వీర్ల దేవాలయం (కారంపూడి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
== వీరోత్సవాలు ==
శతాబ్దాల చరిత్రకు తార్కాణం వీరారాధనోత్సవాలు.. దాయాదుల సమరంతో మహాభారతంతో సమానంగా చరిత్రపుటల్లో ఎనలేని ఖ్యాతి గడించింది పల్నాటి చరిత్ర. సంకుల సమరంలో ఎందరో వీరనాయకులు అసువులు బాసిన కార్యమపూడి నేటి [[కారంపూడ కారంపూడి]] సమర క్షేత్రంలో అలనాటి వీరనాయకులకు ప్రతీకగా ఉన్న ఆయుధాలకు (కొణతాలు) పూజలు నిర్వహించటం, వారి పేరుతో ఆరాధనలు చేయటం పరిపాటిగా వస్తోంది. కార్తీక అమావాస్య నాడు ప్రారంభమయ్యే ఆరాధనోత్సవాలు ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు<ref>http://epaper.sakshi.com/1001602/Guntur-District/15-11-2016#page/18/2</ref>.
 
పల్నాట [[శైవ]], [[వైష్ణవ]] సంప్రదాయాలను నింపటం కోసం పల్నాడు యుద్ధానికి బీజాలుపడ్డాయి. క్రీ.శ. 1187లో పల్నాడు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో గురజాల, మాచర్ల రాజులైన నలగాముడు, మలిదేవాదులు తలపడ్డారు. శైవం కోసం నాగమ్మ, వైష్ణవం కోసం బ్రహ్మనాయుడు వర్గాలు రణక్షేత్రంలో కరవాలాలను ఝుళిపించాయి. ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకుంటూ, ప్రజాసంక్షేమాన్ని కాపాడుతూ పల్నాటి యుద్ధానికి అతిరథులు బీజం వేశారు. ఇరురాజ్యాలకు మధ్యనున్న కారంపూడి ని రణక్షేత్రంగా ఎంచుకొని కత్తులు దూశారు.