జపాన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విదేశ వ్యవహారాలు, మిలిటరీ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సంబందా → సంబంధా using AWB
+కరవోకె లింకు, ఎంవికీ లింకుల తొలగిఉంపు
పంక్తి 72:
}}
 
'''జపాన్''' ( జపాన్ భాషలో '''నిప్పన్''' లేదా '''నిహన్''' {{lang|ja|日本国}} {{Audio|Ja-nippon_nihonkoku.ogg|నిప్పన్-కోక్}} అనేది [[తూర్పు ఆసియా]] ప్రాంతంలో [[పసిఫిక్ మహాసముద్రం]]లో ఉన్న ఒక [[దేశాల జాబితా – దీవుల దేశాలు|ద్వీప దేశం]]. ఇది [[చైనా]], [[కొరియా]], [[రష్యా]] దేశాలకు [[తూర్పు]] దిశగా ఉంది. జపాన్ దేశపు [[ఉత్తరం|ఉత్తరాన]] ఉన్న సముద్ర భాగాన్ని [[:en:Sea of Okhotsk|ఓఖోట్‌స్క్ సముద్రం]] అని, [[దక్షిణం|దక్షిణాన్న]] ఉన్న సముద్ర భాగాన్ని [[:en:East China Sea|తూర్పు చైనా సముద్రం]] అనీ అంటారు. జపాన్ భాషలో ఆ దేశం పేరు (నిప్పన్)ను వ్రాసే అక్షరాలు "సూర్యుని పుట్టుక"ను సూచిస్తాయి. కనుక జపాన్‌ను "సూర్యుడు ఉదయించే దేశం" అని అంటుంటారు.
 
జపాన్ దేశంలో సుమారు 3,000 పైగా దీవులు <ref>{{cite web | title = ''Nihon Rettō'' | url = http://dic.yahoo.co.jp/dsearch?enc=UTF-8&p=%E3%81%AB%E3%81%BB%E3%82%93%E3%82%8C%E3%81%A3%E3%81%A8%E3%81%86&dtype=0&stype=1&dname=0ss
పంక్తి 93:
అతి పురాతనమైన మట్టి పాత్రలు జపాన్ దేశము నుండే మనకు లభిస్తున్నాయి, ఇవి క్రీస్తు పూర్వం పదివేల ఐదువందల కాలానికి చెందినవి. ఆ తరువాత దొరికిన పాత్రల్లో పురాతనమైనవి [[చైనా]] మరియు [[భారత దేశము]]ల నుండి లభిస్తున్నాయి.<ref>((1995). "Past Worlds". ''The Times Atlas of Archeology''. p. 100.)</ref><ref>{{cite book |author=Habu Jinko |year=2004 |title=Ancient Jomon of Japan |publisher=Cambridge Press}}</ref><ref>{{cite web |url=http://web-japan.org/trends00/honbun/tj990615.html |title=Jomon Fantasy: Resketching Japan's Prehistory |publisher=web-japan.org |date=1999-06-22 | accessdate=2008-01-24}}</ref> మంచు యుగం ముగిసిన తరువాత జపాన్ చరిత్రలో రెండు ప్రధాన ఘట్టాలు సంభవించినాయి, వాటిలో మొదటిది మట్టి పాత్రల తయారీ! ఇది పురాతత్వ శాస్త్రవేత్తలకు బహు ఆశ్చర్యం కలిగించినది, ఎందుకంటే సాధారణంగా ఏవైనా కొత్త విషయాలు పెద్ద పెద్ద భూభాగమున్న ప్రాంతాలలో కనుగొనబడి తరువాత చిన్న చిన్న ద్వీప సముదాయాలకు వ్యాపిస్తాయి, కానీ జపాన్ చిన్న ద్వీప సముదాయము అయినా కానీ మట్టి పాత్రలను ముందే కనుగొన్నది. ఇక్కడి మట్టి పాత్రలు సుమారుగా పన్నెండు వేల ఏడువందల సంవత్సరాల క్రితానివి.<ref>{{cite web |url=http://www.jomon.or.jp/ebulletin11.html |title="Fakery" at the beginning, the ending and the middle of the Jomon Period |publisher=Bulletin of the International Jomon Culture Conference (Vol. 1) |date=2004 | accessdate=2008-01-24}}</ref>
 
క్రీ.పూ. 3వ శతాబ్దంలో [[:en:Yayoi period|యాయోయ్]] కాలంలో వరి సాగు, ఇనుము, ఇత్తడి తయారీ, క్రొత్త రకం పాత్రల తయారీ మొదలయ్యాయి. వీటిలో కొన్ని విధానాలు చైనా, కొరియాలనుండి వలసి వచ్చినవారు ప్రవేశపెట్టారు. మొత్తానికి ఈ కాలంలో జపాన్ ఒక వ్యవసాయ ప్రాముఖ్యత కలిగిన సమాజంగా పరిణమించింది.<ref>{{cite web |url=http://www.britannica.com/eb/article-23121 |title=The Yayoi period (c.250 BC – c.AD 250) |publisher=Encyclopædia Britannica |date=2006 | accessdate=2006-12-28}}</ref><ref>{{cite journal |author = [[:en:Jared Diamond]] |title= Japanese Roots | journal = [[:en:Discover Magazine]] Vol. 19 No. 6 |date=June 1998 | url=http://discovermagazine.com/1998/jun/japaneseroots1455}}</ref><ref>{{cite web |url=http://encarta.msn.com/encyclopedia_761568150_4/Pottery.html#p26 |title=Pottery |publisher=MSN Encarta | accessdate=2006-12-28}}</ref><ref>{{cite book |last=De Bary |first=William Theodore |title=Sources of Japanese Tradition |publisher=Columbia University Press |date=2005 |pages=1304 | isbn = 023112984X |url=http://books.google.com/books?vid=ISBN023112984X&id=6wS_ijD6DSgC&pg=RA1-PA1304&lpg=RA1-PA1304&ots=MxkZKlTRlU&dq=%22Chinese+mainland%22+%22Korean+peninsula%22+%22Japanese+archipelago%22&sig=hc4ew2p4cGdppzY6O_b0zWgaB6E#PRA1-PA1304,M1 | accessdate=2007-01-29}}</ref>
 
[[దస్త్రం:Kamakura Budda Daibutsu front 1885.jpg|thumb|150px|left|upright|1252 కాలానికి చెందిన [[బుద్ధ]] విగ్రహం (కోటోకు-ఇన్) - కమాకురా ప్రాంతంలోనిది.]]
చైనాకు చెందిన ''[[:en:Book of Han|హాన్ పుస్తకంలో]]'' మొట్టమొదటిగా జపాన్ యొక్క ''[[:en:Records of Three Kingdoms|మూడు రాజ్యాల గురించి]]'' వ్రాయబడింది. [[బౌద్ధ మతం]] జపాన్‌లోకి కొరియా ప్రాంతంనుండి ప్రవేశించింది. కాని తరువాత జపాన్‌లో బౌద్ధం వ్యాప్తిపైన, బౌద్ధ శిల్ప రీతుల పైన చైనా ప్రభావం అధికంగా ఉంది.<ref>{{cite book |editor=Delmer M. Brown (ed.) |year=1993 |title=The Cambridge History of Japan |publisher=Cambridge University Press |pages=140–149}}</ref> [[:en:Asuka period|అసూక కాలం]] తరువాత పాలక వర్గంనుండి బౌద్ధానికి విశేషంగా ఆదరణ లభింపసాగింది.<ref>{{cite book |title=The Japanese Experience: A Short History of Japan |author=William Gerald Beasley |publisher=University of California Press |year=1999 |url=http://books.google.com/books?vid=ISBN0520225600&id=9AivK7yMICgC&pg=PA42&lpg=PA42&dq=Soga+Buddhism+intitle:History+intitle:of+intitle:Japan&sig=V65JQ4OzTFCopEoFVb8DWh5BD4Q#PPA42,M1 |pages=42 |isbn=0520225600 |accessdate=2007-03-27}}</ref>
 
8వ శతాబ్దంలో "నారా కాలం"లో జపాన్ దేశం కేంద్రీకృతమైన పాలనతో ఒక రాజ్యంగా రూపొందింది. అప్పుడు [[:en:Heijō Palace|హేజో-క్యో]] అనే రాజనగరు (ప్రస్తుతం [[:en:Nara, Nara|నారా]]) అధికార కేంద్రంగా వర్ధిల్లింది. దానికి తోడు చైనా సంస్కృతి, పాలనా విధానాల ప్రభావంతో లిఖిత సాహిత్యం ఆవిర్భవించింది. పురాతన గాధలను, మౌఖిక సాహిత్యాన్ని గ్రంధస్తం చేస్తూ ''[[:en:Kojiki|కోజికి]]'' (712) మరియు ''[[:en:Nihon Shoki|నిహొన్ షోకి]]'' (720) అనే సంకలనాలు కూర్చబడ్డాయి.<ref>{{cite book |author=Conrad Totman |year=2002 |title=A History of Japan |publisher=Blackwell |pages=64–79 | isbn=978-1405123594}}</ref> అంతకు ముందు యమాటో రాజుల అసూక కాలంలో [[:en:Fujiwara-kyō|ఫ్యుజివరా-క్యో]] ఆ దేశపు (యమాటో రాజ్యపు) రాజధానిగా ఉండేది.
 
784లో [[కమ్ము చక్రవర్తి]] రాజధానిని నారా నుండి [[:en:Nagaoka-kyō|నగోకా-క్యో]]కుక్యోకు, తరువాత 794లో [[:en:Heian-kyō|హెయాన్-క్యో]]కుక్యోకు (ప్రస్తుతపు [[క్యోటో]] వగరం) మార్చాడు. తరువాత 1000 సంవత్సరాలపైగా క్యోటోనే దేశపు రాజధానిగా ఉంది.<ref>{{cite book |author=Conrad Totman |year=2002 |title=A History of Japan |publisher=Blackwell |pages=79–87 | isbn=978-1405123594}}</ref> "హెయాన్ కాలం" అనబడే ఈ కాలంలోనే జపాన్ దేశం విలక్షణమైన సంస్కృతిని సంతరించుకొన్నది. జపాను చిత్రకళ, జపాను సంగీతం, జపాను సాహిత్యం అభివృద్ధి చెందాయి. జపాను జాతీయ గీతం ఈ కాలంలోనే వ్రాయబడింది.<ref>{{cite book |author=Conrad Totman |year=2002 |title=A History of Japan |publisher=Blackwell |pages=122–123 | isbn=978-1405123594}}</ref>
 
[[దస్త్రం:RedSealShip.JPG|thumb|200px|ఆసియా దేశాలతో వర్తకానికి వాడబడిన జపాన్ ఓడ - ఎరుపు రంగు చిహ్నంతో (1634)]]
పంక్తి 174:
జపాన్‌లో ఇంతవరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత — 40.9 డిగ్రీలు సెల్సియస్ - [[ఆగస్టు 16]], [[2007]].<ref>{{cite web |url=http://www.japannewsreview.com/society/national/20070816page_id=1553 |title=Gifu Prefecture sees highest temperature ever recorded in Japan - 40.9 |publisher=Japan News Review Society |date=2007-08-16| accessdate=2007-08-16}}</ref> తూర్పు ఆసియా వర్షాకాలంతో మే నెలలో ఒకినావాలో [[వర్షం|వర్షాలు]] మొదలవుతాయి. క్రమంగా ఈ వర్షాలు ఉత్తరానికి విస్తరిస్తాయి. హొక్కయిడో ప్రాంతలో జూలై నెలలో వర్షాలు పడతాయి. హోన్షూ ప్రాంతంలో జూన్ నెలలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. వేసవి చివరికాలంలో టైఫూనులు అధికంగా సంభవిస్తాయి. జపాన్‌లో 9 రకాలైన వివిధ వృక్షజాతుల వనాలున్నాయి.<ref>{{cite web |url=http://www.us.emb-japan.go.jp/jicc/spotflora.htm |title=Flora and Fauna: Diversity and regional uniqueness |publisher=Embassy of Japan in the USA |accessdate=2007-04-01}}</ref>
 
జపాన్‌ దేశం ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తుంది. ముమ్మరమైన పారిశ్రామికీకరణ కారణంగా తీవ్రమైన పర్యావరణ కాలుష్య సమస్యలు ఉత్పన్నం కావడం ఇందుకు ఒక ముఖ్య కారణం. ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా అనేక చట్టాలు చేసింది.<ref>[http://www.erca.go.jp/taiki/history/ko_syousyu.html 日本の大気汚染の歴史], Environmental Restoration and Conservation Agency</ref>. [[:en:Kyoto Protocol|క్యోటో ఒడంబడిక]] భాగస్వామిగా జపాన్ ప్రపంచ పర్యావరణ రక్షణకు, [[గ్లోబల్ వార్మింగ్]] నివారణకు కృషి చేస్తున్నది. [[కార్బన్ డయాక్సైడ్]] విడుదలను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నది.
 
== ఆర్ధిక రంగం ==
పంక్తి 309:
[[దస్త్రం:The Great Wave off Kanagawa.jpg|thumb|left|''[[:en:The Great Wave off Kanagawa|కనగవా మహాతరంగం]]'' - 1832 నాటి చిత్రం.]]
 
జపాన్ సంస్కృతిలో స్థానిక జపనీయ కళ, సంస్కృతలకు తోడు ఆసియా, ఐరోపా, అమెరికాల ప్రభావాలు కూడా ఉన్నాయి. జపాన్ సాఁప్రదాయ కళలలో ముఖ్యమైనవి - హస్త కళలు: [[:en:ikebana|ఇకబానా]], [[:en:origamiఒరిగమి|ఒరిగామి]], [[:en:ukiyo-e|ఉకియో-ఇ]], [[:en:Japanese traditional dolls|జపాను బొమ్మలు]], [[లక్క]]సామగ్రి, [[:en:Japanese pottery and porcelain|పాత్రల తయారీ]]); - ప్రదర్శన కళలు [[:en:bunraku|బున్రకు]], [[:en:Japanese traditional dance|జపాన్ సాంప్రదాయిక నృత్యం]], [[:en:kabuki|కబూకి]], [[:en:noh|నోహ్]], [[:en:rakugo|రకుగో]]) - సాంప్రదాయిక క్రీడలు [[:en:Japanese tea ceremony|జపాన్ తేనీరు ఉత్సవం]], [[:en:Budō|బుడో]], [[:en:Japanese architecture|జపాన్ నిర్మాణ శైలి]], [[:en:Japanese garden|జపాన్ తోటలు]], [[:en:Katana|కత్తి సాములు]], [[:en:Japanese cuisine|వంటలు]]. జపాన్‌లో సంప్రదాయంగా ఉండే [[:en:woodblock printing|చెక్క బొమ్మల ముద్రణ]]తోముద్రణతో పాశ్చాత్య చిత్ర విధానాలు జోడించి చేసిన [[:en:manga|మాంగా]] అనే కామిక్ పుస్తకం జపాన్‌లోనూ, విదేశాలలోనూ కూడా ప్రాచుర్యం పొందింది.<ref>{{cite web |url=http://www.dnp.co.jp/museum/nmp/nmp_i/articles/manga/manga1.html |title= A History of Manga |publisher=NMP International |accessdate=2007-03-27}}</ref> దాని స్ఫూర్తితోనే [[:en:anime|అనిమె]] అనబడే కార్టూను చిత్రాలు రూపొందాయి. 1980 దశకం తరువాత జపనీయుల [[విడియో గేమ్]]‌లు ప్రపంచమంతటా జనప్రియమయ్యాయి.<ref>{{cite web |url=http://uk.gamespot.com/gamespot/features/video/hov/index.html |title= The History of Video Games |author= Leonard Herman, Jer Horwitz, Steve Kent, and Skyler Miller|publisher=[[Gamespot]] |accessdate=2007-04-01}}</ref> జపాన్ సంగీతంలో కోటో వంటి అనేక వాయిద్యాలు ఇతర సంస్కృతులనుండి గ్రహింపబడ్డాయి.
<ref>{{cite web |url=http://uk.gamespot.com/gamespot/features/video/hov/index.html |title= The History of Video Games |author= Leonard Herman, Jer Horwitz, Steve Kent, and Skyler Miller|publisher=[[Gamespot]] |accessdate=2007-04-01}}</ref> జపాన్ సంగీతంలో [[:en:koto (musical instrument)|కోటో]] వంటి అనేక వాయిద్యాలు ఇతర సంస్కృతులనుండి గ్రహింపబడ్డాయి.
 
'''గమనిక : '''జపనీసులో "アニメ (అనిమె) " (ఉచ్ఛారణ: [http://upload.wikimedia.org/wikipedia/commons/7/7e/Anime.ogg ఆనిమే]) ను ఇంగ్లీషులో "అనిమేషన్ లేదా అనిమి" అంటారు. దినికి తెలుగులో పదం లేదు. కాని దీనిని తెలుగులో కూడా "[http://upload.wikimedia.org/wikipedia/commons/7/7e/Anime.ogg అనిమె]" అని పలకవచ్చు, వ్రాయవచ్చు'''. ''' " అనిమె " కార్యాక్రమాలు ఉదాహరణాకు : [http://www.naruto.com/ నారుటొ], [http://www.pokemon.com పొకెమాన్], [http://en.wikipedia.org/wiki/Higurashi_no_Naku_Koro_ni హిగురాషినొ నకు కొరొ ని], బ్లేచ్, డెత్ నోట్, రాన్‌మా 1/2, డ్రాగన్ బాల్ ఝి (జి) మరియు ఇంకా చాలా ఉన్నాయి'''. ఇంకా దినిపై వివరాలు తెలుసుకోవడానికి దయచేసి ఈ వెబ్ సైట్‌లను [ http://www.animenewsnetwork.com/ లేదా http://www.anime.com/ ] చూడండీ' <!-- (़~~़దీనిని పెట్టినవారు కిరణ్. మరె సందెహలు ఉన్న దయచేసి దినికి ఈ-మైయిల్ చెయండి : [kiranukun@gmail.com]~~~~़) -->''
 
[[:en:Karaokeకరావోకే|కారవోకె]] పాటలు జపాన్ దేశీయులలో అత్యంత జనాదరణ పొందాయి. సాంప్రదాయ ఉత్సవాలకంటే ఇదే పైచేయిలో ఉంది.<ref>Kelly, Bill. (1998). "Japan's Empty Orchestras: Echoes of Japanese culture in the performance of karaoke", ''The Worlds of Japanese Popular Culture: Gender, Shifting Boundaries and Global Cultures'', p. 76. Cambridge University Press.</ref>
 
[[దస్త్రం:Sorakuen14st3200.jpg|thumb|250px| ఒక జపానీ ఉద్యానవనం]]
 
జపాన్ సాహిత్యంలో ఆది కాలంలో వెలువడిన రెండు చరిత్ర పుస్తకాలు ''[[:en:Kojiki|కోజికి]]'' మరియు '[[:en:Nihon Shoki|నిహోన్ షోకి]]'' మరియు 8వ శతాబ్దపు కవితారచన ''[[:en:Man'yōshū|మన్ యోషు]]'' అనేవి చైనా భాష లిపిలో వ్రాయబడ్డాయి.<ref>{{cite web |url=http://www.meijigakuin.ac.jp/~ascj/2000/200015.htm |title= Asian Studies Conference, Japan (2000) |publisher=Meiji Gakuin University |accessdate=2007-04-01}}</ref> తరువాత క్రమంగా జపాన్ భాష ప్రత్యేక లిపి అభివృద్ధి చెందింది. [[:en:Murasaki Shikibu|మురసాకీ రచన]]'' అయిన [[:en:The Tale of Genji|గెంజీ కథ]]'' - అనే పుస్తకం ప్రపంచంలో మొట్ట మొదటి [[నవల]] అని చెప్పబడుతుంది.
== మతం ==
క్రీ.శ.5వ శతాబ్దంలో చైనా నాగరికత జపాన్‌కు సోకినా వారి నుంచి మతం మాత్రం ప్రవేశించలేదు. చైనా నుంచి 5వ శతాబ్ది కల్లా కొరియాకు ప్రవేశించిన బౌద్ధమతం కొరియా ద్వారానే జపాన్‌కు చేరింది. క్రీ.శ.580 నాటికి ''ఉమయోదో'' అనే జపాన్ రాజు బౌద్ధాన్ని రాజమతంగా చేశారు. కొరియా భిక్షువులలతో తన ప్రజలకు వైద్యం, జ్యోతిష్యం చెప్పించే ఏర్పాట్లు చేసి దేశస్థులు కొందరు బౌద్ధంలో చేరేలా ప్రోత్సహించారు. బౌద్ధాన్ని గురించి తెలుసుకొమ్మని కొందరు దేశస్థులను రాజు చైనాకు పంపారు. ఆ క్రమంలో కళలు, స్వచ్ఛందసేవ మొదలైనవి కూడా జపాన్‌కు చైనా నుంచి ప్రవేశించాయి. జన్మత: బ్రాహ్మణుడు, భారద్వాజ గోత్రీకుడు అయిన బోధిసేనుడనే బౌద్ధభిక్షువు క్రీ.శ.736లో భారతదేశం నుంచి చిత్రకారులు, గాయకులను తీసుకుని జపాన్ చేరి 30 సంవత్సరాల పాటు బౌద్ధమత ప్రచారం చేశారు. ఆపైన 8వ శతాబ్దంలో సుధాకర సింహ, అమోఘవజ్ర మొదలైనవారు నిర్మించిన మాంత్రికవాదం, అసంగభిక్షుడు సిద్ధాంతీకరించిన ధర్మలక్షణవాదం జపాన్ చేరాయి. అంతేకాక 9వ శతాబ్దంలో జపనీయులే నూతన సిద్ధాంత నిర్మాణాలు చేయడం ప్రారంభించారు. టెండెయ్, షిన్ గన్ అనే బౌద్ధమత శాఖలు ఏర్పడ్డాయి. 12వ శతాబ్దిలో సిద్ధాంతాలు, కర్మావలంబనలు తగ్గి సుఖ ప్రథమైన జీవితాన్ని సమర్థించే సుఖవటి అనే సిద్ధాంతం ప్రబలింది. బౌద్ధానికి పూర్వం అక్కడ ఉన్న మతంలోని పూర్వదేవతలను బుద్ధుని అవతారాలుగా పరిగణించడమూ ప్రారంభమైంది<ref name="భారతీయ నాగరికతా విస్తరణము">{{cite book|last1=రామారావు|first1=మారేమండ|title=భారతీయ నాగరికతా విస్తరణము|date=1947|publisher=వెంకట్రామా అండ్ కో|location=సికిందరాబాద్, వరంగల్|edition=1}}</ref>.
"https://te.wikipedia.org/wiki/జపాన్" నుండి వెలికితీశారు