భారత అత్యవసర స్థితి: కూర్పుల మధ్య తేడాలు

+భట్రాజు పొగడ్తలు లింకు
పంక్తి 12:
ఆమె ప్రభుత్వం 1969లో బ్యాంకుల జాతీయీకరణ, 1970లో రాజభరణాల రద్దు వంటి వామపక్ష అనుకూల, ప్రజారంజకమైన కార్యకలాపాలు చేపట్టడంతో ప్రజల్లో ఆమె పలుకుబడి పెరిగింది. ఆ పలుకుబడి వల్ల ఇందిరకు తన మాట చెల్లించుకోగల సామర్థ్యం వచ్చింది. ఈ కార్యకలాపాలు కూడా హఠాత్తుగా ఆర్డినెన్సుల ద్వారా చేపట్టి తన ప్రత్యర్థులను షాక్ కి గురిచేసేవారామె. సిండికేట్ మరియు ఇతర ప్రత్యర్థుల ఇమేజికి భిన్నంగా, ఇందిరను "ఆర్థికరంగంలో సోషలిజం, మతపరంగా లౌకికత్వం, పేదల పక్షపాతంతో మొత్తానికి దేశాభివృద్ధికి అనుకూలురాలిగా" భావించేవారు.<ref name="Guha, p. 439">Guha, p. 439</ref>
 
1971 సాధారణ ఎన్నికల్లో, ప్రజలను ఇందిరా గాంధీ ఇచ్చిన ''గరీబీ హఠావో!'' (పేదిరక నిర్మూలన) అన్న నినాదం ఉత్తేజపరిచింది. ఆ ఎన్నికల్లో ఆమెకు 518 లోక్ సభ స్థానాలకు 352 భారీ ఆధిక్యత లభించింది. చరిత్రకారుడు రామచంద్ర గుహ అనంతరకాలంలో రాసినట్టు "ఆ భారీ విజయంతో కాంగ్రెస్ (ఆర్) తన ఉనికిని గుర్తుచేసే (ఆర్) అన్న ప్రత్యయం అవసరం లేకుండా నిజమైన కాంగ్రెస్ గా పేరొందింది".<ref name="Guha, p. 439"/> డిసెంబర్ 1971లో, ఆమె యుద్ధ నాయకత్వంలో భారతదేశం బంగ్లాదేశ్ విమోచనాన్ని విజయవంతంగా నిర్వహించింది. తన ఆగర్భ శత్రువైన పాకిస్తాన్ ను యుద్ధంలో ఓడించి, అప్పటివరకూ తూర్పు పాకిస్తాన్ గా ఉన్న ప్రాంతాన్ని బంగ్లాదేశ్ అన్న నూతన దేశంగా ఏర్పరచడంలో భారత దేశం, అందునా ప్రధాని ఇందిర, ముఖ్య పాత్ర వహించారు. తర్వాతి నెలలో [[భారతరత్న]] పురస్కారం అందుకుని తన జీవితంలో అత్యున్నత శిఖరం అనదగ్గ కాలాన్ని అనుభవించారు. ఆమె జీవితచరిత్రకారుడు ఇందర్ మల్హోత్రా ప్రకారం అప్పటికి "ద ఎకనమిస్ట్ అభివర్ణించినట్టుగా భారత సామ్రాజ్ఞి అన్న పదం సరిపోయిందన్నట్టుగా తోచింది". లోక్ సభలో ఆమెను సాధారణంగా నియంతలా వ్యవహరిస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని గురించి [[భట్రాజు పొగడ్తలు]] ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించే ప్రతిపక్ష నేతలే ఆమెను దుర్గ, చండి అంటూ ప్రశంసించారు. <ref>Malhotra, p. 141</ref><ref>{{cite book|last1=Derichs,|first1=Claudia (Editor)|last2=Thompson|first2=Mark R. (Editor)|last3=Hellmann-Rajanayagam|first3=Dagmar|title=Dynasties and Female Political Leaders in Asia: Gender, Power and Pedigree Chapter THE PIONEERS: DURGA AMMA, THE ONLY MAN IN THE CABINET|date=2013|isbn=978-3-643-90320-4|url=https://books.google.com/books?hl=en&lr=&id=UKBcLhCxSvQC&oi=fnd&pg=PA27&dq=vajpai+durga+indira+gandhi+&ots=ix3WNNoY55&sig=yJ_-UgVyiA_5Qo3Sw19_rLvULBM#v=onepage&q=vajpai%20durga%20indira%20gandhi&f=false|accessdate=20 October 2015}}</ref><ref>{{cite journal|last1=Puri|first1=Balraj|title=Indian Muslims since Partition,|journal=Economic and Political Weekly|date=1993|volume=28|issue=40|pages=2141–2149|url=http://www.jstor.org/stable/4400229|accessdate=20 October 2015}}</ref> ఇందిరను దుర్గగా వాజపేయి అభివర్ణించారని ప్రతీతి, కానీ ఆయన ఒక ఇంటర్వ్యూలో కాదని చెప్పారు<ref>{{cite web |url=https://www.youtube.com/watch?v=ofxZKeH8BGM |title=Did Atal bihari Vajpayee call Indira Gandhi 'Durga' ? |last=Jain |first=Atishay |publisher=You Tube |date=26 September 2015 |website=You Tube |access-date=23 March 2016}}</ref>
=== న్యాయవ్యవస్థపై ప్రభుత్వం నియంత్రణ ===
ప్రఖ్యాత ''గోలక్ నాథ్'' కేసులో [[సుప్రీం కోర్టు|భారత అత్యున్నత న్యాయస్థానం]] మౌలికాంశాలైన ప్రాథమిక హక్కులు వంటివాటిని ప్రభావితం చేస్తూన్నప్పుడు [[భారత రాజ్యాంగం|రాజ్యాంగాన్ని]] పార్లమెంటు సవరించకూడదని వ్యాఖ్యానించింది. ఈ తీర్పును రద్దుచేస్తూ ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ ఆధిక్యతలో ఉన్న పార్లమెంట్ 1971లో ప్రాథమిక హక్కులను ప్రభావితం చేసేలాంటి రాజ్యాంగ సవరణలు కూడా చేయొచ్చన్న 24వ సవరణ ఆమోదించింది. పూర్వపు రాజులు, జమీందార్లకు ఇచ్చిన రాజాభరణాలు రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకమైన తీర్పునిస్తే 26వ సవరణ తీసుకువచ్చారు. దానిలో భాగంగా సుప్రీంకోర్టు తీర్పును రద్దుచేసే విధంగా రాజభరణాల రద్దును రాజ్యాంగబద్ధం చేశారు. ఈ న్యాయవ్యవస్థ-శాసనవ్యవస్థల నడుమ యుద్ధం చారిత్రాత్మక ''కేశవానంద భారతి'' కేసు వరకూ కొనసాగింది. ఈ కేసు తీర్పులో 24వ సవరణ ప్రశ్నించబడింది. అతికొద్ది 7-6 ఆధిక్యతతో, సుప్రీంకోర్టు ధర్మాసనం పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరణ చేసే హక్కును నియత్రిస్తూ రాజ్యంగ మౌలిక నిర్మాణాన్ని మార్చేందుకు వినియోగించరాదని తీర్పునిచ్చింది. తదనంతరం కేశవానంద భారతి కేసులో తీర్పుని వ్యతిరేకించిన మైనారిటీలోకెల్లా సీనియర్ అయిన ఎ.ఎన్.రే ని భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రధాని ఇందిర నియమించారు. ఈ నియామకంలో తీర్పుకు అనుకూలమైన మెజారిటీలోని ముగ్గురు సీనియర్ జడ్జిలు - జె.ఎం.షెలాత్, కె.ఎస్.హెడ్గే, గ్రోవర్ లను అధిగమించి రేని పదవి వరించింది. స్వతంత్రంగా ఉండాల్సిన న్యాయవ్యవస్థను ఇందిర నియంత్రించే ప్రయత్నాలు చేయడాన్ని అటు పత్రికలు, ఇటు [[లోక్ నాయక్ జయప్రకాశ్‌ నారాయణ్‌|జయప్రకాశ్ నారాయణ్]] వంటి ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.