హంసలేఖ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నేపధ్య → నేపథ్య using AWB
పంక్తి 16:
|years_active = 1981–present
}}
'''హంసలేఖ''' సినీ సంగీతదర్శకుడు, పాటల రచయిత. ఈయన దక్షిణ భారత సినిమాలకు, ప్రత్యేకించి కన్నడ సినిమాలకు పని చేస్తారు. 1980లలో ఈయన తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈయన కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే, సంభాషణలు, నేపధ్యనేపథ్య సంగీతం కూడా అందించారు. దాదాపు 300 సినిమాలకు పాటలను వ్రాసి, సంగీతమందించారు.
 
హంసలేఖకు నాదబ్రహ్మ అనే బిరుదు ఉంది, యువతరాన్ని ఆకట్టుకునేలా పాటలను వ్రాసి, సంగీతమివ్వడం ఈయన ప్రత్యేకత. సినిమా పంథాకు ఆనుగుణంగా జానపద, పాశ్చాత్య బాణులను అందించడంలో సమర్ధుడు. ఎందరో గాయనీగాయకులను, రచయితలనూ, సంగీతదర్శకులనూ ఈయన సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసారు.
"https://te.wikipedia.org/wiki/హంసలేఖ" నుండి వెలికితీశారు