సదా మీ సేవలో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
== కథ ==
తిలక్ ([[తొట్టెంపూడి వేణు|వేణు]]) తన స్నేహితులైన ఓ లాయర్ ([[సునీల్ (నటుడు)|సునీల్]]), మరియు ఓ మాజీ పోలీసు ([[పీలా కాశీ మల్లికార్జునరావు|మల్లికార్జున రావు]]) లతో కలిసి న్యాయపరమైన సమస్యలను తీర్చడానికి ''సదా మీసేవలో'' అనే ఒక కన్సల్టింగ్ సంస్థను నడుపుతుంటాడు. తిలక్ మానసిక శాస్త్రంలో నిపుణుడు. మైండ్ గేం ఆడి తన తెలివి తేటలతో కోర్టు బయటే సమస్యలను పరిష్కరించడం ద్వారా ఇతరులకు సహాయపడుతుంటాడు. అసహాయ పరిస్థితుల్లో ఉన్న జనాలకు సహాయం చేయడానికి ఎలాంటి ట్రిక్కులు ప్లే చేసినా పరవాలేదని అతని అభిప్రాయం. తిలక్ సూర్యకాంతం ([[శ్రియా సరన్|శ్రీయ]]) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కూడా ఇతన్ని ప్రేమిస్తుంది. ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా వాళ్ళను ఎదిరించి అతన్ని పెళ్ళి చేసుకుంటుంది. కానీ పెళ్ళైన తరువాత తిలక్ న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నాడనీ, రౌడీల నుంచి గూండాల నుంచి అతని ప్రాణాలకు ముప్పు ఉందని తెలుస్తుంది. అతను పరులకు సహాయం చేసి తన నెత్తిమీదకు తెచ్చుకోవడం ఆమెకు నచ్చదు. ''సదా మీ సేవలో'' మూసేయమని భర్తతో పోరాడుతుంది. ఇంతలో తిలక్ విరోధులు కొంతమంది ఆమెను అపహరిస్తారు. తిలక్ ఆమెను ఎలా కాపాడుకున్నాడో, వ్యక్తిగత స్వార్థం కంటే ఇతరులకు సాయపడటం ఎంత మంచిదో ఆమెకు తెలియజెప్పడం మిగతా కథ.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/సదా_మీ_సేవలో" నుండి వెలికితీశారు