మామిడి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లం ను → లాన్ని , లో → లో (4), ను → ను (2), గా → గా , తో → తో , ఖచ using AWB
+ ఎక్జిమా & ఇతర లింకులు
పంక్తి 74:
* కడుపులో పురుగులు: మామిడి టెంకలోని జీడిని వేరుపరచి ఆరబెట్టాలి. దీనికి పెద్ద చెంచాడు మెంతులను కలిపి మెత్తగా నూరాలి. దీనిని ఒక ''సీసా''లో భద్రపరచుకొని కొన్నిరోజులపాటు మజ్జిగతో కలిపి తీసుకోవాలి.
* ఆర్శమొలలు (రక్తయుక్తం) : అర చెంచాడు మామిడి జీడిని పొడి రూపంలో పెరుగు మీది తేటతో కలిపి తీసుకోవాలి.
* [[జ్వరం]]: మామిడి వేర్లను మెత్తగా రుబ్బి అరికాళ్ళకు, అరి చేతులకు రాసుకుంటే జ్వరంలో కనిపించే వేడి తగ్గుతుంది.
* బట్టతల: ఒక జాడీలో కొబ్బరి నూనెను గాని, నువ్వుల నూనెను తీసుకొని మామిడి కాయలను ఊరేయండి. ఇలా సంవత్సరంపాటు మాగేసి తల నూనెగా వాడుకోవాలి.
* చెవి నొప్పి: స్వచ్ఛమైన మామిడి ఆకులనుంచి రసం తీసి కొద్దిగా వేడిచేసి, నొప్పిగా ఉన్న చెవిలో డ్రాప్స్‌గా వేసుకోవాలి. ముక్కునుంచి రక్తస్రావం: మామిడి జీడినుంచి రసం తీసి రెండు ముక్కు రంధ్రాల్లోనూ డ్రాప్స్‌గా వేసుకోవాలి.
పంక్తి 80:
* దంత సంబంధ సమస్యలు: మామిడి ఆకులను ఎండించి బూడిద అయ్యేంతవరకూ మండించండి. దీనికి ఉప్పుకలిపి టూత్ పౌడర్‌లా వాడుకోవాలి. ఈ పొడికి ఆవ నూనెను కలిపి వాడుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.
* కాలిన గాయాలు: మామిడి ఆకుల బూడిదను ‘డస్టింగ్ పౌడర్’లా వాడితే గాయాలు త్వరగా నయమవుతాయి.
* [[ఎక్జిమా|ఎగ్జిమా]]: మామిడి చెట్టు బెరడును, నల్ల తుమ్మ బెరడును తెచ్చి కచ్చాపచ్చాగా దంచి ఉంచుకోండి. రోజూ పిడికెడంత మిశ్రమాన్ని తీసుకొని అర లీటరు నీళ్ళలో వేసి ఆవిరి వచ్చేవరకూ మరిగించి, ఆవిరిని ఎగ్జిమా సోకిన ప్రదేశానికి తగిలేలా చేయాలి. తడి ఆరిన తర్వాత నెయ్యి రాసుకొని మర్ధనా చేసుకోవాలి.
* [[పుండు|పుండ్లు]]: మామిడి బెరడును చిన్న చిన్న పీలికలు అయ్యేంతవరకూ దంచి, నీళ్ళలో వేసి మరిగించండి. ఈ డికాక్షన్‌తో పుండ్లను, వ్రణాలను కడిగితే త్వరగా మానతాయి.
* నీరసం: మామిడి ముక్కలకు చెంచాడు తేనెను, పిసరంత కుంకుమ పువ్వును, ఏలకులు, రోజ్‌వాటర్లను చిలకరించి ఆస్వాదించండి.
* [[వడదెబ్బ]]: పచ్చి మామిడికాయను నిప్పుల మీద వేడిచేసి పిండితే సులభంగా గుజ్జు వస్తుంది. దీనికి కొద్దిగా చన్నీళ్ళను, పంచదారను చేర్చి తాగాలి. దీనివల్ల దప్పిక తీరడమే కాకుండా ఎండల తీక్షణతవల్ల కోల్పోయిన శక్తి తిరిగి వస్తుంది.
* [[చెమటకాయలు|చెమట కాయలు]]: రెండు పచ్చి మామిడి కాయలను గిన్నెలో నీళ్ళుపోసి ఉడికించాలి. చల్లారిన తర్వాత గుజ్జును పిండి పంచదార, ఉప్పు కలిపి సేవించండి. దీనివల్ల శరీరంలో వేడి తగ్గి, ఒళ్లు పేలకుండా ఉంటుంది.
* [[మధుమేహం]]: లేత మామిడి ఆకులను, వేప చిగుళ్ళను సమానభాగాలు తీసుకొని మెత్తగా నూరి ముద్దగా చేయాలి. దీనిని నమిలి మింగేయాలి. ఇలా కొంతకాలం చేస్తే మధుమేహంలో హితకరంగా ఉంటుంది. ఇదే విధమైన యోగం మరోటి వుంది. మామిడి పూతను, మామిడి పిందెలను, ఎండిన నేరేడు గింజలను తీసుకొని మెత్తగా చూర్ణం చేసి భద్రపరచుకోవాలి. దీనిని ప్రతిరోజు చిన్న చెంచాడు మోతాదుగా తీసుకోవాలి. ఇది మధుమేహ రోగులకు ఉపయోగకారి.
* స్టీృన్ (ప్లీహం) పెరుగుదల, కాలేయపు సమస్యలు: గుప్పెడు మామిడి గుజ్జుకు చిన్న చెంచాడు తేనెను కలుపుకొని మూడుపూటలా తాగండి. కాలేయపు సమస్యల్లో మామిడి గుజ్జును పాలతో కలిపి తీసుకోవాలి.
* విరేచనాలు: మామిడి టెంకను పగులకొట్టి దీనిలోని జీడిని వేరుపరిచి నీడలో ఆరబెట్టాలి. తర్వాత దీని బరువుకు సమానంగా సోపు (శతపుష్ప) గింజలను తీసుకోవాలి. ఈ రెండింటిని విడివిడిగా చూర్ణం చేసుకోవాలి. తర్వాత రెండు చూర్ణాలను బాగా కలిపి పలుచని గుడ్డతో జల్లించాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చెంచాడు చొప్పున వేడి నీళ్ళతో తీసుకోవాలి. దీనితోపాటు మామిడి బెరడు లోపలి పొరను పేస్టులాగా చేసి బొడ్డు చుట్టూ రాస్తే ఇంకా మంచిది. మామిడి జీడే కాకుండా మామిడి పూత కూడా విరేచనాలను ఆపడానికి ఉపయోగపడుతుంది. ఎండిన మామిడి పూతను తేనెతో కలిపి తీసుకుంటే సరిపోతుంది. ఇంతే కాకుండా మామిడి పూతను, దానిమ్మ పువ్వులను కలిపి ఎండించి, పొడిచేసి మజ్జిగతో కలిపి కూడా తీసుకోవచ్చు.
* “పచ్చి మామిడి” వేసవితాపం భరించలేక వడదెబ్బకు గురయ్యేవారు పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక గ్లాసు నీటిలో వేసి.. దాంట్లోనే కాస్త చక్కెర వేసి బాగా కలపాలి. కాసేపటి తరువాత ఈ ద్రవాన్ని తాగినట్లయితే వడదెబ్బ బారినుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే పచ్చి మామిడి ముక్కలపై కాస్త ఉప్పు వేసి తినటంవల్ల అధిక దాహాన్ని అరికట్టడమేగాకుండా.. చెమట ద్వారా శరీరంలోని లవణాలు, రక్తంలోని ఐరన్ తదితరాలు బయటకు పోకుండా ఆపుతుంది.
* వేసవిలో సంభవించే [[అతిసారం|డయేరియా]], [[రక్త విరేచనాలు]], పైల్స్, వికారం, [[అజీర్ణం|అజీర్తి]], [[మలబద్దకం|మలబద్ధకం]] లాంటి సమస్యలకు టెంక పూర్తిగా ఏర్పడని పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటికి ఉప్పు, తేనెను[[తేనె]]<nowiki/>ను కలిపి తింటే అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది. ఇంకా.. పచ్చి మామిడికి మిరియాలు, తేనె కలిపి తిన్నట్లయితే.. జాండీస్ (పచ్చ కామెర్లు) వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. అంతేగాకుండా మామిడి గుండెకు మంచి టానిక్‌లాగా పనిచేస్తుంది. పచ్చి మామిడికాయలో విటమిన్ సీ పుష్కళంగా లభిస్తుంది. గుండె కండరాలను బిగుతుగా చేసే శక్తి మామిడికి ఉంది. అలాగే చర్మాన్ని మిలమిలా మెరిసేలా చేసే శక్తి కూడా దీనికి అధికంగా ఉంది. అయితే అతి అనేది అన్ని వేళలా సరికాదు కాబట్టి.. ఎక్కువ మోతాదులో పచ్చిమామిడిని తినకూడదు. అలా తిన్నట్లయితే ఆర్ధరైటిస్, కీళ్లవాతం, సైనసైటిస్, గొంతునొప్పి, అసిడిటీ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మామిడిని పరిమితంగా తినటం మంచి పద్ధతి.
 
;మామిడితో గ్లూకోజు అదుపు!
"https://te.wikipedia.org/wiki/మామిడి" నుండి వెలికితీశారు