వేదాంతం సత్యనారాయణ శర్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
 
==జీవిత విశేషాలు==
వేదాంతం సత్యనారాయణ శర్మ [[1935]] [[సెప్టెంబరు 9]] న [[కృష్ణా జిల్లా]] కూచిపూడి గ్రామంలో జన్మించారు. కూచిపూడి ఇలవేల్పు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో పద్మశ్రీ సత్యనారాయణ శర్మకు 5వ ఏటనే నాట్య గురువులు [[వేదాంతం ప్రహ్లాదశర్మ|వేదాంతం ప్రహ్లదశర్మ]] నాట్యంలో అరంగేట్రం చేయించారు. దివంగత వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్త్రి వద్ద శిక్షణ పొంది యక్షగానాలు,భామా కలాపాలు, నాటకాలు, భరత కళా ప్రపూర్ణ చింతా కృష్ణమూర్తి వద్ద నాట్యంలో తర్ఫీదుపొందారు. కూచిపూడి సంగీతాన్ని, వయోలిన్‌ను కూడా చిన్న వయస్సులోనే ఔపోసన పట్టారు. తన 18వ యేటనే అనగా 1953లో ఢిల్లి లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సమక్షంలో ఉషాపరిణయం నాటకంలో పార్వతీ పాత్రను పోషించి స్త్రీ పాత్రధారణకు ప్రాణం పోశారు. అప్పటి నుంచి స్త్రీ పాత్రలలో రాణించారు. అభినవ సత్యభామగా సత్యనారాయణ శర్మ మంచి గుర్తింపు పొందారు. దేశ విదేశాలలో సత్యనారాయణశర్మ అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన పద్మశ్రీ, కేంద్ర సంగీత నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్‌ నృత్య అకాడమీ, భారత కళా ప్రపూర్ణ, కళాదాస్‌ సన్మాన అవార్డులను అందుకున్నారు. భామా కలాపంలో సత్యభామ, శ్రీకృష్ణుడు, సూత్రధారులనే మూడు పాత్రలతో నడిచిన శృంగార,భక్తి ,జ్ఞాన ,వైరాగ్య బోదకమైన ముచ్చటగొలిపే నాటక ప్రక్రియ. సత్యభామ పాత్రలు పోషించిన వారు ఆనాటి నుండి ఈనాటి వరకూ ఎందరో ఉన్నా సమకాలీనంగా గుర్తుకు వచ్చేది ఈయనే. ఆయనకు భార్య ల క్ష్మీ నరసమ్మ, ఇద్దరు కుమార్తెలునాగలక్ష్మి, రాధ, కుమారుడు నాగ ప్రసాద్‌ ఉన్నారు.
 
==పిన్నవయస్సులోనే...==