అధినివేశ ప్రతిపత్తి: కూర్పుల మధ్య తేడాలు

సవరణ
పంక్తి 2:
 
==బ్రిటిష్ సామ్రాజ్య రూపురేఖలు. 19- 20 వశతాబ్ధమునాటి చరిత్ర ==
భూగోళముగా చాల విస్తారమై సాంఘికముగా వివిధదేశములు, జాతివారు, మతమువారు కలిసిన పెద్ద రాజకీయ సంస్థ బ్రిటిష్ సామ్రాజ్యము. వివిధ రాజ్యముల సమ్మెళనము. ఆ సామ్రాజ్యములోనుండిన రాజ్యములు ముఖ్యమైనవి [[ఇంగ్లాండ్]], [[స్కాట్లాండ్]], [[ఉత్తర ఐర్లాండ్]]. వీటినే [[బ్రిటిష్ దీవులు]] అనెడివారు. ఆ బ్రిటిష్ దీవుల ప్రభుత్వమే సామ్రాజ్య సార్వభౌవము. రాజుగారి పేరట పార్లమెంటు చే బ్రిటిష్ దీవులు పరిపాలింపబడుచుండెను. బ్రిటిష్ సామ్రాజ్యములో మూడు రకములైన రాజ్యములుండెడివి. (1) డొమీనియన్సు గా: [[కెనడా]](Canada Dominion), [[ఆస్ట్రేలియా]], [[దక్షిణాఫ్రికా]], [[న్యూజిలాండ్]], [[న్యూఫౌండ్లాండ్]], [[ఐరిషఫ్రీ స్టేట్]] లు అధినివేశస్వరాజ్యములుగా భ్రిటిష్ సామ్రాజ్యములో భాగముగా నుండెడివి. కానీ ఆవి రాజ్యాంగము కలిగియున్న స్వపరిపాలితరాజ్యములు. బ్రిటిష్ దీవులప్రబుత్వము ఆ డొమీనియన్సపై ఎట్టి రాజ్యాధికారము కలిగియుండలేదు. (2) బ్రిటిష్ సామ్రాజ్యములోని రెండవ రకమైన వలసరాజ్యములు రాజ్యాంగముకలిగినవి. వాటి రాజ్యాంగములలో ఎక్కువపాళ్లు వారి వారి ఆంతరంగిక పరిపాాలనయేనుండినది. కాని కొన్ని విషయములలో సామ్రాజ్యసార్వభౌముని అధికారము చెలామణి అగుచుండెను. అటువంటి దేశములు [[మాల్టా]], [[దక్షిణ రొడీషియా]] (3) మూడవ రకం వలసరాజ్యములు సరాసరి బ్రిటిష్ ప్రబుత్వ వలసరాజ్యములు. వీటిపరిపాలననే కొలోనియల్ పరిపాలననేవారు. వీటికి స్వపరిపాలననేదేరాజ్యాంగముగానీ స్వపరిపాలనగానీ లేదు. బ్రిటిష్ ప్రభుత్వపు ప్రతినిధి బ్రిటన్ దేశపు వలసదేశపు రాజ్యాంగమంత్రి చెప్పుచేతలక్రిందయుండును.ఇట్టి వర్గమునకు చెందిన వలసరాజ్యములు 20 శతాభ్దారంబములోనివి సింహళము (ఇప్పటి స్రీలంక), పాపువాదీవి, డాగ్ దీవులు ([[ఆస్ట్రేలియా]], [[న్యూజిలాండ్]] పై ఆధారపడియున్న సామంతరాజ్యదేశములు). బహుశః బారతదేశము 1930 నాటికి ఆ వర్గములోనుండిన బ్రిటిష్ వలసరాజ్యము. 1940 తరువాతనుండీ భారతదేశము, [[పాకిస్తాన్]] కూడా అధినివేశ స్వరాజ్యములుగా పరిగణింపబడినవి. (4) ఇంకా ఒక వర్గం వలసరాజ్యములు రక్షితరాజ్యములనబడినవి బ్రిటిష్ సామ్రాజ్యము వారి సంరక్షిత రాజ్యములు (Protectorates), దక్షత రాజ్యములు (protected states) <ref name="ది.వేం.శి(1933)"/>