అధినివేశ ప్రతిపత్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
=== బ్రిటిష్ వలసరాజ్యముల చరిత్ర ===
భారతదేశము 18వ శతాబ్దం మద్య బ్రిటిష్ వలసరాజ్యముగా (బ్రిటిష్ ఇండియా) కొన్ని పరగణాలతో ప్రాారంభమై క్రమేణా దేశం మొత్తం 19వ శతాబ్దమునకు బ్రిటిష్ వలసరాజ్యమైనది. అంతకన్నా ముందే క్రీ.శ 15-16 శతాబ్దములనాటికే చాలా దేశములు బ్రిటిష్ వలస రాజ్యములుగా నుండి బ్రిటిష్ వారి నిరంకుశ పరిపాలనలోనుండెడివి. అట్టిదేశములగు [[కెనడా]], [[న్యూజిలాండ్]], [[ఆస్ట్రేలియా]], [[దక్షిణాఫ్రికా]], [[న్యూఫౌండ్లాండ్]] మున్నగు దేశములను బ్రిటిష సామ్రాజ్యమునకు డొమీనియన్లుగా ఘోషించి వాటికి 19 -20 శతాబ్ధములలో బ్రిటిష్ వారు స్వరాజ్యపరిపాలన కలుగచేసి సామ్రాజ్యమకుటములోనుండినటుల అనుగ్రహించి రాజ్యాంగము కలుగచేసి అదినివేశ స్వరాజ్యములుగా(డొమీనియన్లు) చేశారు. అటువంటి డొమీనియన్ల లో కెనడా మరియు న్యూజిలాండ్ మొట్టమొదటగా ఘోషించబడ్డ బ్రిటిష్ డొమీనియనులు(అదినివేశ స్వరాజ్యములు). అందుచే చాలాకాలము దాకా ఆ రెండుదేశముల పేర్లు [[కెనడా డొమీనియన్]] [[న్యూజిలాండ్ డొమీనియన్]] అనబడుతూవుండేవి. తరువాత డొమీనియన్లుగా ఘోషించిన దేశముల పేర్లకు డొమీనియన్ అను మాటను జతచేసివుండలేదు. అనేక దేశములు బ్రిటిష్ వలసరాజ్యము గా మారిన చరిత్ర చూడగా బ్రిటిష్ ప్రభుత్వము సరాసరి ఇతరదేశములను ముట్టడించి వలసరాజ్యములుగా చేసుకునివుండలేదు. బ్రిటిష్ దేశ ప్రజలు 17వ15-16వ శతాబ్దమునుండీ వృత్తిరీత్య, జీవనాధారము రీత్య ఇతరదేశములకు వలసపోయి అక్కడె స్థిరపడియుండినవారికి వారిదేశీయుల రక్షణ, సంక్షేమముల కొరకు బ్రిటిష్ ప్రబుత్వము ఆయాదేశములలో పరిపాలనా యంత్రాంగములను స్తాపించి (colonies) క్రమేణ ఆ దేశములను వలసరాజ్యములుగా పరిగణించారు. బ్రిటిష్ ప్రజలు ఇతరదేశములకు వలసకు పోయినవారిని బ్రిటిష్ ప్రభుత్వము వారు వారి రాజప్రతినిధులను పంపి క్రమేణారాజ్యపాలనాధికారములు చేపట్టి ఆ దేశములను పరిపాలించుటకు సైనిక సహాయంతో గవర్నర్లను నియమించి సుస్థిర వలసరాజ్యములు స్థాపించారు. పైనచెప్పిన దేశములు భారతదేశముకన్నాచాల ముందుగనే బ్రిటిష్ వలసరాజ్యములు గా నుండిన దేశములు. అవి 19-20 శతాబ్దములలో అధినివేశ స్వరాజ్యాములుగా అయినవి. 1940 నాటికి ఇండియా పాకిస్తాన్ కూడా అదినివేశ స్వరాజ్యములుగ పరిగణింప బడినవి.
 
 
=== అధినివేశ స్వరాజ్యములు===