హైకూ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కూడ → కూడా (3), ( → ( using AWB
పంక్తి 1:
'''హైకూ''' అనునది ఆధునిక తెలుగు కవిత్వ ప్రక్రియ. జపనీ సాహిత్యంలో విశేష ఆదరణ పొందిన ఈ ప్రక్రియ తెలుగులోకి దిగుమతి అయింది.
== నిర్మాణం ==
హైకూ మూడు పాదాలలో పదిహేడు 'మాత్రలు ' ( సిలబుల్స్) కలిగిన త్రిపద. మొదటి పాదంలో ఐదు, రెండో పాదంలో ఏడు, మూడో పాదంలో ఐదు చొప్పున మాత్రలు ఉంటాయి.
== ప్రత్యేకత ==
సాధారణ విషయాలలో అద్భుతాన్ని చూపగల ప్రక్రియ. ఏ ఆలోచన చేయకుండా ఒక దృశ్యాన్నో, సంఘటననో చూసి కవి మెరుపు వేగంతో చెప్పే ప్రక్రియ. '' మానవాత్మనీ, భూమ్యాకాశాల్ని, వెలుగునీడలను ఒకే స్నాప్ షాట్ లో పట్టే ప్రక్రియ '' అంటారు ప్రముఖ సాహితీకారులు [[వాడ్రేవు చినవీరభద్రుడు]]. కొలనులోకి రాయి విసిరితే వృత్తాలు వ్యాపించినట్లు హైకూ పాఠకునిలో ఆలోచనాతరంగాలను సృష్టిస్తుంది.
== తెలుగు హైకూల చరిత్ర ==
తెలుగులో హైకూలను పరిచయం చేసింది [[ఇస్మాయిల్ (కవి)]] గారు<ref> తెలుగు సాహిత్య చరిత్ర, రచన:డాక్టర్ ద్వా.నా.శాస్త్రి, విశాలంధ్ర ప్రచురణలు, 2001, పుట-315</ref>. [[1991]] లో [[పెన్నా శివరామకృష్ణ]] ' రహస్యద్వారం ' పేరుతో తొలి తెలుగు హైకూ కవిత్వ సంపుటిని తీసుకవచ్చాడు. "చినుకుల చిత్రాలు" (2000), "సులోచనాలు" (2006) పేర్లతో మరో రెండు హైకూ సంకలనాలను కూడకూడా పెన్నా శివరామకృష్ణ ప్రచురించాడు. ప్రపంచంలోని, భారత దేశంలోని వివిధ భాషలలో వచ్చిన కొన్ని హైకూలను తెలుగులోనికి అనువదించి "దేశదేశాల హైకూ" (పాలపిట్ట బుక్స్ ప్రచురణ, 2009) అనే మరో అనువాద రచనను కూడకూడా పెన్నా శివరామకృష్ణ వెలువరించాడు. "ప్రపంచ వ్యాప్త కవితా ప్రక్రియ హైకూ", "హైకూ - స్వరూప స్వభావాలు" అనే శీర్షికలతో పెన్నా శివరామకృష్ణ రాసిన రెండు వ్యాసాలు కూడకూడా "దేశదేశాల హైకూ" పుస్తకంలో ప్రచురింపబడినాయి. [[1994]] లో [[గాలి నాసరరెడ్డి]] జపాన్ హైకూలను తెలుగులోకి అనువదించారు. ప్రస్తుతం [[తలతోటి పృథ్విరాజ్]] ' ఇండియన్ హైకూ సొసైటీ ' ని స్థాపించి ఈ ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించి, విరివిగా రాస్తున్నారు. బి.వి.వి. ప్రసాద్, లలితానంద ప్రసాద్, వెంకటరావు, హైకూ వరలక్ష్మి మొదలగు తెలుగు కవులు హైకూలు రాస్తున్నారు.
 
== కొన్ని హైకూలు ==
పంక్తి 16:
- పెన్నా శివరామకృష్ణ
 
''వర్షం
 
 
''వర్షం
 
క్షణం పూచే నీటిపూలతో
Line 25 ⟶ 23:
 
- బి.వి.వి. ప్రసాద్
 
 
 
''వాగు ప్రవాహానికి
Line 40 ⟶ 36:
{{మూలాలజాబితా}}
 
[[వర్గం: తెలుగు సాహిత్య ప్రక్రియలు]]
 
[[వర్గం: తెలుగు సాహిత్య ప్రక్రియలు]]
"https://te.wikipedia.org/wiki/హైకూ" నుండి వెలికితీశారు