సింగపూరు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యంను → యాన్ని , కిండర్ గార్డెన్ → కిండర్ గార్టెన్ (2), లో using AWB |

పంక్తి 61:
|cctld = [[:en:.sg|.sg]]

'''సింగపూర్''' (మలయ్: Singapura; చైనీస్: 新加坡, Xīnjiāpō; [[తమిళం]]: சிங்கப்பூர்), అధికారిక నామం '''రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్''' ఒక చిన్న ద్వీపం, నగరం, దేశం కూడాను. [[మలేషియా]]కు దక్షిణాన
[[బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ]] [[1819]]వ సంవత్సరములో అడుగుపెట్టినప్పుడు ఇది మలయ్, ఒరాంగ్ లౌట్ జాలర్లు నివసించు [[గ్రామం]]. బ్రిటిషు వారు రవాణాల నిమిత్తం వాడుకున్నారు. [[రెండవ ప్రపంచ యుద్ధం]] సమయంలో [[జపాను]] ఆక్రమించింది, [[1945]] సంవత్సరములో తిరిగి బ్రిటిష్ వారి పరమయ్యింది. [[1963]] సంవత్సరములో [[మలేషియా]] ఏర్పడినప్పుడు దానిలో భాగంగా ఉండి, [[రెండు]] సంవత్సరముల తరువాత సైద్ధాంతిక విభేదాలతో విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడినది.
స్వతంత్ర దేశంగా అవతరించిన తరువాత, సగటు సింగపూర్ నివాసి జీవనశైలి గణనీయంగా మెరుగుపడింది. విదేశీ పెట్టుబడులు ప్రభుత్వ యాంత్రీకరణము వలన ఎలక్ట్రానిక్సు మరియు కర్మాగారం ఆధారంగా ఒక ఆధునిక
=== పేరు వెనుక గాథ ===
పంక్తి 71:
[[దస్త్రం:Marina bay new IR.jpg|thumb|left|200px|సింగపూరు యొక్క డౌన్ టౌన్]]
దక్షిణ ఆసియా ఖండంలో అతి చిన్న దేశము సింగపూర్. వ్యాపారపరంగానూ,
సింగపూర్ లో ఇటీవల కాసినోవా అనబడే పాశ్చాత్యుల జూదగృహము నిర్మించడముతో ధనవంతులైన వ్యాపారవేత్తలను ఇది చక్కగా ఆకర్షిస్తూఉంది. ఆరోగ్యపరంగానూ సింగపూర్ అభివృద్ధి పథంలో ఉండటంతో విదేశీయులు సైతము [[వైద్యము]] కోసము ఇక్కడకు వస్తూ ఉంటారు. పరిశుద్ధతలో కూడా చక్కటి పేరు సంపాదించిన దేశము ఇది. సింగపూరు అభివృద్ధికి ఇక్కడి పరిపాలనా దక్షత కూడా ఒక కారణము. పకడ్బందీగా ఉండే పరిపాలనా నిర్వహణ అతి చిన్నదేశమైన సింగపూరుని ప్రపంచ దేశాలలో
== చరిత్ర ==
సింగపూరు అనే పేరుకు సంస్కృత పదమైన సింహపుర్ (सिंहपुर) మూలమని ఇక్కడ ప్రజల విశ్వాసము. 14 వ
ప్రారంభంలో ఈ ద్వీపము 'సుమత్రన్ శ్రీవజయ' సామ్రాజ్యములో తెమసెక్ (సముద్ర పురము) అనే జవనెసె నామముతో వ్యవహరించబడి క్రీపూ 2 వ శతాబ్దమునుండి 14 వ శతాబ్దము వరకు వ్యాపారకేంద్రముగా విలసిల్లిన తరువాత క్షీణదశ ఆరంభమైంది. పురాతన అవశేషాలు ఇంకా తెమసెకలో మిగిలి ఉన్నా ఆర్కియాలజిస్టులచే ఇది నిర్ధారించబడలేదు. 16వ
[[1819]]వ సంవత్సరము [[జనవరి 29]] వ తేదీన ఈ ద్వీపంలో కాలిడిన థోమస్ స్టాన్ ఫోర్డ్స్ రాఫిల్స్ భౌగోళికంగా సింగపూరు వ్యాపారానికి అత్యంత అనుకూలమైన ప్రదేశంగా గుర్తించి ఈస్టిండియా కంపెనీ తరఫున బ్రిటిష్ వ్యాపారకేంద్రముగా అభివృద్ధి పరచే ఉద్దేశముతో ఒక ఒప్పందము చేసుకున్నాడు.ఈ ఒప్పందము దేశములో ఆధునిక యుగానికి నాంది పలికింది. అంతర్జాతీయంగా ఇక్కడకు వచ్చినివసించే వారిపై పౌరసత్వ కట్టుబాట్లు నిర్బంధం లేని కారణంగా వివిధ సంస్కృతులకు చెందిన ప్రజలు ఇక్కడ స్థిరపడటము ఆరంభము అయినది. [[1858]] వ సంవత్సరము నుండి జరిగిన ఈస్టిండియా పరిపాలన [[1867]] వ సంవత్సరమున బ్రిటిష్ సామ్రాజ్యపు ఛత్రము కిందకు చేరింది. క్రీ.శ. [[1869]] వ సంవత్సరానికి జనసంఖ్య 1,00,000 కు చేరుకుంది.
బ్రిటిష్ కాలనీ ఆరంభం నగరనిర్మాణ వ్యూహాలతో నగరాన్ని సంస్కృతి పరంగా విభజించింది. సింగపూర్ నది ప్రాంతము వ్యాపారుల, బ్యాంకర్ల ఆధిక్యములో వాణిజ్యపరంగా అభివృద్ధిని సాధించింది.
రెండవ ప్రపంచ యుద్ధకాలములో ఈ ద్వీపము ఆంగ్లేయ సైనికుల అసమర్ధత కారణంగా [[1942]] వ సంవత్సరము [[ఫిబ్రవరి 15]]వ తేదీన 6 రోజుల యుద్ధము తరువాత జపాను సైన్యంచే ముట్టడించబడి [[జపాను]] వశమైంది. ఈ యుద్ధము బ్రిటిష్ సైన్యము యొక్క అతి పెద్ద వైఫల్యముగా [[చర్చిల్]] చే వర్ణించబడింది.
పంక్తి 87:
== స్వాతంత్ర్యము ==
[[1959]] వ సంవత్సరములో స్వతంత్రదేశంగా అవతరించిన సింగపూరు [[1962]]వ సంవత్సరము ఆరంభమైన వ్లీన చర్చల ఫలితంగా [[1963]] [[సెప్టెంబర్ 16]] న
== పర్యాటక కేంద్రముగా సింగపూరు ==
సింగపూరు పారిశుద్ధ్యానికి పేరు పొందిన నగరము. ఈ దేశ
=== నైట్ సఫారీ ===
పంక్తి 101:
ఈ ద్వీపానికి కేబులు కారులో ఒక దారిలో వెళ్ళవచ్చు. తిరిగి రావడానికి బస్సురూటును ఉపయోగించుకుంటారు. సింగపూరులో భాగమైన సెంటోసా ద్వీపంలో సింగపూరు జాతీయ చిహ్నమైన '''మెర్లాయన్''' కింది సగ భాగము చేప, పై సగ భాగము సింహము. సందర్శకులను మెర్లాయన్ తలభాగమువరకు లిఫ్ట్ లో తీసుకు వెళతారు. ముందుగా ఒక చిన్న ప్రదర్శన ఉంటుంది .ఇక్కడ సంప్రదాయక భవనంలో సింగపూరు చరిత్రను లేజర్ షో సహాయంతో ప్రదర్శిస్తారు. అతి సహజమైన పరిస్థితిలో జీవము ఉట్టిపడే బొమ్మలతో నావ ప్రయాణము, నావికులు, వర్తకము అనేక సంప్రదాయాలు ప్రతిబింబించే బొమ్మలతో కూడిన ప్రదర్శనశాలను సందర్శకులు సందర్శించవచ్చు.
ఇక్కడ చూడవలసిన వాటిలో '''ఆండర్ వాటర్ వరల్డ్''' కూడా ముఖ్యమైనదే. భూగర్భములో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ వరల్డ్ లో అనేక సముద్ర ప్రాణులు సజీవముగా చూసే ఏర్పాటు ఉంది. రాత్రివేళలో అద్భుతమైన లేజర్ షోలు జరుగుతూ ఉంటాయి. సింగపూరు సముద్ర తీరాన రేవు (హార్బర్) నుండి క్రూయిజ్ లలో అర్ధరోజు టూర్, దీర్ఘకాల అంటే [[రెండు]] నుండి [[మూడు]] రోజుల పడవ ప్రయాణము చేయవచ్చు. ఈ టూరులో ఈ దేశములో భాగమైన ఇతర దీవులను సందర్శించవచ్చు. సముద్రతీరములో [[డాల్ఫిన్]] షో లను జరుపుతూ ఉంటారు.
=== లిటిల్ ఇండియా, చైనాటౌన్, సెరంగూన్ రోడ్ ===
పంక్తి 108:
== రవాణా సదుపాయాలు ==
[[దస్త్రం:Singapore port panorama.jpg|center|650px|thumb|సింగపూర్ రేవు - వెనుక ప్రక్క సెంతోసా దీవి చూడవచ్చును]]
సింగపూరు ప్రజలు ఎక్కువగా మెట్రో రైళ్ళు
== విదేశాంగ వ్యవహారాలు ==
పంక్తి 114:
== జనసంఖ్య ==
[[2007]] సెప్టెంబర్ నాటికి సింగపూరు జనాభా 46,80,000 ను చేరింది.వీరిలో ఇక్కడ స్థిరపడినవారు 37,00,000.వీరిలో చైనీయులు 75.2%, మలయావారు 13.6%, భారతీయులు8.8%,2.4 ఇతర దేశాలకు చెందినవారు.ప్రపంచంలో జనసాంద్రతలో ప్రజా పరిపాలన అమలులో ఉన్న దేశాలలో సింగపూరు రెండవ స్థానంలోఉంది. [[1960]]
== సింగపూరు భౌగోళికస్థితి ==
ప్రధానద్వీపంతో చేరి 63 ద్వీపాల సమూహంతో కూడిన దేశం సింగపూరు. జురాన్గ్ దీవి, సెంటోసా దీవి, పులవ్ టెక్నాగ్ దీవి, పులవ్ యుబిన్ దీవి కొంచెం విస్తీర్ణంలో పెద్దవి. మిగిలినవి ఆకారములో చిన్నవి. జురాన్గ్ దీవిని పెట్రో కెమికల్ సంబంధిత వ్యవహారాలకు మాత్రమే వాడుకుంటారు. సెంటోసా దీవిని వినోదాలకు పర్యాటక ఆకర్షణకు వాడుకుంటారు, పులవ్ టెక్నాగ్ దీవిని రక్షణదళ సంబంధిత వ్యవహారాలకు వాడుకుంటారు. పులవ్ యుబిన్ దీవిలో ఇంకా నగరాభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టనందువలన అది సహజ సౌందర్యముతోనూ, పురాతన జీవన శైలిని ప్రతిబింబించే కట్టడాలతోను అలరారుతూ సందర్శకులను ఆకర్షిస్తుంది.166 మీటర్ల ఎత్తు కలిగిన బుకిత్ తిమాహ్ హిల్ సింగపూరులో ఎత్తైన ప్రదేశంగా
సింగపూరు ప్రభుత్వం చేపట్టిన అనేక భూమి విస్తీర్ణ కార్యక్రమాల కారణంగా ఈ దేశం తన భూప్రదేశాన్ని 1960 నుండి ఇప్పటి వరకు 581.5 చదరపు కిలోమీటర్ల నుండి 704 చదరపు కిలోమీటర్లుగా అభివృద్ధి పరచుకుంది. రెండువేల సంవత్సరానికి ఇంకా 100 చదరపు కిలోమీటర్ల భూమిని అభివృద్ధి చేస్తారని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్న చిన్న మట్టి దిబ్బలుగా వున్న దీవులు ప్రధాన దీవులలో కలుస్తూ కొంత భౌగోళిక రూపురేఖలు మారుతూ ఉన్నాయి.
కొంత కొండ ప్రాంతాలనుండి భూ ప్రాంతాన్ని సేకరించారు.నగరాభివృద్ధి పథకాల కారణంగా తరిగి పోయింది పోను, 23 శాతము రైన్ ఫారెస్ట్ రిజర్వ్ గా ఉంది.దీనిలో కొంత '''బుకిత్ తిమాహ్ నేచర్ రిజర్వ్ '''కాగా మిగిలినవి మానవ నిర్వాహిత ఉద్యానవనాలు (పార్క్) సింగపూరుబొటానికల్ గార్డెన్ వీటిలో ఒకటి.
== సింగపూరు వాతావరణ స్థితి గతులు ==
సింగపూరు సంవత్సరమంతా మారని పగటి కాలం, రాత్రి కాలం కలిగిన ప్రత్యేక దేశం. దాదాపు ఒకే రకమైన శీతోష్ణ స్థితి, విస్తారమైన వర్షాలు కలిగిన దేశం . గాలిలో తేమ సరాసరి 90 శాతం. వరసగా వర్షాలు పడే సమయాలలో ఇది 100 శాతానికి చేరుకుంటుంది.వర్షాలు ఏసమయంలోనైనా రావడం సహజం కనుక ఇక్కడి ప్రజలు ప్రతి రోజు గొడుగులను వెంట ఉంచుకుంటారు.వీరు వాడే గొడుగులు ప్రత్యేకతను కలిగి ఉంటాయి.అధిక ఆవశ్యకత కారణంగా ఇవి దృఢంగాను ఆకర్షణీయంగానూ ఉంటాయి.నవంబర్
== సహజ వనరులు ==
సింగపూరు ప్రజల నీటి అవసరాలను సగభాగం వర్షాధార రిజర్వాయరుల ద్వారా పూర్తి చేస్తారు.మిగిలిన నీరు మలేషియా నుండి సరఫరా అవుతుంది.బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో చేసుకున్ననీటి ఒప్పందాలు ఇరు దేశాలమధ్య దీర్ఘ కాల వివాదాలకు గురవుతున్నాయి. ప్రస్తుత కాలంలో నిర్మిత మౌతున్న రీసైక్లింగ్ ప్లాంట్స్ కారణంగా వెలుపలినుండి సరఫరా అవుతున్న నీటిని కొంచెం కొంచెంగా తగ్గిస్తున్నారు. సింగపూరులో 19 నీటి రిజర్వాయరులు,19 నీటి శుద్ధీకరణ విభాగాలు,14 నీటి నిల్వల రిజర్వాయరులు ఉన్నాయి. ప్రస్తుతము నిర్మాణంలో ఉన్న మరీనా బరేజ్ 2009 లో తన నిర్మాణపు పనులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు.మలేషియాతో ప్రస్తుతము అమలులో ఉన్న రెండు నీటి సరఫరా ఒప్పందాలు వరుసగా 2011, 2061 సంవత్సరాలలో ముగిసిపోనున్న కారణంగానూ, మూల్యం విషయంలో కొలిక్కి రాని వివాదాల కారణంగాను దేశం నీటి వరుల
== మతము ==
పంక్తి 132:
== సంస్కృతి ==
సింగపూరులో పూర్వీకులైన మలాయ్ ప్రజలు, మూడవ తరానికి చేరుకున్న చైనీయులు, విదేశీనివాసులైన ఇండియనులు, అరేబియనులు, యూరేషియనులు నివసిస్తున్న కారణంగా మిశ్రమ సంప్రదాయాలు కలిగి ఉంది. కులాంతర, మతాంతర వివాహాలు ఇక్కడ సహజంగా సంభవిస్తూ ఉంటాయి. వివిధ మతాల ఆలయాలు వీరి మిశ్రమ మత సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. ఇక్కడ వారి వారి ప్రత్యేకత కలిగిన హోటల్స్ (భోజనశాలలు) వారి సంప్రదాయక ఆహారాలతో చేర్చి అవసరాలకు అనుగుణంగా ఇతర సంప్రదాయక ఆహారాలనూ విక్రయించడం సహజం. ఆహార తయారీలో కూడా మిశ్రమ విధానాలు చోటు చేసుకున్నాయి.
== విద్యావిధానం ==
సింగపూరు అత్యధిక అక్షరాస్యులు కలిగిన దేశం. 50 శాతం
== భాష ==
సింగపూరు జాతీయ భాష [[మలయ్]]. వారి జాతీయ గీతం '''మజులా సింగపుర '''. అధికార భాషలు మలాయ్, [[మాండరిన్]], [[ఇంగ్లీష్]], [[తమిళం]]. దేశ స్వాతంత్ర్యానంతరము ఇంగ్లీష్ అధికారిక హోదాను పొందింది. మొదట [[అమెరికా|అమెరిక]]న్ యాసతో ప్రభావితమైన [[ఇంగ్లీష్]] ప్రారంభమైంది. విద్యా విధానాలలో ఇంగ్లీష్ మాధ్యమం కారణంగా ఇంగ్లీష్ వాడకం దేశమంతా వ్యాపించింది. ఇంగ్లీష్ సాహిత్యం అధికంగా సింగపూరు సాహిత్యంలో చోటు చేసుకోవడం సహజమై పోయింది. రాజ్యాంగ ప్రచురణలకు ఇతర అధికారిక అనువాదాలతో కూడిన ఇంగ్లీషుకు ప్రాముఖ్యత ఇవ్వడం అలవాటు. వివిధ భాషలను మాతృభాషగా కలిగిన ప్రజలు నివసిస్తున్న కారణంగా అనుసంధాన భాషగా ప్రజల మధ్య ఇంగ్లీష్ ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఇక్కడి ప్రజల మాతృభాషలతో కలగలసిన సింగ్లీష్ ఇక్కడి ప్రజల స్వంతం. సింగ్లీష్ అంటే చైనా, మలయా, ఇండియన్ భాషల సంక్రమణలతో మిశ్రితమైన ఇంగ్లీష్.ప్రభుత్వం అవిశ్రాంతంగా సింగ్లీషును తగ్గించి మంచి ఇంగ్లీష్ మాట్లాడమని ప్రజలకు హితవు చెబుతూనే ఉంది.
== ఆర్ధికరంగం ==
ఎంట్రీపోర్ట్ (సుంకరహితం) వ్యాపార విధానాల వలన తన
పర్యాటక రంగానికి అత్యధికంగా ప్రాధావ్యతనిచ్చే దేశాలలో సింగపూరు ఒకటి. సింగపూరు ప్రజల తలసరి ఆదాయం 29,474 అమెరికన్ డాలర్లు. నిరుద్యోగం 1.7 శాతం. సింగపూరు విదేశీ యాత్రీకులకు అత్యంత ఆకర్షణీయమైన దేశం. [[2006]]వ సంవత్సరములో మాత్రమే 97 లక్షల వీదేశీ యాత్రీకులు ఈ దేశాన్ని సందర్శించారు. విదేశీ యాత్రీకులను అత్యధికంగా ఆకర్షించే వ్యాపార కేంద్రం ఆర్చర్డ్ రోడ్. యాత్రీకులను ఆకర్షించడానికి కాసినోలు అనబడే రెండు ఆధునిక జూదగృహాలకు [[2005]]వ సంవత్సరంలో రాజ్యాంగ పరమైన అనుమతి సింగపూరు ప్రభుత్వం నుండి లభించింది. ఇంటిగ్రేటెడ్ రిసార్ట్స్ అనబడే ఇవి మరీనా తీరంలోనూ, సెంటోసా లోనూ రూపుదిద్దుకుంటున్నాయి. ఇవి తమ నిర్మాణాన్ని [[2009]]
సందర్శకులకు అదనపు ఆకర్షణ కానున్నాయి. సింగపూరు ప్రభుత్వము హాంగ్ కాంగ్, [[బాంకాక్]]లతో పోటీని తట్టుకొనే విధంగా నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దే
వైద్యచికిత్స కొరకు వచ్చే యాత్రీకులను ఆకర్షించడంలో సింగపూరు త్వరితగతిని అభివృద్ధిని సాధించింది. ఒక్కొక్క సంవత్సరము 2 లక్షల మంది వైద్య చికిత్సల కోసం ఇక్కడికి చేరుకుంటారు. [[2012]] నాటికి వైద్యం కోసం వచ్చే యాత్రీకుల సంఖ్య 10 లక్షల వరకు పెంచి 3 బిలియన్ల అమెరికన్ డాలర్ల రాబడిని పొందాలని ప్రభుత్వ లక్ష్యం. ఆరోగ్య రంగంలో 13,000 ఉద్యోగాలు అభివృద్ధి చేయవచ్చని ప్రభుత్వ అంచనా.
పంక్తి 156:
== కళలు ==
[[దస్త్రం:Esplanade by slivester for wiki.jpg|thumb|left|ఎస్ప్లెనేడ్ దియేటర్స్]]
1990 నుండి సింగపూరు ప్రభుత్వం దేశంలో కళలు, సంస్కృతి అభివృద్ధికి విశేషమైన ఆసక్తి ప్రదర్శించడం ప్రారంభించింది.ఈ ప్రయత్నంలో భాగంగా 2002లో ఎస్ప్లెనేడ్ కళాప్రదర్శనలు ప్రారంభించింది.అర్ట్స్ ఫెస్టివల్ 2002 అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించి నిర్వహించారు.
== ప్రచార సాధనాలు ==
ప్రభుత్వాధీనంలో ఉన్న మీడియాకార్పొరేషన్ టెలివిజన్ ఛానల్స్ (దూరదర్శన్), రేడియో ప్రసారాలు, పత్రికలు, దిన పత్రికల ప్రచురణ మరియు చిత్ర నిర్మాణం లాంటి కార్యక్రమాలు చేపట్టి నిర్వహిస్తూ ఉంటుంది. టెలివిజన్ ఛానల్స్ (దూరదర్శన్) అన్నీమీడియా కార్పొరేషన్ అధీనంలోఉంటాయి. 14 రేడియో ఛానల్స్ (ఆకాశవాణి) మీడియాకార్పొరేషన్ ఆధీనంలోనూ నాలుగు ప్రైవేట్ సంస్థల ఆధీనంలోను ఉంటాయి. ప్రైవేట్ సంస్థలు సెన్సార్ చేయని కార్యక్రమాలు ప్రసారం చేయడం నిషిద్ధం. 16 దినపత్రికలు ఇంగ్లీష్, చైనీస్, మలాయ్ మరియు [[తమిళం|తమిళ]] భాషలలో వెలువడుతున్నాయి. టుడే పత్రిక మాత్రం మీడియాకార్పరేషన్ ఆధీనంలో ప్రచురించ బడుతుంది. ప్రచురణ వ్యవస్థపై '''సింగపూరు ప్రెస్ హోల్డింగ్స్'''ఆధిక్యం సంపాదించుకుంది.
== క్రీడా రంగము ==
సింగపూర్ దేశస్తులు వివిధ రకములైన ఆటలు ఆడటంలో ఉత్సాహం చూపుతుంటారు. వీరి అభిమానపాత్రమైన క్రీడలు [[ఫుట్ బాల్]], [[బాడ్మింటన్]], [[బాస్కెట్ బాల్]], [[వాలీబాల్]], [[రగ్బీ]] యూనియన్, [[క్రికెట్]], [[స్విమ్మింగ్]] (ఈతకొట్టడం) మరియు [[టేబుల్ టెన్నిస్]] .ఎక్కువ మంది ప్రజలు ప్రభుత్వ నిర్మాణ నివాసాలలో నివసిస్తున్న కారణంగా వారు అందిస్తున్న స్విమ్మింగ్ పూల్స్, ఇండోర్ గేమ్స్ కాంప్లెక్స్, బాస్కెట్ బాల్ మరియు టెన్నిస్ కోర్టులు మొదలైనవి ప్రజలకు అందుబాటులో ఉండటం ఒక విశేషం.
దీవులకే ప్రత్యేకమైన వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ ప్రజాదరణ పొందినవే. సెయిలింగ్, కయాలింగ్, వాటర్ స్కీయింగ్ మరియు స్కూబా డైవింగ్ ఇక్కడి క్రీడా ఆకర్షణలు.

కల్లాంగ్ లో 55000 ప్రేక్షకులు సందర్శించే వసతులతో [[1973]]
సింగపూర్ వాసుల అభిమానాన్ని చూరగొన్న క్రీడలలో [[గోల్ఫ్]] ఒకటి. ఈ కారణంగా సింగపూరులో 15 గోల్ఫ్ క్లబ్ లు ఉన్నాయి. చౌకైన సభ్యత్వ రుసుము కారణంగా కొంతమంది గోల్ఫ్ క్రీడాకారులు జోహర్, మలేషియాలకు గోల్ఫ్ కోర్స్ శిక్షణ కొరకు తరచు ప్రయాణిస్తూ ఉంటారు.

టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్, బౌలింగ్, సెయిలింగ్, సిల్ట్, స్విమ్మింగ్ మరియు వాటర్ పోలో క్రీడలలో సింగపూర్ క్రీడాకారులు జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా రాణిస్తున్నారు. ఫాన్ది అహమ్మద్, అన్గ్ పెన్గ్ సియాంగ్, లి జైవీ మరియు రోనాల్డ్ సుసిలో మొదలైన క్రీడా కారుల పేర్లు సింగపూరియన్ల మధ్య సుపరిచితం.

[[2008]] ప్రారంభంలో సింగపూరు మరీనా బేలో స్ట్రీట్ సర్క్యూట్ లో '''ఫార్ములా వన్ చాంపియన్ షిప్ '''పోటీలలో ఒక రౌండ్ నిర్వహించనున్నది. ఇది ఎఫ్ 1 సర్క్యూట్ లో మొదటి నైట్ రేస్, ఆసియా మొదటి సర్క్యూట్ గా ప్ర్తేకత కానున్నది. [[2006]]
అథ్లెటిక్స్ లో ప్రవేశమున్న విద్యార్థులపై పాఠశాల చదువుల వత్తిడిని గమనించిన కమిటీ ఆన్ స్పోర్ట్స్ సింగపూరు (CoSS) వారు దానిపై దృష్టిని సారించి [[2004]] న క్రీడా పాఠశాలను స్థాపించి యువ క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.
== భవన నిర్మాణము ==
[[దస్త్రం:Raffles Place Skyscrapers 4, Jan 06.JPG|thumb|left|రాఫిల్స్ ప్లేస్ లో నిర్మించిన మూడు ఆకాశ హర్మ్యాలు]]
సింగపూరును సందర్శించే విదేశీ యాత్రీకులను అధికంగా ఆకర్షించేవి ఇక్కడి ఆకాశ హర్మ్యాలు. వీటిని పాశ్చాత్య శైలిని అనుకరిస్తూ డౌన్ టౌన్ అని వ్యవహరిస్తుంటారు. నగరానికి కేంద్రంగా వాణిజ్య పరంగా ప్రాముఖ్యత కలిగి రాజ్యాంగ వ్యవహారాలు చూసుకునే కార్యాలయాలు మొదలైనవి ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఇవి సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (CBD) లో ఉంటాయి. ఇవి మరీనాతీరం నుండి విస్తరించి ఉంటాయి. ఈ ప్రదేశాన్ని రాఫిల్ ప్లేస్ గా వ్యవహరిస్తారు. దశాబ్దాల అభివృద్ధి వలన ఈ ప్రదేశంలో అనేక ఆకాశ హర్మ్యాలు విస్తరించి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఇవి సివిల్ ఏవియేషన్ అధారిటీ ఆఫ్ సింగపూరు చే పర్యవేక్షించబడుతూ ఉంటాయి. 280 మీటర్ల ఎత్తుకు మించి ఏ నిర్మాణం ఇక్కడ లేదు. వీటిలో అత్యంత ఉన్నత నిర్మాణాలు వరసగా '''రిపబ్లిక్ ప్లాజా ''',
'''యుఒబి (UOB) ప్లాజా ఒన్ ''' మరియు '''ఒయుబి (OUB) సెంటర్ '''.

మాక్స్ వెల్ రోడ్ వీధులు బారులు తీరిన షాపింగ్ సెంటరుగా అలరారుతుంటుంది. ఇక్కడ అనేక దీవుల నిర్మాణ నమూనాలను సందర్శనార్ధం తయారు చేసి ఉంచారు.

సంప్రదాయ నిర్మాణాలతో నిండి ఉండే '''చైనా టౌన్ ''', '''లిటిల్ ఇండియా '''ప్రదేశాలు సింగపూరు విభిన్న సాంప్రదాయక పద్ధతులకు తార్కాణం. ఇవి [[ఈస్టిండియా కంపెనీ]] కాలంలో ఇక్కడ పనులు చేయడానికి దేశాంతరాలనుండి వచ్చి స్థిరపడిన పౌరుల నివాసాలు. చైనీయులు, ఇండియనులు ఇక్కడ నివాసముంటారు. చర్చులు, హిందూకోవెలలు, మసీదులు, బౌద్ధ దేవాలయాలు కూడా ఇక్కడి ప్రజల సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంటాయి. వీటిని కాపాడవలసిన పురాతన చిహ్నాలుగా ప్రభుత్వం భావిస్తుంది.

స్థలాభావం అధికం కావడం చేత ప్రభుత్వం ప్రజల నివాసార్ధం నిర్మించిన నిర్మాణాలు ఎత్తైనవిగా ఉంటాయి. పార్కులు, ప్లేఏరియాలు, సినిమా థియేటర్లు, పాఠశాలలు మొదలైన సకల వసతులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడి పరిసరాలు లాన్స్ పూలచెట్లు ఫెన్సింగులతో చక్కని పర్యవేక్షణలో పరిశుభ్రంగానూ ఆకర్షణీయంగా ఉంటాయి.
== రక్షణవ్యవస్థ ==
సింగపూరు రక్షణవ్యవహారాలు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (MINDEF) ఆధ్వర్యంలో ఉంటాయి. సింగపూరు ఆర్మీ, రిపబ్లిక్ ఆఫ్ సింగపూరు నావీ, రిపబ్లిక్ ఆఫ్ సింగపూరు ఎయిర్ ఫోర్స్ఈ మూడు కలిసి సింగపూరు ఆర్మ్ ఫోర్స్ రక్షణశాఖ మంత్రి అధికారంలోఉంటాయి. వీరికి కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా తమ సేవలు అందిస్తారు.

సింగపూరు ప్రభుత్వం ఆరోగ్యవంతమైన ప్రతి సింగపూరు పురుషుడు రక్షణవ్యవస్థలో కనీసం 2 సంవత్సరాల కాలం పనిచేయాలని కోరుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు, కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లోనివారికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. రెండవతరానికి చెంది సింగపూరులో స్థిరనివాస మేర్పరచుకున్న పురుషులకు ఈ చట్టం వర్తిస్తుంది. రెండు సంవత్సరముల సేవల అనంతరం రక్షణశాఖలో కొనసాగే విషయం పౌరుడు స్వయంగా నిర్ణయించుకోవచ్చును.నలభై నుండి ఏభై సంవత్సరముల వరకు రక్షణశాఖలో నేరుగానూ లేక రిజర్విస్ట్ గానూ సేవలందించ వచ్చు.నలభై సంవత్సరముల అనంతరం కమీషన్డ్ ఆఫీసర్గా చేయవచ్చు.
రిజర్విస్ట్ అంటే అత్యవసర సమయాలలో మాత్రమే రక్షణశాఖలో పనిచేసేవారు. 3,50,000 మంది పురుషులు రిజర్విస్ట్ గా నమోదు చేసుకున్నారు .72,500 మంది పురుషులు పూర్తి కాల సేవలో నమోదై ఉన్నారు.

సింగపూరు ఆర్మీ స్వదేశ రక్షణకే ఉపయోగపడిననూ ప్రపంచ వ్యాప్తంగా అవసరమైనప్పుడు మానవతావాదంతో ఇతరసేవలలో కూడా పాల్గొంటుంది. '''ఫైవ్ డిఫెన్స్అగ్రిమెంట్ '''ఏర్పాటు చేసుకున్న అయిదు దేశాలలో సింగపూరు ఒకటి. [[1980]] నుండి సింగపూరు ఆర్మీ అంతర్జాతీయ శిక్షణా కేంద్రాలను [[అమెరికా]], [[ఆస్ట్రేలియా]], రిపబ్లిక్ [[చైనా]], [[న్యూజిలాండ్]], [[బ్రూనై]], [[ఫ్రాన్స్]], [[థాయిలాండ్]], [[భారతదేశం|భారత్]] మరియు [[దక్షిణాఫ్రికా]] లలో నిర్వహిస్తుంది. అన్ని విషయాలపై దృష్టి సారించి అన్ని రకాల బెదిరింపులను ఎదుర్కొనేలా వ్యూహరచనతో రక్షణరంగాన్ని అభివృద్ధి చేస్తూ
సింగపూరు సమీపకాలంలో అంతర్జాతీయంగా పెరుగుతున్న తీవ్రవాదాన్ని దృష్టిలో పెట్టుకొని సాంప్రదాయేతర యుద్ధ పరికరాలకు నిధులను అధికంచేసింది. [[1991]]
సింగపూరు ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 117ను హైజాక్ చేసినప్పుడు సింగపూరు స్పెషల్ ఆపరేషనల్ ఫోర్స్ ప్రయాణీకులకుగాని సిబ్బందికిగాని ప్రాణనష్టం లేకుండా హైజాకర్ల
వ్యూహాన్ని తిప్పికొట్టింది. ఈ సంఘటనలో హైజాకర్లు నలుగురూ ప్రాణాలు కోల్పోవడం విశేషం.

సింగపూరు అర్మీని అంతర్జాతీయ సహాయానికీ నియోగిస్తూ ఉంటుంది. అమెరికాతో చేరి 11 దేశాలు పాల్గొనే శాంతి పరిరక్షణ సహాయ బృందంలో సింగపూరు ఆర్మీకి భాగంఉంది. [[2001]] [[సెప్టెంబర్]]
పప్రపన్ఛమ్లొ మన్ఛి కత్తుదిత్తమైన నగరమ్గ పెరొగన్ఛినది.
== ప్రభుత్వ విధానాలు ==
సింగపూరుకు
సింగపూరు
సింగపూరు చట్టం బ్రిటిష్ ఇండియన్ చట్టాన్ని అనుసరించేదే అయినా పి ఏ పి పార్టీ మాత్రం పాశ్చాత్య దేశాల సంపూర్ణ ప్రజాస్వాతంత్ర్యపు విలువలు పాటించడంలో కొంతవరకు విముఖత చూపిస్తూనే ఉంది. విభిన్న సంస్కృతుల, మతముల, భాషల ప్రజలు నివసిస్తున్న దేశం కనుక అల్ప సంఖ్యాకులను రెచ్చగొట్టేవి, ప్రశాంతతకు భంగం కలిగించేవి, ప్రజాశ్రేయస్సుకు ప్రతికూలమైనట్టి వ్యాఖ్యలను నిషేధిస్తూ వాక్ స్వాతంత్ర్యాన్ని ఒకింత కట్టుబాటులో ఉంచుతూ ఉంది. అల్పసంఖ్యాకులను రెచ్చగొట్టే విధంగా బ్లాగులలో వ్యాఖ్యానాలను ప్రచురించిన ముగ్గురు బ్లాగర్ల పై చర్య తీసుకోవడం ఇందుకు నిదర్శనం. అధిక జరిమానా, కొరడాదెబ్బలు లాంటి శిక్షలు అమలులో ఉన్నాయి. క్రూరమైనహత్యలూ, హానికరమైన మత్తు పదార్థాలకు సంబంధించిన నేరాలకు ఉరిశిక్ష విధించడం మామూలు విషయమే. ప్రపంచంలో అధికశాతం ఉరిశిక్షలు అమలవుతున్న దేశాలలో సింగపూరుది అగ్రస్థానం. ఉరిశిక్షల అమలు విషయంలో అంతర్జాతీయ మానవహక్కుల సమితి విమర్శలను ఎదుర్కుంటున్న సింగపూరు ప్రభుత్వం తమ దేశంలో అమలు చేయవలసిన చట్టంపై తమకు సంపూర్ణ హక్కు ఉందని వాదిస్తూ తమ చర్యలను సమర్ధించుకుంటోంది.