క్రిస్టియాన్ హైగెన్స్: కూర్పుల మధ్య తేడాలు

క్రిస్టియన్ హైగెన్స్ వ్యాస విలీనం చేసితిని
+కాంతి వ్యతికరణం లింకు
పంక్తి 38:
[[నెదర్లాండ్స్‌]] ముఖ్యపట్టణం హేగ్‌లో 1629 ఏప్రిల్‌ 14న పుట్టిన హ్యూజీన్స్‌ పదహారేళ్ల వరకూ ఇంటి వద్దనే ట్యూషన్ల సాయంతో చదువుకున్నాడు. ఆపై విశ్వవిద్యాలయాల్లో చేరి సైన్స్‌, గణిత, న్యాయ శాస్త్రాలు అభ్యసించాడు. తన 34వ ఏట ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీగా ఎన్నికైన ఈయన గెలిలియో ఉపయోగించిన లఘులోలకానికి మార్పులు చేసి కాలాన్ని కొలవడానికి ఉపయోగించే లోలకపు గడియారాన్ని కనుగొన్నాడు. ధ్రువ ప్రాంతాల నుంచి భూమధ్య రేఖ దిశగా ప్రయాణించేప్పుడు లోలకపు గడియారం చూపించే మార్పులకు కారణం భూమి పరిభ్రమణం వల్ల కలిగే అపకేంద్రక బలమేనని చెప్పాడు. అప్పటి టెలిస్కోపులో లోపాలను గమనించిన హ్యూజీన్స్‌ స్వయంగా కటకాలను తయారు చేసుకుని వాటితో శనిగ్రహం వలయాలను పరిశీలించాడు. దాని అతి పెద్ద ఉపగ్రహం టైటాన్‌ను కనిపెట్టాడు.
 
ఆయన ప్రతిపాదించిన 'కాంతి తరంగ సిద్ధాంతం' (wave theory of light) భౌతిక శాస్త్రాన్నే మలుపు తిప్పిందని చెప్పవచ్చు. నీటి తరంగాల్లా, ధ్వని తరంగాల్లా కాంతి, ఈథర్‌ అనే మాథ్యమంలో తరంగాల రూపంలో పయనిస్తుందని చెప్పిన ఈ సిద్ధాంతం కాంతి ధర్మాలైన పరావర్తనం, [[వక్రీభవనం]], [[కాంతి వ్యతికరణం|వ్యతికరణం]], వివర్తనం, ధ్రువీకరణాలన్నింటినీ వివరించగలిగింది. దీని ఆధారంగానే తర్వాత కాలంలో విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతానికి పునాది పడింది. హ్యూజీన్స్‌ రాసిన 'Treatise on Light'ఇప్పటికీ ప్రామాణిక గ్రంథమే.
 
==అవార్డులు==