తరిగొండ వెంగమాంబ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , భోధించా → బోధించా, గ్రంధా → గ్రంథా, ఉ using AWB
పంక్తి 39:
'''తరిగొండ వెంకమాంబ''' ([[1730]] - [[1817]]<ref name="సింహావలోకనము">{{cite book|last1=ప్రభాకరశాస్త్రి|first1=వేటూరి|title=సింహావలోకనము|date=2009|publisher=తిరుమల తిరుపతి దేవస్థానం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=sin%27haavalookanamu&author1=prabhaakarashaastri%20veit%27uuri&subject1=GENERALITIES&year=1955%20&language1=Telugu&pages=220&barcode=2030020024540&author2=&identifier1=&publisher1=mand-i%20man%27jari&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/655|accessdate=7 December 2014}}</ref>), 19వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. వెంకమాంబ అనేక పాటలు, [[యక్షగానం|యక్షగానాలు]] రచించినది.
 
వెంకమాంబ==జీవితంవెంకమాంబ [[చిత్తూరు]] జిల్లా, [[గుర్రంకొండ]] మండలములోని [[తరిగొండ]] గ్రామములో వాసిష్ఠ గోత్రీకుడైన కావాల కృష్ణయ్య, మంగమాంబ అను నందవారిక [[బ్రాహ్మణ]] దంపతులకు 1730లో జన్మించినది<ref name="సింహావలోకనము" />.==
==జీవితం==
వెంకమాంబ [[చిత్తూరు]] జిల్లా, [[గుర్రంకొండ]] మండలములోని [[తరిగొండ]] గ్రామములో వాసిష్ఠ గోత్రీకుడైన కావాల కృష్ణయ్య, మంగమాంబ అను నందవారిక [[బ్రాహ్మణ]] దంపతులకు 1730లో జన్మించినది<ref name="సింహావలోకనము" />.
 
వెంకమాంబ బాల్యములో తన తోటి పిళ్లవాళ్లలాగా ఆటలాడుకోక ఏకాంతముగా కూర్చొని [[భక్తి]] పారవశ్యముతో మునిగితేలేది. ఆ చిరు ప్రాయములోనే అనేక భక్తి పాటలను కూర్చి మధురముగా గానము చేసేది. తండ్రి ఆమె భక్తిశ్రద్ధలను గమనించి ఆమె నైపుణ్యమును సానబెట్టుటకు సుబ్రహ్మణ్య దీక్షితులు అనే [[గురువు]] వద్దకు శిక్షణకు పంపినాడు. దీక్షితులు ఆమె ప్రతిభను గుర్తించి తనకు తెలిసిన పరిజ్ఞానమంతా వెంకమాంబకు బోధించాడు. అనతి కాలములోనే వెంకమాంబ ప్రశస్తి నలుమూలల పాకడముతో తండ్రి ఆమె విద్యాభ్యాసమును మాన్పించి తగిన వరునికోసము వెతకడము ప్రారంభించాడు.
 
తల్లి వెంకమాంబను ఇంటి పనులలో సహాయము చేయమని కోరగా తన సేవ భగవంతునికే అర్పణమని వెంకమాంబవెంmvrchandravadanమాంబ తిరస్కరించినది. అనేక మంది వరులు ఆమెను చూచి చాలా అందముగా ఉన్నదనో, చాలా తెలివైనదనో నెపములతో [[పెళ్లి]] చేసుకొనుటకు సమ్మతించలేదు. చివరకు ఇంజేటి వెంకటాచలప్ప ఆమె అందమును చూసి ముగ్ధుడై ప్రేమలో పడి వెంకమాంబను వివాహమాడుటకు అంగీకరించాడు. తండ్రి ఆమెకు మంచిభార్యగా మసలుకోమని హితవు చెప్పి వివాహము జరిపించాడు. వివాహానంతరము వెంకటాచలప్ప ఆమె భక్తి మౌఢ్యాన్ని వదిలించ ప్రయత్నము చేసాడు కానీ వెంకమాంబ అతనిని దగ్గరికి రానివ్వలేదు.
 
ఈమె [[తిరుమల]]లో ఆలయానికి ఉత్తరాన 15 కి.మీ. దూరాన దట్టమైన అడవులలో [[తుంబురు కోన]] వద్ద యోగాభ్యాసం చేస్తూ గడపినట్లు తెలుస్తున్నది. ఈమెకు [[వేంకటేశ్వరుడు]] కలలో కనుపిస్తూ ఉంటాడని అనేవారు. తిరుమలలో ఉత్తర వీధిలో ఉత్తర దిశలో ఉన్న వనంలో (ప్రస్తుతం ఉన్న ఒక పాఠశాలలో) ఈమె సమాధి ఇప్పటికీ ఉంది. ఈమె ప్రతిరాత్రి ఊరేగింపుగా తన ఇంటిముంగిటికి వచ్చే భోగ శ్రీనివాసమూర్తికి వెండి పళ్ళెంలో [[ముత్యాల హారతి]] ఇస్తూ ఉండేదట. ఇందుకోసం ఒక్కొక్కదినం నగిషీలు చెక్కబడిన వెండిపళ్ళెంలో ఒక్కొక్క దశావతార ఘట్టాన్ని సమర్పించేదట. ఈ విషయం (ఫసలి 1230) క్రీ.శ. 1890లో [[తూర్పు ఇండియా కంపెనీవారు]] తయారు చేసిన కైంకర్య పట్టీ వలన తెలుస్తున్నది.<ref>[[సప్తగిరి]] ఆధ్యాత్మిక మాస పత్రిక, [[తి.తి.దే.]] ప్రచురణ - జనవరి 2008 - డా. రమేశన్ వ్రాసిన ఆంగ్ల గ్రంథం ధారావాహికకు డా. కోరాడ రామకృష్ణ అనువాదం</ref> ఆమె తన జీవితాంతం శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆరాధించారు. చివరకు క్రీ.శ.1817 ఈశ్వర సంవత్సరం శ్రావణ శుద్ధ నవమినాడు తరిగొండ వెంకమాంబ వేంకటేశ్వరస్వామిని స్మరిస్తూ సజీవ సమాధి చెందారు<ref name="సింహావలోకనము" />.
"https://te.wikipedia.org/wiki/తరిగొండ_వెంగమాంబ" నుండి వెలికితీశారు