రాహుల్ దేవ్ బర్మన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (7), గా → గా , తో → తో , కూడ → కూడా , నేపధ్య → నేపథ్య using AWB
+పడోసన్ లింకు
పంక్తి 18:
}}
'''రాహుల్ దేవ్ బర్మన్''' ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు మరియి గాయకుడు. జూన్ 1939న [[కలకత్తా]]లో జన్మించారు. ఇతను ఆర్.డి.బర్మన్ గా ప్రసిద్దుడు. ఇతను అనేక విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకత్వము వహించాడు. 1960వ దశకం నుండి 1990వ దశకం వరకు 331 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. భార్య [[ఆశా భోస్లే]], స్నేహితుడు [[కిషోర్ కుమార్]], [[లతా మంగేష్కర్]]లతో కలిసి అనేక జనరంజకమైన పాటలను స్వరపరిచాడు. ఈయన స్వరపరచిన పాటలు ఇప్పటికీ చాలా ప్రసిద్ధం. ఈనాటి తరం సంగీత దర్శకులు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
 
== జీవిత సంగ్రహం ==
ఆర్.డి.బర్మన్ ప్రముఖ సంగీత దర్శకుడు [[సచిన్ దేవ్ బర్మన్]], గేయ రచయిత్రి [[మీరా దేవ బర్మన్]]ల కుమారుడు. బర్మన్ కు పంచందా అనే ముద్దుపేరు ఉండేదట. దీనికి కారణంగా ఒక కథ కూడా ప్రచారంలో ఉండేది. అదేమిటంటే బర్మన్ బాల్యంలో ఏడిస్తే పంచమ స్వరం స్థాయిలో వినపడేది కాబట్టీ ఆ పేరుతో పిలిచేవారని అనుకునేవారు.
Line 27 ⟶ 28:
తన స్వంత సంగీత దర్శకత్వంలో విడుదలైన మొదటి సినిమా "ఛోటే నవాబ్(1960)". నిజానికి ఈ సినిమా దర్శకుడు మొహమద్ (ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు) మొదట ఎస్.డి.బర్మన్ ను సంప్రదించగా డేట్స్ ఖాళీ లేక ఈ అవకాశాన్ని తన కొడుకుకు ఇచ్చాడు. ఆ తర్వాత మొహమద్, ఆర్.డి.బర్మన్ మంచి స్నేహితులుగా మారారు. మొహమద్ తీసిన భూత్ బంగ్లా (1965) లో సంగీత దర్శకత్వంతో పాటు గెస్ట్ ఎపియరెంస్ ఇచ్చాడు.
== విజయాలు ==
బర్మన్ సంగీత దర్శకత్వంలో విజయవంతమైన మొదటి చిత్రం "తీస్రీ మంజిల్" (1966). ఈ సినిమాలో అవకాశం కోసం నిర్మాత, రచయిత "నాసిర్ హుస్సేన్" దగ్గర బర్మన్ సంగీత విభావరి ఏర్పాటు చేశాడట గేయ రచయిత మజ్రూహ్ సుల్తాన్ పురీ. అందుకే ఈ సినిమా పాటలు విజయవంతం కావడానికి మూల కారణం సుల్తాన్ పురీ అనేవారట బర్మన్. ఈ సినిమాలోని ఆరు పాటలనూ సుల్తాన్ పురీ రాయగా [[మహ్మద్ రఫీ]] పాడారు. వాటిలో మూడు పాటలు యుగళ గీతాలు కాగా వాటిని [[మహ్మద్ రఫీ|రఫీ]]తో పాటు [[ఆశా భోస్లే]] పాడారు. తరువాత రోజుల్లో బర్మన్ ఆమెనే పెళ్ళి చేసుకున్నారు. ఈ చిత్రం సంగీత పరంగా ఘన విజయం సాధించడంతో బర్మన్ ను, గేయ రచయితగా సుల్తాన్ పురీని మిగతా ఆరు సినిమాలకు కూడా బుక్ చేసుకున్నాడట నాసిర్ హుస్సేన్. ఆ ఆరు సినిమాలలో సంగీత పరంగానూ, కమర్షియల్ గానూ ఘన విజయం సాధించిన బహారోన్ కె సప్నా (1967), ప్యార్ కి మౌసం (1969), యాదోంకీ బారాత్ (1973), [[పడోసన్]] (1968) కూడా ఉన్నాయి. తన స్వంత సంగీత దర్శకత్వంలో సినిమాలు చేస్తూనే జ్యుయెల్ థీఫ్ (1967), ప్రేం పూజారీ (1970) సినిమాలకు తన తండ్రి వద్ద సహాయ సంగీత దర్శకునిగా పనిచేశారు. తండ్రి ఎస్.డి.బర్మన్ సంగీత దర్శకత్వం వహించిన ఆరధన (1969) సినిమాలో [[కిషోర్ కుమార్]] పాడిన "మేరే సప్ నోం కీ రాణీ కబ్ ఆయేగీ తూ", "కోరా కాగజ్ థా యే మన్ మేరా" పాటలు ఆర్.డి.బర్మన్ కంపోజ్ చేసినవేనని పుకారు ఉండేది. ఆ సినిమాకు ఆర్.డి.బర్మన్ సహాయ సంగీత దర్శకునిగా వ్యవహరించారు.
== గుర్తింపు ==
1970వ దశకంలో బర్మన్ సంగీత దర్శకత్వం వహించిన పలు సినిమాలు సంగీత పరంగా అద్భుత విజయాలు సాధించాయి. వీటిలో ఎక్కువ సినిమాలు [[రాజేష్ ఖన్నా]] హీరోగా చేసినవే. ఆర్.డి.బర్మన్ సంగీత దర్శకత్వంలో [[కిషోర్ కుమార్]] పాడిన ఎన్నో పాటలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. కిషోర్ పాడినవే కాక [[లతా మంగేష్కర్]], [[మహ్మద్ రఫీ]], [[ఆశా భోస్లే]] పాడిన పాటలు కూడా ప్రజాదరణ పొందాయి.బర్మన్ సంగీత దర్శకత్వంలో [[కిషోర్ కుమార్]] ఎన్నో పాటలను తను తప్ప మరెవరూ పాడలేనంతగా తన ముద్ర వేశారు.
"https://te.wikipedia.org/wiki/రాహుల్_దేవ్_బర్మన్" నుండి వెలికితీశారు