అక్కినేని నాగ చైతన్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
నాగ చైతన్య నటించిన మొదటి సినిమా [[దిల్ రాజు]] నిర్మాణంలో వాసు వర్మ దర్శకత్వంలో వచ్చిన [[జోష్]]. ఈ సినిమా ద్వారా ప్రముఖ నటి రాధ కూతురు కార్తీక నటిగా పరిచయమైంది. ఈ సినిమా ఆశించదగ్గ విజయం సాధించనప్పటికీ, చైతన్యకు ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ మరియూ, నంది అవార్డులను పొందాడు. కానీ 2010లో తను అతిథి పాత్రలో నటించిన విన్నైతాండి వరువాయా సినిమా యొక్క తెలుగు పునః నిర్మాణం ఐన [[ఏ మాయ చేశావే]] చైతన్యకు మొదటి భారీ విజయాన్ని అందించింది. గౌతం మీనన్ దర్శకత్వంలో [[సమంత]] కథానాయికగా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో చైతన్య తన నటనకు విమర్శకులనుంచి ప్రశంసలందుకున్నాడు. నేటికీ తెలుగు సినిమాల్లోని ఎన్నో క్లాసిక్స్ లో ఒకటిగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఈ సినిమాకి చైతన్యకు ఉత్తమ నటుడికి గాను నాటి ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.
 
ఆ తర్వాత 2011లో [[సుకుమార్]] దర్శకత్వంలో [[100% లవ్]] సినిమాలో నటించాడు. ఇందులో [[తమన్నా]] కథానాయిక. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. కానీ ఆ తర్వాత అజయ్ భుయాన్ దర్శకత్వంలో [[కాజల్ అగర్వాల్]] కథానాయికగా తెరకెక్కిన తన చిత్రం [[దడ]], వివేక్ కృష్ణ దర్శకత్వంలో [[అమలాపాల్]] కథానాయికగా తెరకెక్కిన బెజవాడ సినిమాలు పరాజయాన్ని చవిచూసాయి. ప్రస్తుతంనాగ చైతన్య దేవ కట్ట దర్శకత్వంలో సమంత సరసన ఆటోనగర్ సూర్య, కిషోర్ పార్థాసాని దర్శకత్వంలో సునీల్, తమన్నా, ఆండ్రియా సరసన తడాఖా, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మనం, వీరూ పోట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాల్లో నటిస్తున్నాడునటించాడు. వాటిలో చెప్పుకోదగ్గ చిత్రం 'మనం'. ఈ చిత్రంలో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించడంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఎక్కువయ్యాయి. అయితే, ఈ చిత్రం పూర్తి కాకుండానే, ఎ.ఎన్.ఆర్ చనిపోవడంతో, 'మనం' సినిమా అంచనాలకు మించి, బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టించింది.
 
==వ్యక్తిగత జీవితం==
హైదరాబాద్ లో జన్మించిన నాగ చైతన్య తన తల్లిదండ్రులు విడిపోయాక చెన్నైలో ఉంటున్న తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. పీ.ఎస్.బీ.బీ. స్కూల్ లో చదువుకున్నప్పుడు చైతన్య తన తండ్రి నాగార్జున, తన పిన్ని అమలతో సఖ్యతగా ఉండేవాడు. తన స్కూల్ బ్యాండ్ లో అప్పుడప్పుడూ గిటార్ వాయించేవాడు. ముంబైలో, కాలిఫోర్నియాలోని స్టూడియోలో నటనలో శిక్షణ పొందాడు. నేటికి కూడా చైతన్య తనకు కార్లమీద ఉన్న అభిమానంతో కార్ రేసుల్లో పాల్గొంటుంటాడు. 100% లవ్ సినిమా విడుదలైన కొత్తల్లో తనకీ, ప్రముఖ నటి [[అనుష్క]]కి నిశ్చితార్థం జరిగిందని మీడియాలో వార్తలొచ్చాయి. ఐతే అవన్నీ వదంతులని నాగార్జున, చైతన్య, అనుష్కలు తేల్చి చెప్పారు. అయితే, తనతోపాటు 'ఏం మాయ చేసావే', 'మనం' వంటి చిత్రాల్లో కలిసి నటించిన సమంతకి తన లవ్ ప్రపోజ్ చేయడంతో వాళ్ల ఇద్దరి పెళ్లి త్వరలో జరగబోతోంది.
[[File:Nagarjuna with Chaitanya and Amala.jpg|thumb|నాగార్జునతొ చైతన్య మరియు అమల]]