"ప్రియదర్శన్" కూర్పుల మధ్య తేడాలు

1984లో ప్రియదర్శన్ తన స్నేహితులైన సురేష్ కుమార్, సనల్ కుమార్ లతో కలిసి అప్పట్లో మలయాళంలో గిరాకీ ఉన్న నటుడైన శంకర్ సహాయంతో ఓ ప్రముఖ నిర్మాత దగ్గర ఆర్థిక సహాయం పొంది శంకర్, మోహన్ లాల్ హీరోలుగా ఓ సినిమా తీశారు. అలా 1984 లో ''పూచక్కోరు మూక్కుత్తు'' అనే సినిమాతో ప్రియదర్శన్ దర్శకుడయ్యాడు. అది తక్కువ బడ్జెట్ లో తీసిన ఓ హాస్య సినిమా అయినా ఆశ్చర్యకరమైన రీతిలో విజయం సాధించించి. కేరళలోని కొన్ని థియేటర్లలో వంద రోజులు ఆడింది.
 
అదే ఊపులో ప్రియదర్శన్ మరి కొన్ని హాస్య సినిమాలు తీసి విజయం సాధించాడు. 1988 సంవత్సరంలో ప్రియదర్శన్ అనేక విజయవంతమైన సినిమాలు రూపొందించాడు. 1991 లో [[అక్కినేని నాగార్జున]] ''వందనం'' అనే మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేయమని కోరడంతో [[నిర్ణయం (సినిమా)|నిర్ణయం]] పేరుతో దాన్ని తెలుగులో తీశాడు. 1992 లో తన మలయాళ సినిమా ''కిళుక్కమ్'' ను హిందీ లో ''ముస్కురహత్'' పేరుతో హిందీలో రీమేక్ చేయడం ద్వారా బాలీవుడ్ లోకి ప్రవేశించాడు. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. 1993 లో అతను హిందీలో తీసిన ''గర్దిష్'' మంచి విజయం సాధించడంతో అక్కడ కూడా నిలదొక్కుకున్నాడు. 1994 లో తన రెండో తెలుగు సినిమా [[నందమూరి బాలకృష్బాలకృష్ణ]]ణతోతో [[గాండీవం (సినిమా)|గాండీవం]] అనే సినిమా తీశాడు. తెలుగులో ఇప్పటిదాకా ఆయన తీసిన ఆఖరు చిత్రం ఇదే.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2023052" నుండి వెలికితీశారు