"స్థానం నరసింహారావు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3) using AWB
చి (వర్గం:తెలుగు సినిమా పాటల రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3) using AWB)
}}
 
'''స్థానం నరసింహారావు''' ([[ఆంగ్లం]]: Sthanam Narasimha Rao) ([[సెప్టెంబర్ 23]], [[1902]] - [[ఫిబ్రవరి 21]], [[1971]]) ప్రసిద్ధ రంగస్థల మరియు [[తెలుగు సినిమా]] నటుడు. సత్యభామ, చిత్రాంగి మొదలైన అనేక [[స్త్రీ]] పాత్రలను సుమారు 40 సంవత్సరాలకు పైగా ధరించి ప్రేక్షకాభిమానంతో సహా [[పద్మశ్రీ పురస్కారం]] పొందాడు.
 
==జీవిత విశేషాలు==
స్థానం నరసింహారావు [[1902]] సంవత్సరం [[సెప్టెంబర్ 23]] తేదీన [[గుంటూరు]] జిల్లా [[బాపట్ల]] లో హనుమంతరావు మరియు ఆదెమ్మ దంపతులకు జన్మించాడు.
 
1920 సంవత్సరంలో ఒకనాడు [[బాపట్ల]]లో ప్రదర్శించే [[హరిశ్చంద్ర నాటకం]] లో చంద్రమతి పాత్రధారి రానందున ఆ కొరత తీర్చడానికి తానే ఆ పాత్రను ధరించి తన నట జీవితాన్ని ప్రారంభించాడు. తెనాలి లోని [[శ్రీరామ విలాస సభ]]లో ప్రవేశించి ఆకాలంలోని గొప్ప నటులందరి సరసన పాత్రలు ధరించి దేశమంతటా పర్యటించి అపారమైన అనుభవం సంపాదించాడు.
 
ఆంధ్రదేశంలో దాదాపు 3,000 సార్లు రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు. శృంగార రసాన్ని ప్రతిబింబించే రీతిలో సత్యభామ పాత్ర, ప్రణయానికి చిత్రాంగిగా, వీరరసాన్ని చిత్రించడంలో రోషనార, వలపుల చింతామణిగా, ప్రణయదేవతగా, భక్తురాలిగా, దేవదేవిగా, మధురాతి మధురమైన మధురవాణిగా [[నవరసాలు]] కలిగిన పాత్రలను ప్రతిభావంతంగా పోషించాడు. వేషధారణ మరియు వస్త్రాలంకరణలో స్థానం వారిది ఒక ప్రత్యేకత. రకరకాల చీరకట్టు సొగసులతో మనోహరంగా రంగస్థానం మీదకు ప్రవేశించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశేవాడు.
 
==ఇతర విశేషాలు==
* [[1956]] లో [[భారత్|భారత ప్రభుత్వం]] ఆయనను [[పద్మశ్రీ పురస్కారం]]తో సత్కరించింది. ఆయన ఈ బహుమతిని పొందిన తొలి ఆంధ్రుడు మరియు కళాకారుడు.
* ఆయన రంగ స్థలం పై చూపించిన సమయస్పూర్త్రి పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో ఒక పాఠం కూడా ఇచ్చింది.
* వీరి నటనకు ముగ్ధులైన [[రంగూన్]] ప్రజలు 1938లో బంగారు కిరీటాన్ని బహూకరించారు.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2009040" నుండి వెలికితీశారు