భద్రిరాజు కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గ్రంధా → గ్రంథా, పద్దతు → పద్ధతు, పని చేసాడు using AWB
పంక్తి 38:
 
==జీవిత విశేషాలు==
[[పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోవిశ్వవిద్యాలయం]]లో 1955లో[[మర్రీ బీ. ఎమెనో]] భాషాశాస్త్రంలో పరిశోధన గావించి పి.హెచ్.డీ. పట్టం పొందిన భద్రిరాజు కృష్ణమూర్తి 1928 జూన్ 19 తేదీన [[ప్రకాశం]] జిల్లా [[ఒంగోలు]]లో జన్మించాడు. ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలలో 1949-62 మధ్య లెక్చరర్ గాను, రీడర్ గానూ, 1962 నుంచి 1986 దాకా [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] భాషాశాస్త్ర శాఖలో తొలి ఆచార్యులుగానూ పనిచేసాడు. 1986 నుంచి 1993 వరకు [[హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం]] వైస్-చాన్సలర్ గా ఉన్నాడు. [[అమెరికా]]లోని వివిధ విశ్వవిద్యాలయాలలోనూ, ఆస్ట్రేలియా, [[జపాన్]] విశ్వవిద్యాలయాల్లోనూ ఆహుత ఆచార్యులుగా పనిచేసాడు. [[రష్యా]], [[జర్మనీ]], ప్రాన్స్, [[కజికిస్తాన్]] మొదలైన దేశాల్లో పర్యటించాడు. దేశ విదేశాలలోని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత పరిశోధన సంస్థల్లో ప్రతిష్ఠాత్మకమైన పెలోషిప్‌లు, సభ్యత్వాలు పొందాడు. [[ఎమెనో]] గారి ప్రియ శిష్యుడు. అమెరికన్ లింగ్విస్టిక్ సొసైటీ గౌరవ సభ్యుడిగా 1985లో ఎన్నికయ్యాడు. భారత కేంద్ర సాహిత్య అకాడెమీ నిర్వాహక సభ్యుడుగా కూడా కొంతకాలం పనిచేసాడు.
భద్రిరాజుకు భార్య, ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు.11.8.2012 న హైదరాబాదులో కన్నుమూశారు.