మామిడి: కూర్పుల మధ్య తేడాలు

+ ఎక్జిమా & ఇతర లింకులు
పంక్తి 59:
== మామిడి ఉపయోగాలు ==
{{nutritionalvalue | name=మామిడి, ముడి | kJ= 272| protein=.51 గ్రా. | fat=0.27 గ్రా. | carbs=17.00 గ్రా. | fiber=1.8 గ్రా. | | sugars=14.8 గ్రా. | iron_mg=0.13| calcium_mg=10 | magnesium_mg=9 | phosphorus_mg=11 | potassium_mg=156 | zinc_mg=0.04 | vitA_ug = 38 | betacarotene_ug=445 | vitC_mg=27.7 | pantothenic_mg=0.160 | vitB6_mg=0.134 | folate_ug=14 | thiamin_mg=0.058 | riboflavin_mg=0.057 | niacin_mg=0.584 | right=1 | source_usda=1 |note=}}
ప్రపంచం అంతటా ఇప్పుడు [[మామిడి పండు]] తినడం పట్ల మక్కువ పెరిగింది. ఇప్పుడు ఈ పంటను సమశీతోష్ణ పరిస్థితిలో కూడా పండిస్తూ ఉన్నారు భారతద్వీపకల్పం అంతటా, కరేబియన్ (Caribbean), మధ్య అమెరికా, [[మధ్య ఆసియా]], దక్షిణ తూర్పు అసియా, మధ్య మరియు దక్షిణ [[ఆఫ్రికా]] దేశాలలోను పండిస్తున్నారు. దీనిని ఎక్కువగా తాజాగానే తింటారు. ఇంకా పంటగా వేయని దక్షిణ ఫ్లోరిడాలో కూడా మామిడిచెట్టుని ఇంటి పెరటిలో చూడవచ్చు.
 
మామిడిపండ్లు ప్రపంచమంతా ఇష్టమైన ఆహారమే అయినా రైతులు తక్కువ ప్రతిఫలం పొందుచున్నారు. అందువలన ఇవి అందరికి అందుబాటులో ఉంటాయి. తాజా మామిడి పండులో పదిహేను శాతం (15%) [[చక్కెర]], ఒక శాతం (1%) [[మాంసకృత్తులు]] మరియు గుర్తించ తగిన మోతాదులో ఎ, బి, సి (A, B, C) [[విటమిన్లు]] ఉంటాయి. మామిడిపండు ఎక్కువగా తియ్యగా ఉన్నా, కొన్నిజాతుల పండు కొంచెం పుల్లగా ఉంటుంది, ముఖ్యంగా చిలక ముక్కు (బెంగళూరు) మామిడి ఈ కోవకు చెందినదే. అందువలనే భారతదేశంలో చిన్నచిన్న వ్యాపారులు వీటిని సన్నని పోడవైన ముక్కలుగా కోసి ఉప్పుకారం చల్లి బండిమీద అమ్ముతూ ఉంటారు. చాలామందికి నోరూరించే ఆహారం. కొన్ని పండ్లు [[పీచు]] ఎక్కువ రసంతో ఉంటాయి. వీటిని రసాలు అంటారు. కొన్ని కరకరలాడే కండతో ఉంటాయి వీటిని మల్ గోవా మామిడి అంటారు. బంగినపల్లి రకం మామిడి కాయలు ఎక్కువ తీయగా మెత్తటి కండ కలిగి ఉంటాయి. నీటిశాతం ఎక్కువ కనుక రసభరితంగా ఉంటాయి. మామిడి కాయలతో దీర్ఘకాలం నిలవ ఉండే పచ్చళ్ళు ([[ఊరగాయ]] లు) తయారు చేస్తారు.
"https://te.wikipedia.org/wiki/మామిడి" నుండి వెలికితీశారు