కాలాపానీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
కాలాపానీ జైలులో బంధించబడీన వందలమంది ఖైదీలు అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేని దుర్భర జీవితం గడుపుతుంటారు. వారిలో పేరు పొందిన స్వాతంత్ర సమరయోధులు కూడా ఉంటారు. డేవిడ్ బెర్రీ (అలెక్స్ వోల్ఫ్) ఐరిష్ జాతికి చెందిన ఒక కిరాతమైన జైలరు. లెన్ హట్టన్ (జాన్ కోల్వెంబాచ్) ఉదార హృదయుడైన ఓ వైద్యుడు. ప్రముఖ దేశభక్తుడు వీర సావర్కార్ ని కూడా అదే జైలులో బంధించి చిత్ర హింసలు పెడుతుంటారు. కానీ ఆయన మాత్రం బంధీలను ఉత్తేజపరచడానికి తనవంతు కృషి చేస్తుంటాడు. డాక్టర్ లెన్ చర్యల వల్ల అక్కడి ఖైదీలు ఎదుర్కొంటున్న హింస ప్రభుత్వానికి తెలిసి విచారణకు ఆదేశిస్తుంది. 14 మందిని విడుదల చేస్తున్నట్లుగా ఉత్తర్వులు పంపిస్తుంది. వారిలో ఒకడు ముకుందన్ (ప్రభు). డేవిడ్ బెర్రీ, మరియు జైలు వార్డెన్ మీర్జా ఖాన్ (అమ్రిష్ పురి) తో కలిసి విడుదల చేసిన ఖైదీలకు విషయం చెప్పకుండా వారిని పారిపోమని చెప్పి 13 మందిని కాల్చి చంపేస్తారు. ముకుందన్ మాత్రం పారిపోవడానికి సిద్ధంగా ఉండడు. అతన్ని చీఫ్ కమీషనర్ రమ్మంటున్నాడనే నెపంతో బలవంతంగా బయటకు తీసుకువచ్చి కాల్చేస్తారు. అతను గోవర్ధన్ కు స్నేహితుడు. స్నేహితుడి శవాన్ని చూసి ఉండబట్టలేని గోవర్ధన్ డేవిడ్ ను ఓ టవర్ పై నుంచి కిందికి తోసేస్తాడు. మీర్జా ఖాన్ ను గొంతు నులిమి చంపేస్తాడు. చివర్లో గోవర్ధన్ ను ఉరి తీస్తారు.
 
==తారాగణం==
* గోవర్ధన్ మేనన్ గా మోహన్ లాల్
* ముకుంద అయ్యంగార్ గా ప్రభు
* పార్వతిగా టబు
* మీర్జా ఖాన్ గా అమ్రిష్ పురి
* జి. ఎస్. సేతు గా వినీత్
* డేవిడ్ బెర్రీ గా అలెక్స్ వోల్ఫ్
* లెన్ హట్టన్ గా జాన్ కోల్వెంబాచ్
* వీర్ సావర్కార్ గా అను కపూర్
* శ్రీకండన్ నాయర్ గా నెడుముడి వేణు
* పాండియన్ గా ఢిల్లీ గణేష్
* మూసా గా శ్రీనివాసన్
* అహ్మద్ కుట్టి గా కొచ్చిన్ హనీఫా
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కాలాపానీ" నుండి వెలికితీశారు