అచ్యుత దేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , using AWB
+తాడికొంబు ఆలయం లింకు
పంక్తి 9:
 
* మొదట [[తిరుమల]]లో గర్భగుడిలోపలనే దేవదేవుని శంకుతీర్థముతో పట్టాభిషేకము జరుపుకున్నాడు<ref>అచ్యుతరాయాభ్యుదయము - రెండవ రాజనాధ డిండిమ</ref><ref>The Sources of Vijayanagara history No.1 Madras University Historical Series పేజీ.161</ref>. ఈ విషయమై విమర్శలు వచ్చాయి. ఎందుకంటే గర్భగుడిలోనికి బ్రాహ్మణులకు తప్ప అన్యులకు ప్రవేశము లేదు.
* తరువాత 1529 [[అక్టోబర్ 21]], [[1529]] (శక స.1452 విరోధి నామసంవత్సర కార్తీక బహుళ పంచమి) [[శ్రీ కాళహస్తి]]లో రెండవ పర్యాయము పట్టాభిషేకం జరుపుకున్నాడని కాళహస్తిలోని శాసనము వల్ల తెలుస్తుంది.<ref>ఎన్.వెంకటరమణయ్య (1935), పేజీ.3</ref><ref>Annual Reports of Epigraphy, Madras. 157 of 1924</ref>
* తరువాత 1529 [[నవంబర్ 20]], [[1529]] న [[విజయనగరం]]లో ముచ్చటగా మూడవసారి పట్టాభిషేకం జరుపుకున్నాడు.
 
==యుద్ధాలు==
పంక్తి 17:
శత్రు దండయాత్రల ప్రమాదాన్ని గుర్తించిన అచ్యుతరాయలు, రామరాయలుతో సంధి చేసుకున్నాడు. కానీ సాళువ నరసింగనాయకునికి (సెల్లప్ప) అది నచ్చక [[ఉమ్మత్తూరు]] మొదలైన దుర్గాధిపతులతో కలిసి తిరుగుబాటు చేశాడు. అయితే అచ్యుతరాయల బావమరుదులైన [[సలకం పెద తిరుమలరాజు]], [[సలకం చిన తిరుమరాజు]]లు తిరుగుబాటును అణచివేసి శాంతిని నెలకొల్పారు.
 
కులీ కుత్బుల్ ముల్క్ తో [[కోయిలకొండ]] దగ్గర జరిగిన యుద్ధములో [[బీజాపూరు సుల్తాను]] [[ఇస్మాయిల్ ఆదిల్‌షా]] మరణించగా, అతని కొడుకు [[మల్లూ ఆదిల్‌షా]] రాజ్యాన్ని చేపట్టాడు. ఇతని పాలన నచ్చని ప్రజలు అసద్ ఖాన్ లారీ అనే ఉద్యోగి నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. ఇదే అదనుగా 1535లో అచ్యుతరాయలు దండెత్తి [[రాయచూరు అంతర్వేది]]ని ఆక్రమించుకున్నాడు.
 
==రామరాయల కుట్రలు==
{{చూడండి|అళియ రామ రాయలు}}
రాజధానిలో రామరాయలు బలం నానాటికి పెరగ సాగిందిపెరగసాగింది. రామరాయల తమ్ములు వెంకటాద్రి, తిరుమలలు అతడికి అండగా ఉన్నారు. [[కందనవోలు]], [[అనంతపూరు]], [[ఆలూరు, కర్నూలు|ఆలూరు]], [[అవుకు]] దుర్గాధిపతులు రామరాజు పక్షము వహించారు. ఇంతలో బీజాపూరులో మల్లూ ఆదిల్‌షాను తొలగించి [[ఇబ్రహీం ఆదిల్‌షా]] గద్దెనెక్కి, మల్లూ సానుభూతిపరులైన ఉద్యోగులను, మూడు వేల సైన్యాన్ని తొలగించాడు. అలా తొలగించబడిన సైనికులను రామరాయలు తన సైన్యములో చేర్చుకొని రాజధానిలోని తురకవాడలో నిలిపి ఉంచాడు.<ref name=nv59>ఎన్.వెంకటరమణయ్య (1935), పేజీ.59</ref>
 
1536లో [[గుత్తి]] ప్రాంతములోని తిరుగుబాటును అణచి [[తిరుమల]] వేంకటేశ్వరుని దర్శించుకొని రాజధానికి తిరిగివస్తున్న అచ్యుతరాయలను బంధించి, రామరాయలు సింహాసనాన్ని ఆక్రమించి పట్టాభిషేక ప్రయత్నాలు జరిపాడు. కృష్ణదేవరాయల భార్యలు తిరుమలదేవి, చిన్నాదేవి రామరాయలకు మద్దతు నిచ్చారు. కానీ ప్రజలు, సామంతులు రామరాయలు సింహాసనాన్ని ఆక్రమించడాన్ని ఇష్టపడలేదు. పట్టాభిషేకానికి అన్నీ సన్నద్ధం చేసుకున్నా, రాయరాయల పట్టాభిషేకం జరగలేదు<ref name=nv60>ఎన్.వెంకటరమణయ్య (1935), పేజీ.60</ref>. [[మధుర]], [[కొచ్చిన్]] ప్రాంత సామంతులు కప్పం చెల్లించడం నిలిపివేశారు. రామరాయలు వారిపై దండయాత్రకు బయలుదేరిన సమయములో రాజధానిలోని ఉద్యోగులు సలకం పెద తిరుమలరాజుతో చేరి, అచ్యుతరాయల్ని చెర నుండి విడిపించి సింహాసనముపై పునఃప్రతిష్ఠించారు.
పంక్తి 46:
ఇతని పరిపాలనా కాలములో [[హంపి]]లోని తిరువేంగళనాధుని ఆలయము నిర్మించాడు. ఈ ఆలయం అక్కడ కొలువై ఉన్న దేవుని పేరుమీదుగా కంటే ''అచ్యుతరాయ ఆలయము'' అన్న పేరుతోనే ప్రసిద్ధి చెందింది.
 
ఇప్పుడు [[కపిల తీర్ధము]]గా ప్రసిద్ధమైన [[తిరుపతి]] లోని ఆళ్వార్ తీర్ధాన్ని అచ్యుతరాయలు నిర్మింపజేశాడు. తీర్ధము చుట్టూ రాతి మెట్లు, మంటపము నిర్మించాడు. [[1533]]లో స్వామివారి పుష్కరిణి మెట్లు బాగుచేయించి పాత పుష్కరిణి పక్కనే కొత్త పుష్కరిణిని కట్టించాడు. తిరుమలలో ఆలయానికి దక్షిణము వైపున అచ్యుతరాయలు మరియు ఆయన భార్య వరదాంబికల రాతి విగ్రహాలు చూడవచ్చు<ref name=act3>[http://www.omnamovenkatesaya.com/saptagiri_Nov2005_Eng/Tirumala_through_ages.htm అనాదిగా తిరుమల - పి.కుసుమ కుమారి]</ref>. [[తమిళనాడు|తమిళనాట]] [[దిండిగల్]] కు సమీపంలో వున్న [[తాడికొంబు ఆలయం|తాడికొంబు ఆలయాన్ని]] తిరుమలరాయలు నిర్మింపజేసాడు.
 
కృష్ణదేవరాయల లాగానే అచ్యుతరాయలు కూడా సాహిత్య పోషకుడు. ప్రతి సంవత్సరం ఒక గ్రంథం రాయించి తిరుపతి వెంకటేశ్వరునికి సమర్పించేవాడు<ref name=arudra237>ఆరుద్ర, పేజీ.237-238</ref>. అచ్యుతరాయలు స్వయంగా ''తాళమహోదధి'' అనే గ్రంథం సంస్కృతంలో రాశాడు. ఈయన ఆస్థానములో కన్నడ కవి [[చాటు విఠలనాధుడు]], ప్రముఖ సంగీతకారుడు [[పురందరదాసు]] మరియు సంస్కృత విద్వాంసుడు [[రెండవ రాజనాథ డిండిమభట్టు]] ఉండేవారు. డిండిమభట్టు ''అచ్యుతరాయాభ్యుదయము''తో పాటు సంస్కృతములో భాగవత చంపు వ్రాసి అచ్యుతరాయలకు అంకితమిచ్చాడు. ఈయన ఆస్థానములోని తెలుగు కవులలో [[రాధామాధవ కవి]] ముఖ్యుడు. ఈయన రచించిన ''తారకబ్రహ్మరాజీయము''ను అచ్యుతరాయల మంత్రి [[నంజ తిమ్మన]]కు అంకితం చేశాడు. కృష్ణరాయల సభ భువనవిజయములాగే, అచ్యుతరాయల సభను ''వెంకట విలాస మండపము'' అని పిలిచేవారు.
"https://te.wikipedia.org/wiki/అచ్యుత_దేవ_రాయలు" నుండి వెలికితీశారు