"పరవస్తు చిన్నయ సూరి" కూర్పుల మధ్య తేడాలు

చి
 
== బాల్యం ==
చిన్నయ సూరి [[తమిళనాడు]]లోని [[చెంగల్‌పట్టు]] జిల్లాలోని [[పెరంబుదూరు]]లో జన్మించాడు. వారిది [[సాతాని వైష్ణవులు/సాతాని]] శ్రీవైష్ణవుల కుటుంబం. ఆయన తల్లిదండ్రులు శ్రీనివాసాంబ, వేంకటరంగయ్య. జన్మనామం చిన్నయ. చిన్నయ చాలా తరాలకు పూర్వం ఉత్తర [[ఆంధ్రప్రదేశ్]] నుండి [[మద్రాసు]] వలసవెళ్ళిన వైష్ణవ కుటుంబములో జన్మించాడు. వీరి పూర్వీకులు పరవస్తు మఠం శిష్యులు. వీరు [[సాతాని వైష్ణవులు/సాతాని]] కులానికి చెందినా బ్రాహ్మణ ఆచారవ్యవహారాలు పాటించేవారు. తాము ఆపస్తంబ సూత్రానికి, గార్గేయ గోత్రానికి చెందిన యజుశ్శాఖాధ్యాయులమని చెప్పుకున్నారు. చిన్నయ [[1809]] (ప్రభవ)లో జన్మించాడు. కానీ కొందరు పండితులు ఈయన [[1806]]లో జన్మించాడని భావిస్తున్నారు.
 
చిన్నయ తండ్రి వెంకటరంగ రామానుజాచార్యులు తిరువల్లిక్కేని (ట్రిప్లికేన్) లోని రామానుజమఠంలో మతాధికారి. చిన్నయ తండ్రి సంస్కృత, ప్రాకృత, తెలుగు మరియు తమిళాలలో మంచి పండితుడు. అక్కడే ఈయన్ను ప్రతివాదభయంకరం శ్రీనివాసాచార్యులనే వైష్ణవ పండితుడు చూసి రామానుజాచార్యుల జన్మస్థానమైన [[శ్రీపెరంబుదూరు]]లోని ఆలయంలో వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేసేందుకు ఆహ్వానించాడు. పండు ముదుసలి వయసు వరకు ద్రవిడవేదాన్ని పారాయణం చేస్తూ, మతాధికారిగా కార్యాలు నిర్వహిస్తూ ఇక్కడే నివసించాడు. ఈయన [[1836]]లో నూటపదేళ్ళ వయసులో మరణించాడు.
7,316

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2028500" నుండి వెలికితీశారు