చింతా కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''చింతా కృష్ణమూర్తి''' కూచిపూడి నాట్యాచార్యుడు. ==జీవిత విశేషా...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''చింతా కృష్ణమూర్తి''' [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నాట్యాచార్యుడు.
==జీవిత విశేషాలు==
ఆయన 1912లో కృష్ణాజిల్లాకు[[కృష్ణా జిల్లా|కృష్ణాజిల్లా]]<nowiki/>కు చెందిన కూచిపూడి గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి [[చింతా వెంకట్రామయ్య]] కూడా ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు. ఆయన తండ్రిగారు వెంకటరామ నాట్య మండలి ట్రూపును ప్రారంభించి అనేక ప్రదర్శనలిచ్చాడు. బాల్యంలో కృష్ణమూర్తి వివిధ ప్రదర్శనలలో ప్రహ్లాదుడు, లవుడు మరియు కుశుడు వంటి వేషాలు వేసేవాడు. తరువాత ఆయన ప్రముఖ పాత్రలైన హరిశ్చంద్ర, రాముడు, కృష్ణుడు, అర్జునుడు మరియు వివిధ పురాణ పాత్రలను పోషించాడు.
 
ఆయన కూచిపూడి పరంపరకు చెందిన కుటుంబానికి చెందినవాడు. ఆయన కూచిపూడి నృత్యాన్ని తన కుటుంబంతో పాటు ప్రముఖ నాట్యాచార్యుడు [[వేదాంతం సత్యనారాయణ శర్మ|వేదాంతం సత్యం]] వద్ద కూడా నేర్చుకున్నాడు. ఆయన వెంకటరామ నాట్య మండలి ద్వారా వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రదర్శనలనిచ్చేవాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ తో పాటు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ప్రదర్శనలిచ్చాడు. ఆయన బండ కనకలింగేశ్వరరావుతో కలసి శ్రీ సిద్దేంద్ర కళాక్షేత్రాన్ని కూచిపూడిలో నెలకొల్పడానికి కీలక పాత్ర వహించాడు. ఆయన 1969లో మరణించాడు.<ref>[http://www.indianetzone.com/30/chinta_krishnamurthy_indian_dancer.htm Chinta Krishnamurthy, Indian Dancer]</ref>
 
ఆయనకు 1968లో [[కేంద్ర సంగీత నాటక అకాడమీ|సంగీత నాటక అకాడమీ పురస్కారం]] వచ్చింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చింతా_కృష్ణమూర్తి" నుండి వెలికితీశారు