫియా డాన్ గా రఘువరన్ ల ఎంపిక
* జెడి పాత్ర చక్రవర్తికి స్థిరపడిపోయినదిస్థిరపడిపోయింది. (జెడి చక్రవర్తి అని చెబితే తప్ప ఏ చక్రవర్తో పోల్చుకోలేనంతగా)
* సైకిలు చైనుతో శివ తిరగబడటం. (తర్వాత చాలా సినిమాలలో దీనిని పేరడీగా కూడా ఉపయోగించారు)
* తన పైకి పంపిన మనిషిని శివ భుజాన వేసుకొని నేరుగా భవానీ ఎదుటకి వెళ్ళే సమయంలో గణేశ్ భవానీ చెవిలో చిన్నగా '''శివ అంటే వీడే''' అని చెప్పే పతాక సన్నివేశం
* ఇదే సంవత్సరం మే లోమేలో విడుదలైన [[గీతాంజలి (1989 సినిమా)]] లో మృత్యుకారకమైన రోగం బారిన పడిన భగ్నప్రేమికుడిగా, సౌమ్యుడిగా ఉండే పాత్ర పోషించిన నాగార్జున దానికి పూర్తి వ్యత్యాసమైన శివ పాత్రని పోషించటం. ఈ రెండు చిత్రాలు సమస్థాయిలో విజయాలని అందుకోవటం.
 
 
[[వర్గం:అక్కినేని నాగార్జున సినిమాలు]]
 
[[ml:പരമശിവന്‍]]
[[es:Shiva]]
[[it:Śiva]]
[[lt:Šyva]]
[[ml:പരമശിവന്‍]]
[[ms:Siva]]
[[th:พระอิศวร]]
"https://te.wikipedia.org/wiki/శివ_(1989_సినిమా)" నుండి వెలికితీశారు