"నందలూరు" కూర్పుల మధ్య తేడాలు

1 byte removed ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
|mandal_map=Cuddapah mandals outline40.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నందలూరు|villages=21|area_total=|population_total=38280|population_male=19113|population_female=19167|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=64.84|literacy_male=77.03|literacy_female=52.72}}
'''నందలూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలము.
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> కడప - [[తిరుపతి]] మార్గంలో కడప నుంచి 40 కి.మీ. దూరంలో నందలూరు [[చెయ్యేరు|చెయ్యేటి]] (బాహుదానది)కి ఎడమ గట్టున ఉంది. నందలూరులో సౌమ్యనాథ స్వామి ఆలయం విశాలమైనది. సౌమ్యనాథుని నారదముని ప్రతిష్ఠించాడంటారు. 11వ శతాబ్దంలో [[కుళోత్తుంగ చోళుడుకుళోత్తుంగచోళుడు]] ఆలయాన్ని నిర్మించాడు. 12వ శతాబ్దంలో [[కాకతీయ]] [[ప్రతాపరుద్రుడు]] ఈ ఆలయానికి గాలిగోపురం కట్టించాడు. ఇంకా ఈ ఆలయాన్ని [[పాండ్యులు]], [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర రాజులు]], [[పొత్తపి]] పాలకులు, [[మట్లి]] రాజులు అభివృద్ధి చేశారు. సౌమ్యనాథాలయం 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ ఆలయానికి 108 స్తంభాలున్నాయి.
 
ఈ ఆలయ ప్రాంగణంలో యోగ నరసింహ, ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు ఉన్నారు. ఆలయం గోడల మీద మత్స్య, సింహ చిహ్నాలున్నాయి. గర్భగుడి ముందు ఆలయం కప్పు పై చేప బొమ్మ ఉంది. జలప్రళయం వచ్చి నీరు చేపను తాకినప్పుడు చేప సజీవమై నీటిలో కలిసిపోతుందట. ఆలయ నిర్మాణానికి ఎర్రరాతిని ఉపయోగించారు. ఈ సౌమ్యనాథుని చొక్కనాథుడు అంటారు. ఆదికవి [[నన్నయ్య|నన్నయ]] ఈ సౌమ్యనాథుని దర్శించి సేవించాడు. నందలూరుకు 5 కి.మీ. దూరాన [[తాళ్ళపాక]] ఉంది. తాళ్ళపాక [[అన్నమయ్య|అన్నమాచార్యులు]] కూడా చొక్కనాథుడిని సేవించాడు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2028462" నుండి వెలికితీశారు