సురేష్ రైనా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు (2), చినాడు → చాడు, → (2), , → , using AWB
పంక్తి 1:
[[బొమ్మ:Suresh Raina batting.jpg|thumb|200px|right|<center>సురేష్ రైనా బ్యాటింగ్</center>]]
[[బొమ్మ:Suresh Raina fielding.jpg|thumb|200px|right|<center>సురేష్ రైనా ఫీల్డింగ్</center>]]
[[1986]], [[నవంబర్ 27]]న [[ఉత్తర ప్రదేశ్]] లోని [[ఘజియాబాదు]]లో జన్మించిన '''సురేష్ రైనా''' (Suresh Raina) [[భారత్]] కు చెందిన [[క్రికెట్]] క్రీడాకారుడు. [[2005]] [[జూలై]] నుంచి భారత వన్డే జట్టులో ఉంటున్నప్పటికీ ఇప్పటి వరకు 36 వన్డేలలో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. [[2006]] ప్రారంభం నుంచి టెస్ట్ క్రికెట్‌కు అందుబాటులో ఉన్ననూ ఇంకనూ టెస్ట్ మ్యాచ్ ఆరంగేట్రం చేయలేడు. దేశవాళీ క్రికెట్ పోటీలలో [[రంజీ ట్రోఫి]]లో ఉత్తర ప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. [[దులీప్ ట్రోఫి]] పోటీలలో [[సెంట్రల్ జోన్ క్రికెట్ జట్టు|సెంట్రల్ జోన్]] జట్టు తరఫున ఆడుతున్నాడు. బ్యాటింగ్ ఎడమచేతితో చేసే రైనా బౌలింగ్‌లో మంచి ఆఫ్ స్పిన్నర్.
==బాల్యం==
రైనాది కశ్మీరీ పండిట్ల కుటుంబం. వారి కుటుంబం కశ్మీర్ లోని రైనావారీ నుంచి 1980 ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు వలస వెళ్ళింది. నాన్న త్రిలోక్ చంద్ ఆర్మీలో అధికారిగా పనిచేశాడు. అమ్మ పర్వేష్ గృహిణి. వారికి అయిదుగురు సంతానం. అందులో రైనా అందరికంటే చిన్నవాడు. ముగ్గురు అన్నయ్యలు , ఒక అక్క అందరూ చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పదేళ్ళ వయసులో తనకు క్రికెట్ అంటే ఇష్టమని ఇంట్లోవాళ్ళకి చెబితే వాళ్ళు లక్నోలోని ప్రభుత్వ క్రీడాపాఠశాలలో చేర్పించారు. ఆరో తరగతి నుంచి అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టేంత వరకు దాదాపు తొమ్మిదేళ్ళు అక్కడే ఉన్నాడు.<ref>మార్చి 8, 2015 ఈనాడు ఆదివారం సంచిక లో రైనా ముఖాముఖి</ref>
==ప్రారంభ క్రీడా జీవితం==
13 సంవత్సరాల వయస్సులోనే క్రికెట్ ఆటపై దృష్టి పెట్టినాడు. చిన్న వయస్సులోనే అండర్-16 ఉత్తర ప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. పదిహేనున్నర సంవత్సరాల ప్రాయంలో అండర్-19 జట్టుకు ఎంపైకై [[ఇంగ్లాండు]] పర్యటించి రెండు అర్థసెంచరీలు సాధించాడు.<ref>http://www.cricinfo.com/db/ARCHIVE/2002/OTHERS+ICC/IND-U19_IN_ENG/STATS/IND-U19_IN_ENG_JUL-AUG2002_AVS_IND-U19.html</ref> ఆ తదుపరి సంవత్సరం అండర్-17 టీం తరఫున [[శ్రీలంక]] పర్యటించాడు. [[2003]]లో 16 సంవత్సరాల వయస్సులోనే ఉత్తర ప్రదేశ్ తరఫున తొలిసారిగా [[రంజీ ట్రోఫి]] అస్సాంపై ఆడినాడు. ఆ తదనంతరం అండర్-19 ఆసియా కప్‌లో పాల్గొనడానికి [[పాకిస్తాన్]] పర్యటించాడు. [[2004]]లో అండర్-19 ప్రపంచ కప్ పోటీలలో కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఆ ప్రపంచ కప్ పోటీలలో కేవలం 38 బంతుల్లో 90 పరుగులు సాధించడమే కాకుండా మొత్తం 3 అర్థసెంచరీలు సాధించాడు. [[2005]] ప్రారంభంలో ఛాలెంజర్ సీరీస్‌కు ఎంపైకైనాడు.<ref>http://content-usa.cricinfo.com/ci/content/story/144355.html</ref> [[సచిన్ టెండుల్కర్]] గాయపడటంతో 2005 లో శ్రీలంకలో జరిగిన ఇండియన్ ఆయిల్ కప్ లో పాల్గొన్నాడు.<ref>http://content-usa.cricinfo.com/ci/content/story/213706.html</ref>
 
==అంతర్జాతీయ క్రికెట్==
రైనా అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభం నిరాశజనకంగా ప్రారంభమైంది. [[ముత్తయ్య మురళీధరన్]] చేతిలో గోల్డెన్ డకౌట్ అయి <ref>http://content-usa.cricinfo.com/ci/content/story/242579.html</ref> టోర్నమెంటు మొత్తం కలిపి 12.33 సగటుతో కేవలం 37 పరుగులు మాత్రమే సాధించాడు. [[సౌరవ్ గంగూలీ]] మళ్ళీ జట్టులోకి రావడంతో ఇతనికి అవకాశం రాలేదు. అప్పటి కోచ్ [[గ్రెగ్ చాపెల్]] గంగూలీని తప్పించడంతో మరియు [[మహ్మద్ కైఫ్]] కు గాయం కావడంతో భారత్ పర్యటించిన శ్రీలంకతో 5 వన్డేల సీరీస్‌లో స్థానం సంపాదించినాడుసంపాదించాడు. తుది జట్టులో ఒక సారి స్థానం పొంది భారత్ గెలిచిన నాలుగవ వన్డేలో 39 (నాటౌట్) పరుగులు సాధించాడు. ఆ తరువాత గంగూలీ మళ్ళీ జట్టులో చేరడం [[గౌతం గంభీర్]] ఓపెనర్‌గా స్థానం పొందడంతో ఇతనికి అవకాశం లభించలేదు. ఇంగ్లాండుతో జరిగిన టెస్ట్ సీరీస్‌కు ఎంపైకైననూ టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం లభించలేదు. [[ఫరీదాబాదు]]లో జరిగిన వన్డేలో 81 (నాటౌట్) పరుగులు చేసి తొలి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు. ఇదే అతని అత్యధిక వన్డే స్కోరు. ఆ తర్వాత మరో రెండు అర్థసెంచరీలు సాధించడంతో బిసిసిఐ సి-గ్రేడు (కాంట్రాక్టు) ప్రధానం చేసింది.
==వన్డే గణాంకాలు==
సురేష్ రైనా 36 వన్డేలు ఆడి 26.60 సగటుతో 612 పరుగులు సాధించాడు. అందులో 3 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 81 (నాటౌట్).
"https://te.wikipedia.org/wiki/సురేష్_రైనా" నుండి వెలికితీశారు