"సురవరం ప్రతాపరెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రంకు → రానికి , లో → లో (9), కు → కు , ప్రతిష్ట → ప్రతిష్ఠ, using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రంకు → రానికి , లో → లో (9), కు → కు , ప్రతిష్ట → ప్రతిష్ఠ, using AWB)
[[బొమ్మ:SuravaraM pratapareddi text.jpg|right|250px]]
 
[[తెలంగాణ]] రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు '''సురవరం ప్రతాపరెడ్డి''' ([[మే 28]], [[1896]] - [[ఆగస్టు 25]], [[1953]]). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ, ఆంగ్ల భాషలలో నిష్ణాతులు. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందాడు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమము ఇతని ఇతర ముఖ్య రచనలు.<ref>తెలుగు సాహితీవేత్తల చరిత్ర, మువ్వల సుబ్బరామయ్య, 2012 పేజీ 144</ref> నైజాం నిరంకుశ పాలనలో, తెలుగు వారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషిచేశాడు .<ref> తెలుగు పెద్దలు, మల్లాది కృష్ణానంద్, ఆరవ ముద్రణ 2010, పేజీ 202</ref> జీవిత చివరి దశలో రాజకీయాలలో కూడా ప్రవేశించి [[వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. తెలుగుజాతికి ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించినప్రతిష్ఠించిన విగ్రహాలలో సురవరం విగ్రహం కూడా స్థానం పొందింది. 1955లోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు గాను "కేంద్ర సాహిత్య అకాడమి" అవార్డు లభించింది.
 
 
[[దస్త్రం:Suravaram Pratapa Reddi.jpg|thumbnail|ఎడమ|సురవరం ప్రతాపరెడ్డి చిత్రపటం]]
 
==జీవిత విశేషాలు ==
సురవరం ప్రతాపరెడ్డి [[1896]] [[మే 28]] న [[మహబూబ్ నగర్]] జిల్లాలోని [[ఇటిక్యాలపాడు]] లో జన్మించాడు. [[చెన్నై|మద్రాసు]] ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ, తిరువాన్‌కూరులో బి.ఎల్ చదివాడు. కొంతకాలం పాటు న్యాయవాద వృత్తి నిర్వహించాడు. అనేక భాషలు అభ్యసించిండు. మంచి [[పండితుడు]]. [[1926]] లో ఆయన నెలకొల్పిన ''[[గోలకొండ పత్రిక]]'' తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. [[గోలకొండ పత్రిక]] సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించినయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టిండు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించిండు. అది మరింత సమస్యగా ఆనాటి ప్రభుత్వం భావించింది.
 
తెలంగాణలో కవులే లేరని ఒక ఆంధ్ర పండితుడు ఎగతాళి చేస్తే దానికి దీటుగా 350 మంది కవుల రచనలతో ''గోలకొండ కవుల సంచిక'' అనే సంకలనాన్ని [[1934]] లో ప్రచురించి తిరుగులేని సమాధానం చెప్పాడు. ఆ సంచిక ఇప్పటికీ అపురూపమైనది. తెలంగాణాలో గ్రంథాలయోద్యమంలో ప్రతాపరెడ్డి ప్రముఖపాత్ర వహించాడు. [[1942]] లో [[ఆంధ్ర గ్రంథాలయ మహాసభ]]కు అధ్యక్షత వహించాడు. [[1943]] లో [[ఖమ్మం]]లో జరిగిన గ్రంథాలయ మహాసభకు, [[1944]] లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆయనే అధ్యక్షుడు.
 
[[1951]] లో [[ప్రజావాణి]] అనే పత్రికను ప్రారంభించాడు. [[1952]] లో [[హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు|హైదరాబాదు రాష్ట్రానికి]] జరిగిన మొదటి ఎన్నికలలో [[కాంగ్రెసు పార్టీ]] తరపున [[వనపర్తి]] నియోజకవర్గం నుండి [[శాసనసభ]] కు ఎన్నికయ్యాడు. [[న్యాయవాది]]గా ఆయన జీవితం ప్రారంభించి, రచయితగా, కార్యకర్తగా, సంపాదకుడుగా జీవితం సాగించి [[తెలంగాణ]] ప్రజల హృదయాలలో ముద్రవేసుకున్నాడు. [[1953]] [[ఆగష్టు 25]]న ఆయన దివంగతుడైనాడు.
 
==రచనా వ్యాసంగం ==
 
==రాజకీయాలు==
సురవరంకుసురవరానికి రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోయిననూ సన్నిహితుల ప్రోద్బలంతో 1952లో జరిగిన తొలి ఎన్నికలలో [[వనపర్తి శాసనసభ నియోజకవర్గం]] నుంచి పోటీచేసి ప్రముఖ న్యాయవాది [[వి.రామచంద్రారెడ్డి]] పై విజయం సాధించి [[హైదరాబాదు శాసనసభ]]కు ఎన్నికయ్యాడు. కాని ప్రారంభం నుంచి రాజకీయాలకు దూరంగా ఉండటం, గ్రూపు రాజకీయాలు చేయకపోవడంతో జిల్లా వ్యక్తి [[బూర్గుల రామకృష్ణారావు]] ముఖ్యమంత్రిగా ఉన్ననూ ఇతనికి మంత్రిపదవి కూడా లభించలేదు. ఈ విషయంపై సురవరం స్వయంగా ఆయన ఆప్తుడైన రంగాచార్యులకు లేఖ వ్రాస్తూ "ఈ రాజకీయపు చీకటి బజారులో నేను, నా వంటివారు ఏమియును పనికి రారు" అని స్పష్టంగా పేర్కొన్నాడు.
 
==విశేషాలు==
 
==జీవిత చరిత్ర ==
* శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి జీవితాన్ని, వారి సర్వతోముఖ సాంఫిుక సాహిత్యోద్యమ కృషిని, రాజకీయ, సాంఫిుక, సాహిత్య సేవ, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభ సామాజికోద్యమాలను , వంశచరిత్రనూ, వారి జీవిత సంగ్రహాన్ని, అంతరంగాన్నీ, విద్యాభ్యాసం, బహుభాషా పాండిత్యం, కవితా నైపుణి, పత్రికా రచన వ్యాసంగం, కవి పండిత మైత్రి, పత్రికా సంపాదకునిగా, వివిధ వ్యాసరచయితగా, గోలకొండ పత్రిక ఆవిర్భావం, తెలంగాణా ప్రాంత సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని డా. [[ఇందుర్తి ప్రభాకర్ రావు]] గారు పరిశోధించి, పరిశ్రమించి "[http://kinige.com/kbook.php?id=5222 శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి జీవితం రచనలపై సమగ్ర పరిశీలన]" అనే గ్రంథం రచించారు. శ్రీ సురవరం గారి చరిత్రను అధ్యయనం చేయదలచిన భావి తరాలు తప్పకుండా చదవాల్సిన చారిత్రాత్మక గ్రంథం. తెలంగాణ రాష్ట్ర అవతరణ సంవత్సరం 2014 లో తెలంగాణా వైతాళికులు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి స్మారకార్థం నిర్వహించిన సభ లోసభలో ఈ గ్రంథం [http://www.thehansindia.com/posts/index/2014-10-17/Denial-of-HC-to-TS-unconstitutional-112111 ఆవిష్కృతమైంది].
 
==వనరులు, మూలాలు ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2008686" నుండి వెలికితీశారు