[[అనంతపురము]] తరువాత మూడవ పెద్ద పట్టణము గుంతకల్లు. [[దక్షిణ మధ్య రైల్వే]] లోని 5 ప్రధాన డివిజన్ లలో మూడవది గుంతకల్ డివిజన్. ముంబై చెన్నై మధ్య ప్రధాన జంక్షన్ గా గుంతకల్లుకు[[గుంతకల్లు]]కు పేరు ఉంది. ఇక్కడ డీజిల్ లోకో షెడ్ ఉంది. ఇటీవలే ఇది 50 వసంతాలు పూర్తి చేసుకున్నది. గుంతకల్లుకు ఆ పేరు ఎలా వచ్చింది అనగా ఇక్కడి పాత గుంతకల్లలో వెలసిన గుంతకల్లప్ప స్వామి పేరు మీద అని చెబుతారు. గుంతకల్లు స్టేషను మీదుగా ప్రతినిత్యము వేలాదిమంది ప్రయాణం చేస్తుంటారు ఇక్కడినుండి నాలుగు ప్రధాన రైలు మార్గాల ద్వారా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ ముస్లిం ప్రజలు కూడా చాలా మంది నివసిస్తున్నారు. ఇక్కడ పట్టాన జనాభాలో ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నారు. ఇక్కడ ప్రసిద్ధి గాంచిన [[హజారత్ వలి మస్తాన్]] దర్గా చాల ముఖ్యమైనది. ప్రతి సంవత్సరము [[మొహర్రము]] తరువాత 15 రోజులకు ఇక్కడ జరిగే ఉరుసు మహోత్సవానికి [[కర్ణాటక]] [[మహారాష్ట్ర]] వంటి రాష్ట్రాలనుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామి వారిని పూజిస్తారు.