దార్ల వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
==సాహిత్య దృక్పథం==
విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత డా.బి.ఆర్ . [[అంబేద్కర్]] రచనలు, ప్రసంగాల ప్రభావం వల్ల తన ఆలోచన మరింత పదునుదేరిందని పేర్కొన్నారు.<ref> దార్ల ఆత్మకథ ‘నెమలికన్నులు’</ref> అంతకు ముందు తమ స్వగ్రామంలో అంబేద్కర్ జయంతి, వర్థంతులు జరిపినప్పటికీ సెంట్రల్ యూనివర్సిటీలో చేరిన తర్వాతనే దళితవాదం పట్ల నిజమైన అవగాహన ఏర్పడిందని చెప్పుకున్నారు. అయితే, సెంట్రల్ యూనివర్సిటీలో కూడా దళిత సంఘాల్లో మాదిగ విద్యార్థులను దూరం పెట్టడాన్ని గమనించడంతో విద్యార్థులు ‘దళిత విద్యార్థి సంఘం’ (డి.ఎస్.యు) ఏర్పరిచారు. దీన్ని ‘దండోరా విద్యార్థి సంఘం’ అని పరోక్షంగా పిలిచేవారు. డి.ఎస్.యుతో పాటుగానే ‘మాదిగ సాహిత్యవేదిక’ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సంఘం, సాహిత్యవేదిక వ్యవస్థాపకుల్లో వేంకటేశ్వరరావు కూడా భాగస్వామిగా ఉన్నారు. మాదిగసాహిత్యవేదిక ఆధ్వర్యంలో వెలువడిన‘‘మాదిగచైతన్యం’’ కవితాసంకలనంతో తెలుగుసాహిత్య చరిత్రలో ‘మాదిగసాహిత్యం’ అనే ధోరణి ఒకటి ప్రారంభమైంది. దీనికి ప్రధాన సంపాదకుడు నాగప్పగారి సుందర్రాజు. సంపాదకుడుగా దార్ల వేంకటేశ్వరరావు ఉన్నారు. ఈయనతో పాటు మరికొంతమంది సంపాదకవర్గసభ్యులుగా ఉన్నప్పటికీ ఆ కవితాసంకలనం సంపాదక బాధ్యతలన్నీ వేంకటేశ్వరరావు నిర్వహించారు. ఈ పుస్తకాన్ని తీవ్రంగా విమర్శించిన సమీక్షకుడికి సంపాదకుడుగా తన వాదాన్ని వినిపిస్తూ వేంకటేశ్వరరావు ఒక ప్రతివిమర్శ వ్యాసాన్ని రాశారు. ఆ తర్వాత దళిత సాహిత్యం రాస్తున్నప్పటికీ, తెలుగులో మాదిగ సాహిత్య దృక్పథంపైనే తన దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఈయన రచనల్లో మార్క్సిజం పట్ల సానుభూతి కనిపిస్తున్నా దేశీయ అవసరాలు, భావజాలవ్యాప్తిలో భాగంగా దళిత, బహుజన సాహిత్యాన్నే విస్తృతంగా రాస్తున్నారు. అస్ఫృశ్యతను ప్రధాన కారణంగా చూసినప్పుడు, అది పాకీవాళ్ళు, మాదిగల పట్లనే ఎక్కువగా కనిపిస్తుంది. పాకీవాళ్ళు (రెల్లి) కూడా జస్టీస్ రామచంద్రరాజు కమీషన్ నివేదిక ప్రకారం పాకీవాళ్ళు (రెల్లి) కూడా మాదిగ ఉపకుల జాబితాకే చెందుతారు. అందువల్ల దళితులంటేనే మాదిగలుగా గుర్తించాలనేది దార్ల వెంకటేశ్వరరావువాదన. దళితుల గురించి దళితులైనా, దళితేతరులైనా ఎవరు రాసినా దళితుల్లోని ‘అస్ఫృశ్యత’నే ప్రధాన కేంద్రంగా చేసుకున్నారు. కనుక, మాదగసాహిత్యమే దళిత సాహిత్యానికి మూలమని, మాదిగ సాహిత్యం దళితసాహిత్యం నుండి ఆవిర్భవించినట్లు చెప్పకూడదనీ, దళితసాహిత్యమే మాదిగ సాహిత్యం నుండి పుట్టుకొచ్చిందని దార్ల వెంకటేశ్వరరావు ప్రతిపాదిస్తారు.<ref>[http://www.suryaa.com/showaksharam.asp?ContentId=9670 మాదిగసాహిత్యం నుండే దళితసాహిత్యం... సూర్యదినపత్రిక, అక్షరం సాహిత్యానుబంధం, 16-2-2009]</ref>
 
==పురస్కారాలు==