తెలుగునాట జానపద కళలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో RETF మార్పులు, typos fixed: భాధ్యత → బాధ్యత, → (3) using AWB
+చెక్క భజన లింకు
పంక్తి 13:
 
==కళల్లో రకాలు==
జానపద ప్రదర్శన కళలు రెండు రకాలుగా మనకు కనిపిస్తాయి. సర్వ జానపదకళలు వృత్తి జానపద కళలు అని వీటిని రెండు రకాలుగా విభజించడానికి వీలుంది. తెలుగు జానపద కళలలో ఎక్కువగా ఒక కులం వారు వారికి జీవనోపాధినిచ్చే వృత్తిగా స్వీకరించిన కళాకారులు ప్రదర్శించే కళలే ఎక్కువగా మనకు కనిపిస్తాయి. భారత దేశంలోని చాలా రాష్ట్రాలలో చాలా భాషా ప్రాంతాలలో ఉండే జానపద కళలలో ఎక్కువగా ఉన్నవి వృత్తి జానపదకళలే. తెలుగు జానపదకళలలో ఎక్కువగా ఉన్నవి వృత్తి జానపద కళారూపాలు. ఒగ్గుకథ, పంబకథ, ఆసాదికథ, బైండ్లకథ, కొమ్ములకథ, పాండవకథ, రుంజకథ వంటి కళారూపాలు అన్నీ కూడా ఒక కులం వారికి వృత్తిగా ఉన్న కళారూపాలే. ఇలా కాక వృత్తిగా కాకుండా ఊరి వారిచే వినోదాన్ని అందించే కళారూపాలుగా ఉన్నవి కొన్ని ఉన్నాయి. ఉదాహరణలు కొన్ని ఇక్కడ చూడవచ్చు. కోలాటం, [[చెక్క భజన|చెక్కభజన]], పండరిభజన, సెల్ భజన కొన్ని జానపద నాటక ప్రక్రియలు వృత్తి కళా రూపాలు కావు. ఒక గ్రామం లోని ఏ కులం వారైనా అందరూ కలిసి అనుకొని అన్నింటినీ తయారు చేసుకొని వారి వినోదార్థం వారు ఈ కళా రూపాలను ప్రదర్శించుకుంటారు. ఇందులో ప్రదర్శించే వారు కూడా వారి వినోదార్థమే ప్రదర్శిస్తున్నారు కాని వారికి ఈ ప్రదర్శన ద్వారా ఆదాయం కాని మరేదైనా కాని రావలసిన అవసరం లేదు. ప్రదర్శించడం వారికి వినోదం అలాగే చూడడం చూచే వారికి వినోదం. వీటిని సర్వజానపద కళలు అని పిలవవచ్చు. పై చెప్పినవి వృత్తి జానపద కళలు. అందువల్ల ఇక్కడ సర్వ జానపద కళలు, వృత్తి జానపద కళలు అనే రెండు రకాల వర్గీకరణలు వచ్చాయి.
 
తెలుగు జానపద కళలను మరొక రకంగా విభజించే వీలుంది. ఎవరు ఎవరికి ప్రదర్శిస్తున్నారు అనే విషయాన్ని ఆధారం చేసుకొని ఈ విభజన చేయవచ్చు. వీటినే అనియతాశ్రయ కళారూపాల్ని ఆశ్రిత కళారూపాలు అని రెండు రకాలుగా విడదీయవచ్చు. అనియతాశ్రయ కళారూపాలు అంటే కళాకారులు వారి కళను ఎవరికొసమైనా ప్రదర్శిస్తారని అర్థం. ఉదాహరణకి ఒక పాముల వాడు ఒక గ్రామంలో ప్రవేశిస్తే తన కళను ఆగ్రామంలో ఉన్న అందరికీ ప్రదర్శిస్తాడు. కొన్ని కులాల వారికి ప్రదర్శించవచ్చు కొన్ని కులాల వారికి ప్రదర్శించ కూడదు అనే నిబంధన కాని అడ్డు కాని అతనికి లేదు. అదేవిధంగా ఒక హరిదాసు ఒక గ్రామానికి వెళితే అతను కూడా అన్ని ఇండ్లకు వెళ్లి తన కథని కాని, పాటను కాని ప్రదర్శించి తనకు రావలసిన దాన్ని తను తీసుకుంటాడు. బహురూపుల వారు అంటే పగటివేషగాళ్ళు కూడా ఊరి వారందరికీ తమ కళను ప్రదర్శిస్తారు. తోలు బొమ్మలాట చెక్క బొమ్మలాట వంటి ప్రదర్శన కళలు కూడా అందరికోసం ప్రదర్శించబడతాయి. ఇంకా ఇలాంటి వాటిని మరికొన్నికళారూపాలనూ చెప్పవచ్చు. ఈ కళలను ఆయా కళాకారులు ఊరి వారి అందరి కోసం ప్రదర్శిస్తారు అందువల్ల వీటిని అనియతాశ్రయ జానపపద కళలు అని అనవచ్చు. ఇలా కాకుండా కేవలం ఒక కులంవారికే ప్రదర్శించే జానపద కళారూపాలు కొన్ని ఉన్నాయి. వీటినే ఆశ్రిత జానపద కళలు అనిచెప్పవచ్చు. ఇక్కడ కొన్ని ఉదాహరణలను పరిశీలించవచ్చు. ఒక రుంజకథా గాయకుడు ఉంటే అతను ఒక గ్రామానికి వస్తే అతని కళను ఆ గ్రామం మొత్తానికి ప్రదర్శించే వీలు లేదు. కేవలం అతనికి ప్రత్యేకించి ఉన్న అతని దాతలైన విశ్వకర్మ లేదా విశ్వబ్రాహ్మణ కులం వారైన అయిదు వృత్తుల వారికి మాత్రమే అతని రుంజ కథను ప్రదర్శిస్తాడు. అంతే కాదు అతని కళారూపంలో ప్రధానంగా ప్రదర్శించే కథ విశ్వకర్మ పురాణం ఇంకా ఆ కులానికి చెందిన ఇతర కథలు మాత్రమే. ఆ కథలతో మిగతా కులాల వారికి అవసరం ఉండదు. అందువల్ల అతని కళా ప్రదర్శన అతని దాతృకులమైన విశ్వబ్రాహ్మణులకు మాత్రమే ఉంటుంది. పిచ్చుకుంటి వారి కళా ప్రదర్శన వారి దాతలైన రెడ్లకు మాత్రమే పరిమితమై ఉంటుంది. అంటే అతను కథ చెప్పేది రెడ్డి కులం వారికి మాత్రమే. కాని అతను కథ చెబుతుండగా మిగతా కులం వారు అక్కడ కూర్చో కూడదని వినకూడదని కాదు. కూర్చో వచ్చు. కాని అతని దాతలు మాత్రం రెడ్డి కులం వారే అతనికి వారే మిరాసులు ఇస్తారు. అందువల్ల అతని ఉద్దేశంలో అతను కథ చెప్పేది రెడ్లకు మాత్రమే. కూనపులి వారు సాలె వారికి కథ చెప్తారు. జెట్టివారు గౌండ్లవారికి చెప్తారు. చిందువారు వారి గోసంగి వేషాన్ని మాదిగవారికి మాత్రమే ప్రదర్శిస్తారు. ఇలా కనీసం 60 కులాలవారికి వారి ఆశ్రితులు మాత్రమే వారికి కథను చెప్తున్నారు. ఇలాంటి వారిని ఆశ్రిత గాయకులు అని ఆశ్రిత కళాకారులు అని పిలవవచ్చు. వీరు ప్రదర్శిచే జానపద కళలను ఆశ్రిత కళారూపాలు అని అనవచ్చు. అలాగే వీరు సృష్టించే కథా సాహిత్యాన్ని ఆశ్రిత జానపద సాహిత్యం అని లేదా ఆశ్రిత సాహిత్యం అని కాని అనవచ్చు. అందుకే తెలుగు జానపద కళలను అనియతాశ్రయ ప్రక్రియలు, ఆశ్రితజానపద ప్రక్రియలు అని రెండు రకాలుగా విభజించవచ్చు. తెలుగు జానపద కళలను అన్నింటిని గురించి చెప్పడం ఈ వ్యాసంలో సాధ్యం కాదు. తెలుగు జానపద కళలలో ఉన్న వైవిధ్యాన్ని అంతటినీ కూడా ఇక్కడ వివరించడం కుదరదు. కాని తెలుగు జానపద కళలు ఎంత సుసంపన్నంగా ఉన్నాయో చెప్పడానికి వాటిలో ఉన్న భిన్న భిన్నమైన ప్రదర్శన రీతులను ఇక్కడ వివరిస్తే తెలుగు జానపద కళలకున్న సమగ్ర స్వరూపం బోధపడుతుంది. ఒకే కళాకారుడు ఉండి ఒక సంగీత వాద్యం సహాయంతో కాని లేకుండా కాని కథ చెబుతూ ప్రదర్శించే కళారూపాలు తెలుగువారికి ఉన్నాయి. రుంజకథ, పిట్టలదొర ప్రదర్శన, సంక్రాంతి హరిదాసు, వాలకం వంటివి ఇలాంటి ప్రదర్శనలు. రుంజకథలో కథ ఉంటుంది. పాట ఉంటుంది. ఒకే కళాకారుడు అన్ని పాత్రలు తానై నటించి అభినయిస్తూ కథను ప్రేక్షకులకు ప్రదర్శిస్తాడు. పిట్టల దొర ప్రదర్శనలో కథ ఉండదు. కానీ కళాకారుడు ఒక్కడే అన్నీ తానై ప్రదర్శిస్తాడు. వాలకంలో కథ ఉండదు. కాని రకరకాల పాత్రలను ఒక్కడే చూపించి విషయాన్ని ప్రదర్శించడం ఉంటుంది. ఇలాంటి ఏకవ్యక్తి ప్రదర్శనలు కళారూపాలు, జానపద ప్రదర్శనకళా సంప్రదాయాలలో ఆదిమమైనవి అని చెప్పడానికి వీలుంది. ఇలా ఒక కళాకారుల ప్రదర్శనలే తొలుత ఉండి తర్వాత బహుకళాకారులు ప్రదర్శనలు వచ్చి ఉంటాయని వీటి తీరును చూచి పరిణామ క్రమాన్ని చెప్పడానికి వీలుంది. తెలుగు వారి జానపద ప్రదర్శన కళల సంప్రదాయాలలో ఇలా ఏకవ్యక్తి ప్రదర్శనకళలు ఉండడం చాలా ప్రాచీనతను తెలియజేస్తున్నాయి. దీని తర్వాత ఇద్దరు కళాకారులు ఉండి ప్రదర్శించే కళారూపాలు మనకు ఉన్నాయి. చిందు మాదిగ వారి గోసంగి వేషం కళారూపం ఇటువంటిదే గోసంగి అంటే జాంబవుడు బ్రాహ్మణ పాత్రలు సంవాద రూపంలో కథను చెప్పడం విషయాలను పురాణాంశాలను చర్చించడం ఈ కళారూపంలో కనిపిస్తుంది. దీనితర్వాత ముగ్గురు కళాకారులు ప్రధానంగా ఉండి ఒకడు ప్రధాన కథకుడుగా ఉంటూ ఇద్దరు కళాకారులు వంతలుగా ఉండి కథను అభినయ పూర్వకంగా చేసి ప్రదర్శించే కళారూపాలు మంచి పరివర్ధిత కాలానికి వచ్చిన పరివర్థిత కళారూపాలు. పరిపూర్ణమైన నాటకానికి ఇవి తొలి రూపాలుగా చెప్పడానికి వీలుంది. ఇలాంటి కళారూపాలు తెలుగులో కొల్లలుగా ఉన్నాయి. తెలుగులో ఉన్నన్ని ఇలాంటి కళారూపాలు భారత దేశంలోని ఇతర భాషా ప్రాంతాలలోఉన్నాయే లేదో చెప్పడం కష్టం. ముగ్గురు కళాకారులు ఉండడంలో కథను ప్రదర్శించడంలో చాలా సౌకర్యం ఉంటుంది. సంభాషణలలో ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రను వహించి మాట్లాడతారు. పాటలో కథను చెప్పే సందర్భంలోనూ ఇలా వివిధ పాత్రలను ఆ కళాకారులు వహించి చెప్పడం ఇక్కడ జరుగుతుంది. ప్రేక్షకులకు ఇక్కడ కథ బాగా దృశ్యమానం అవుతుంది. ఏక వ్యక్తి ప్రదర్శనలతో ఆదిమంగా ప్రారంభమైన జానపద ప్రదర్శన కళాసంప్రదాయం ఇక్కడి ప్రదర్శన సంప్రదాయంలో బాగా విస్తృతి పరిణతి చెందినదని చెప్పడానికి వీలుంది. సంపూర్ణమైన నాటకం దిశలో ఇక్కడ కొంత పరిణతమైన రూపం ఏర్పడిందని చెప్పడానికి బాగా ఆస్కారం ఉంది. తెలుగువారి జానపద కళా సంప్రదాయాలలో ఇలాంటి ముగ్గురు వ్యక్తులు ప్రధానంగా ఉండే కళారూపాలు మంచి పరిణతి చెందినవి చాలా కనిపిస్తాయి. వీటికి తొలిగా చెప్పవలసిన కళారూపం శారదకథ. దీన్నే జంగం కథ అని కూడా అంటారు. ఈనాడు ఉన్న బుర్రకథా కళారూపానికి ఇది ఆదిమ రూపం ఆధార రూపం. దీనిలో ఒక ప్రధానకథకుడు ఇద్దరు వంతలు ఉంటారు. కథాగానాన్ని ప్రధానంగా కథకుడే చేసినా కథావిస్తృతి మాత్రం ముగ్గురి ద్వారా జరుగుతుంది. ముగ్గురి మధ్యన జరిగే సంభాషణల రూపంలో కథావ్యాప్తి ఉంటుంది. ఇలాంటి కళారూపాలకు ఉదాహరణలుగా, ఆసాదికథ, [[పిచ్చుకుంటికథ]], [[పాండవులకథ]], [[గొల్లసుద్దులు]], [[ఒగ్గుకథ]], వంటి అనేక కళారూపాలను చెప్పవచ్చు. జానపద ప్రదర్శన కళాసంప్రదాయాలలో మరొక విశిష్ట శైలి తెలుగు వారికి ఉంది. ఇలాంటి ప్రదర్శన సంప్రదాయాలు మరే భాషాప్రాంతాలలో ఉన్నాయో ఇంకా వెదక వలసి ఉంది. ఒక చిత్రిత పటాన్ని ప్రదర్శిస్తూ పైన చెప్పిన ముగ్గురు కళాకారులు కలిసి కథాగాన ప్రదర్శన చేయడం ఇక్కడి ప్రత్యేకత. కళాకారులు చెప్పే కథను ఒక గుడ్డమీద చిత్రిస్తారు. ఈ గుడ్డ నాలుగు ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది. 40 నుండి 50 అడుగుల పొడవులో చుట్ట చుట్టి ఉంటుంది. ఈ చుట్టను సమాంతరంగా ఉన్న రెండు గుంజల పైన అమర్చి పటాన్ని విప్పుతూ ప్రధాన కథకుడు చిత్రించిన బొమ్మలను కర్రతో చూపిస్తూ కథను పాడడం వివరించడం ఇక్కడ ఉన్న ప్రత్యేకత. వేలాడ దీసిన పటానికి ముందు వీరు నిలబడి కథను సంగీత వాద్యాల సహాయంతో ప్రదర్శిస్తారు. కథకుడు వంతలు సంగీత వాద్యాలు పైన చెప్పిన శారదకథ వంటి కళారూపాలలో ఉన్నట్టు ఉన్నా పట ప్రదర్శన ఇక్కడి కళాప్రదర్శనలో ప్రత్యేకత. ఇలాంటి కళారూపాలు తెలుగు వారికి చాలా ఉన్నాయి. చాకలి పటం కథ, గౌడజెట్టి పటం కథ, డక్కలి పటం కథ, కూనపులి పటం కథ ఇందుకు మంచి ఉదాహరణలు గొల్లలకు కథలు చెప్పే తెరచీరలవారు అనే కళాకారులు కూడా చిత్రిత పటాన్ని ఆధారంగా చేసుకొనే కథలు చెబుతారు. కాని వీరి పటం శైలి మరికొంత భిన్నంగా ఉంటుంది. మందెచ్చు వాళ్ళు అనే గొల్లలకు ఆశ్రితులైన వారిలో కూడా మరింత భిన్నమైన కళారూపం ఉంది. వారు కథలోని పాత్రలను కొన్ని బొమ్మలుగాచేసి వాటిని ముందు పెట్టి ప్రదర్శిస్తూ కథను చెబుతారు. కళాప్రదర్శన పరిణామ క్రమంలో తోలు బొమ్మలాటకు ఈ పటం కథలను తొలి రూపాలుగా చెప్పడానికి వీలుంది.