బుర్రకథ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా (2), తో → తో , కూడ → కూడా , యుద్దం → యుద్ధ using AWB
పంక్తి 16:
''వినరా భారత వీరకుమారా విజయం మనదేరా'' అన్న చరణం బుర్రకథల్లో సర్వ సామాన్యం. బుర్రకథ ఎక్కువగా ముగ్గురు ప్రదర్శకులతో నిర్వహించబడుతుంది. దానికి వంతగా ప్రక్కనున్న ఇద్దరు ''తందాన తానా'' అని వంత పాడతారు. అందుకే దీనిని తందాన కథ అని కూడా అంటారు.
 
* ఒకరు ప్రధాన కథకుడు: ముఖ్య కథను, వర్ణనలనూ, నీతినీ, వ్యాఖ్యలనూ రసవంతమైన మాటలు, పాటలు, పద్యాలలో తాళానికి అనుగుణంగా చెబుతూ ఉంటాడు. వారికి మాటా, ఆటా, పాటా బాగా తెలిసి ఉండాలి. ఇక కథ సంగతి సరేసరి. అతని (ఆమె) వేషధారణ కూడా రంగుల అంగరఖా, [[తలపాగా]], నడుముగుడ్డ, ముత్యాల గొలుసు, కాలిగజ్జెలతో కనుల పండువుగా ఉంటుంది.
* మరొకరు వంతు పాటగాడు, హాస్యగాడు. రంగుల దుస్తులతో, విభూతి రేఖలతో, చేత డప్పులతో వీరు కథకునికి పాటలోనూ, చిందులోనూ తోడుంటాడు. కథలో పట్టు నిలబెడుతుంటారు. ఏమైందని ప్రశ్నిస్తూంటాడు. ఉత్సాహాన్ని, ఊపును పంచుతుంటాడు. ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతుంటాడు. హాస్యాన్ని కూడా పంచుతూ ఉంటాడు. పిట్టకథలు చెప్తూ జోగుతున్న ప్రేక్షకులను లేపుతుంటాడు.
* మూడవ వ్యక్తి హాస్యగాని అతితెలివికి అడ్డుకట్ట వేస్తుంటాడు. కథనూ, కథనాన్నీ, అందులో నీతినీ నొక్కి చెబుతూ అసలు కథను దారి మళ్ళనీయకుండా చూస్తూ ఉంటాడు.
"https://te.wikipedia.org/wiki/బుర్రకథ" నుండి వెలికితీశారు