క్షణం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

లింకులు
పంక్తి 22:
 
== కథ ==
రిషి (అడివి శేష్) అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో పనిచేసే ఒక ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్. తన స్నేహితుడు ఏర్పాటు చేసిన ఒక అమ్మాయితో ప్రేమగా ఉండలేక ఇక నుంచి అలాంటి సంబంధాల నుంచి దూరంగా ఉండాలనుకుంటాడు. ఒకసారి భారత్ లోని తన మాజీ ప్రేయసి శ్వేత (అదా శర్మ) నుండి అతన్ని ఉన్న పళంగా అక్కడికి రమ్మని ఫోను వస్తుంది కానీ తన సమస్య ఏంటో చెప్పదు. రిషి తన స్నేహితులకు వేరే ఏదో కారణం చెప్పి వెంటనే ఇండియాకు బయలుదేరుతాడు. దారిలో తనకు శ్వేతకు మధ్య జరిగిన ప్రేమ కథను, అది ఆమె తండ్రి వల్ల ఎలా చెడిపోయిందో గుర్తు తెచ్చుకుంటాడు.
 
రిషి హైదరాబాదులో ఓ హోటల్ లో దిగి కారును అద్దెకిచ్చే బాబూ ఖాన్ (వెన్నెల కిషోర్) దగ్గర నుంచి ఒక కారు అద్దెకు తీసుకుంటాడు. శ్వేతను కలిస్తే ఆమె తన కూతురు బడికి వెళుతుండగా ఎవరో అపహరించారనీ, తనకు పోలీసుల నుండి గానీ, పాఠశాల యాజమాన్యం నుండి గానీ ఎలాంటి సహాయం అందడం లేదనీ, కాబట్టి రిషిని తనకు సహాయం చేయమని అడుగుతుంది. ఆమె భర్త కార్తీక్ (సత్యదేవ్ కంచరన) అసలు ఏమీ పట్టించుకోకుండా తన పనిలో మునిగిపోయి ఉంటాడు. పోలీస్ స్టేషన్లో కేసుఫైలును చూస్తే సరైన సమాచారం లేక కేసును మూసేశారని తెలుస్తుంది. పాఠశాలకు వెళ్ళినా అదే పరిస్థితి ఎదురవుతుంది.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/క్షణం_(సినిమా)" నుండి వెలికితీశారు