సత్యమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ని → ని , కూడ → కూడా (2), సారధి → సారథి, పని చేస using AWB
పంక్తి 39:
 
[[ఫైలు:CHADUVULRAAV_BY_SATYAMURTHY.jpg|150px|right|thumb|'''సత్యమూర్తి సృష్టించిన పసిద్ధిగాంచిన ''చదువుల్రావు''''']]
'''సత్యమూర్తి''' గా దశాబ్దాల నుండి వ్యంగ్య చిత్రాలను, ఇతర చిత్రాలను వేస్తున్న ఇతని పూర్తి పేరు భావరాజు వెంకట సత్యమూర్తి. పేరులోని "సత్యమూర్తి" ని కలంపేరుగా ధరించి, [[తెలుగు]] పాఠకలోకానికి కార్టూనిస్టుగా చిరపరిచితులయ్యాడు. తెలుగు వ్యంగ్య చిత్ర చరిత్రలో ప్రసిద్ధికెక్కిన కార్టూన్ పాత్ర '''చదువుల్రావు''' ఇతడి సృష్టే. తెలుగు కార్టూనిస్టులలో ఎంతో అనుభవశాలిగా, సీనియర్‌గా గౌరవం పొందుతుతూ, తన కార్టూనింగును కొనసాగిస్తున్నాడు.
 
==వ్యక్తిగతం==
ప్రపంచం అంతా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే వేళ, [[జనవరి 1]], [[1939]]న జన్మించాడు. ఇతని తండ్రి భావరాజుసత్యనారాయణ ఇంజనీరు మరియు "రావు సాహెబ్" బిరుదాంకితుడు. తల్లి పేరు వెంకాయమ్మ. సత్యమూర్తి చదువు పి.ఆర్‌.కాలేజీ, కాకినాడలో మొదలయ్యింది. ఇంటర్‌మీడియేట్‌ అక్కడ పూర్తిచేసుకుని, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (Bachelor of Arts-B.A.) మరియు ప్లీడరీ-బాచిలర్ ఆఫ్ లాస్ (Bachelor of Laws-LLB) పూర్తి చేశాడు. ఆ తరువాత, తన అభిరుచి ప్రకారం ఫైన్ ఆర్ట్ కాలేజి (College of Fine Art), హైదరాబాదు నుండి అప్లైడ్ ఆర్ట్స్ (Applied Arts) అభ్యసించాడు.
 
==వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు==
తన చిన్న వయస్సులోనే, ఇతను [[1958]]నుండి వ్యంగ్య చిత్రాలు వేయటం మొదలు పెట్టాడు. ఇతను వేసిన వ్యంగ్య చిత్రాలు చక్కగా చెక్కినట్లు ఉంటాయి. గీసిన పాత్రలన్నీ సందర్భానికి సరిపోయ్యేట్టుగా ఉంటాయి. సందర్భానుసారం మరొకరకంగా వెయాల్సి వస్తే తప్ప, సామాన్యంగా బొమ్మలన్నీ కూడా అందంగా వేస్తాడు. బొమ్మలలో చక్కటి నైపుణ్యం, నాణ్యం తొణికిసలాడుతుంటాయి. వేసిన బొమ్మలకు సరిపొయ్యే హాస్య ప్రధానమైన సంభాషణలు చక్కటి తెలుగులో వ్రాయటం ఇతని ప్రత్యేకత.
 
==వ్యంగ్య చిత్రాలు పత్రిక ముఖ చిత్రాలుగా==
పంక్తి 52:
==రచనా వ్యాసంగం==
[[ఫైలు:KARTOON GIYYATAMELAA_SATYAMURTY.JPG|100px|right|thumb|వీరు రచించిన '''కార్టూన్ వెయ్యటం ఎలా''' అన్న పుస్తకానికి ఆంగ్ల ప్రతి ముఖ చిత్రం]]
కార్టూన్లు వేయ్యటమే కాకుండా అనేక రచనలు కూడకూడా చేశాడు, పుస్తకాలకు ముఖచిత్రాలు కూడకూడా చిత్రించాడు. వాటిలో కొన్ని:
===బొమ్మలు===
* భగవాన్ సత్యసాయి మీద వ్రాయబడిన అనేక పుస్తకాలకు ముఖ చిత్రాలు వేశాడు.
* సనాతన సారధిసారథి పత్రిక మరియు ఆంగ్ల పత్రిక భావాన్స్ జర్నల్ (Bhavans Journal) లోను, భగవాన్ [[సత్య సాయి బాబా]] కథలకు బొమ్మలు వేశాడు.
 
===పుస్తకాలు===
* కార్టూన్లు వెయ్యటం ఎలా అన్న విషయం మీద ఆంధ్రభూమి వారపత్రికలో రెండు సంవత్సరాలపాటు ధారావాహిక రచించి, ఔత్సాహిక వ్యంగ్య చిత్రకారులకు ఎంతగానో తోడ్పడ్డాడు. ఈ ధారావాహిక సంకలనంగా తెలుగులో ప్రచురించబడింది. ఇదే పుస్తకం ఇంగ్లీషులో హౌ టు డ్రా ఎ కార్టూన్ (How to Draw a Cartoon) మరియు హిందీలో కార్టూన్ కైసె బనాయే (कार्टून कैसे बनाए) అన్నపేరుతో ప్రచురించబడింది.
*శ్రీ సత్యసాయి మీద అనేక పుస్తకాలు
*భగవాన్ సత్య సాయి వారి ఉపన్యాసాల ఆధారంగా చిన్న కథలను 10 సంపుటాల రచిచంచాడు.
*ఫన్ విత్ క్వాలిటీ (Fun with Quality) అన్న పుస్తకం భెల్ (Bharat Heavy Electricals Limited-BHEL) వారికోసం రచించాడు
 
===ఇతరాలు===
పంక్తి 69:
==అందుకున్న బహుమతులు==
ఇతని సుదీర్ఘ రచనా మరియు చిత్రకళా వ్యాసంగంలో అనేక బహుమతులను అందుకున్నాడు. అందులో మచ్చుకగా కొన్ని:
* [[1977]] లో ఢిల్లీ [[తెలుగు అకాడమీ]] వారి ఉగాది పురస్కార బహుమతి లభించింది.
* [[1982]] సంవత్సరానికి [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని అప్పటి ముఖ్య మంత్రి నందమూరి తారకరామారావు చేతులమీదుగా అందుకున్నాడు.
* [[1986]] లో వంశీ బర్క్‌లీ వారి ఉత్తమ కార్టూనిస్ట్ బహుమతి లభించింది.
* [[2002]]లో [[ఢిల్లీ]] తెలుగు సంఘంవారి 24వ వార్షికొత్సవ బహుమతి లభించింది.
* 2002 లోనే [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రెస్ అకాడమీ వారి బహుమతి లభించింది.
పంక్తి 80:
Image:SATYAMURTHY_COVERY PAGE_3.JPG|ఇంకొక కార్టూన్ ముఖ చిత్రం ఆంధ్ర పత్రిక వారు వేసినది
Image:SATYAMURTHY_COVERY PAGE_1.JPG|మరొక కార్టూన్ ముఖ చిత్రం ఆంధ్ర ప్రభ వారు వేసినది
Image:HENPECKED_HUSBAND2_CARTOON_RAMAKRISHNA.JPG|చేయకూడని పని చేసిపనిచేసి దొరికిపోయి కోపం నటించి తప్పుకోచూస్తున్న భర్త
Image:HENPECKED_HUSBAND_CARTOON_SATYAMURTHY.JPG|బ్యార్య చెప్పుచేతల్లో ఉన్న భర్తకు కొన్ని నిబంధనలు
</gallery>
 
 
[[వర్గం:1939 జననాలు]]
[[వర్గం:తెలుగు వ్యంగ్య చిత్రకారులు/కార్టూనిస్ట్‌లు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
{{తెలుగు వ్యంగ్య చిత్రకారులు}}
 
<!-- ==బయటి లింకులు== -->
<!-- [http://images.google.co.in/imgres?imgurl=http://www.telugupeople.com/uploads/photoFeatures1_3/2287.JPG&imgrefurl=http://www.telugupeople.com/Cartoons/index.asp%3FId%3D2287&usg=__M2BreP3AwWBbf6wPdgntnjxePIM=&h=307&w=500&sz=81&hl=en&start=1&tbnid=VxYDylAwhFeBuM:&tbnh=80&tbnw=130&prev=/images%3Fq%3Dsatyamurthy%2Bcartoons%26gbv%3D2%26hl%3Den/ ఈ లింక్‌తో సత్యమూర్తి కార్టూన్లను అనేకం చూడవచ్చు] --> <!-- broken link -->
 
[[వర్గం:1939 జననాలు]]
[[వర్గం:తెలుగు వ్యంగ్య చిత్రకారులు/కార్టూనిస్ట్‌లు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/సత్యమూర్తి" నుండి వెలికితీశారు