వంతెన: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యూరపు → ఐరోపా (2), లో → లో (17), ను → ను , గా → గా (2), తో → తో (3), using AWB
+వెస్ట్‌మిన్‌స్టర్ వంతెన లింకు
పంక్తి 4:
మొట్టమొదట వంతెనలు పొడుగాటి చెట్లతో నిర్మించేవారు. రెండు గట్టుల మీద చివరలు ఆనుకొని ఉండేలా చెట్లను కాలువకు అడ్డంగా వేసి, ఈ ఏర్పాటును వంతెనగా ఉపయోగించేవారు. క్రీ.పూ. 450 ప్రాంతంలో బల్ల కట్టుతో తాత్కాలిక వంతెనలు ఏర్పరచి వాటికి ఊతగా పడవలను వాడేవారు. కాలువ మధ్యలో రెండు, మూడు చోట్ల రాతి స్తంభాలను కట్టి వాటిపై దూలాలను పరచి వంతెనగా వాడటం తరువాత ప్రారంభమైంది. ఇలాంటి వంతెనని బాబిలాన్ లో యూఫ్రటిస్ నదికి అడ్డంగా నిర్మించారని ప్రతీతి. ప్రాచీన చైనాలో అనేక నదులకు అడ్డంగా తాళ్ళ వంతెనలు నిర్మించారు. ఇందులో పొడుగాటి వేదికను తాళ్ళతో గానీ, గొలుసుతో గానీ వేలాడదీస్తారు. 200 అడుగుల పొడవు గల ఇలాంటి వంతెనలు పెరూ దేశంలోని 'ఇంకా' సామ్రాజ్యంలో కూడా వాడుకలో ఉండేవి.
==వంతెన నిర్మాణాలు==
రోమనులు రోడ్లు వేయటంతో బాటు వంతెన నిర్మాణాలు కూడా చేశారు. వారు నిర్మించిన కట్టడాలూ, సొరంగాలూ ఇప్పటికీ ఉన్నాయి. క్రీ.శ.100 ప్రాంతంలో డాన్యూబ్ నదికి 150 అడుగుల ఎత్తుగల స్తంభాలపై కొత్త కమానులతో వంతెనను నిర్మించారు. ఈ కమానులు అర్థవృత్తాకారంగా ఉండేవి. రోమను సామ్రాజ్యం అంతరించిన తర్వాత వెయ్యి సంవత్సరాల వరకు వంతెన నిర్మాణం ఐరోపా ఖండంలో దాదాపు జరగలేదు. 12 వ శతాబ్దంలో మాత్రం అక్కడక్కడ కొన్ని ముఖ్యమైన వంతెనలు నిర్మించబడి ఉండవచ్చు గానీ, పదవ శతాబ్దం నాటికి ఒక కొయ్య వంతెన మాత్రమే మిగిలింది. ఇది కూడా తుఫానులో ధ్వంసమైంది. దీని తర్వాత కట్టిన మరో వంతెన కూలిపోయింది. పీటర్ డీకోల్ చర్చ్ అనే మత గురువు 1176 లో రాతి వంతెన నిర్మించటం ప్రారంభించి, 1209 లో పూర్తి చేశాడు. 900 అడుగుల పొడవు, 19 కమానులు కలిగిన ఈ వంతెన కింద ఓడలు సులభంగా పోగలుగుతుండేవి. తరచుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బ తిన్నప్పటికీ, ఈ వంతెన సుమారు ఆరు శతాబ్దాల కాలం మన గలిగింది. 1750 లో [[వెస్ట్‌మిన్‌స్టర్ వంతెన|వెస్ట్ మినిస్టర్ వంతెన]] నిర్మాణమయ్యేంత వరకు ఇది లండను లోని ఏకైక వంతెనగా ఉండేది.
 
వంతెన నిర్మాణ కళ [[ఇటలీ]]లో పునరుద్ధరించబడింది. వెనిసు నగరంలోని కాలువలపై నిర్మించబడిన అనేక చిన్న చిన్న వంతెనలు అందంగానూ, చూడ ముచ్చటగానూ ఉండేవి. అయినా సాంకేతిక నైపుణ్యంలో అడ్డానదిపై ట్రెజూ వద్ద నిర్మించిన వంతెన వీటన్నిటి కంటే ఉత్తమమైనది. ఈ వంతెన 240 అడుగుల పొడవు కల ఒకే కమాను కలిగి ఉండి, 70 అడుగుల ఎత్తులో ఉండేది. దీనిని 14 వ శతాబ్దంలో నిర్మించారు. నిర్మించిన యాభై యేళ్ల లోపుగానే ట్రెజూ కోట ముట్టడి సందర్భంగా ఇది ధ్వంసం చేయబడింది. ఇంచుమించు ఇదే కాలంలో వెరోనా వద్ద నిర్మించబడ్డ మరో వంతెన 1945 లో ఇటలీ నుంచి జర్మనీ సేన ఉపసంహరణ సందర్భంగా కసితో నాశనం చేయబడింది. కానీ కొన్నాళ్ళకే దీన్ని మళ్ళీ కట్టారు.
"https://te.wikipedia.org/wiki/వంతెన" నుండి వెలికితీశారు