బోయ జంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
 
==రచయితగా==
బోయ జంగయ్య యాభై సంవత్సరాలుగా నిరంతరం సాహిత్య కృషి చేస్తున్నాడు చేశాడు. ఆయన ఎన్ని ప్రక్రియల్లో రచనలు చేసినా అతని ప్రతిభ కథలు వ్రాయటంలో నవలలు రచించటంలో ఎక్కువగా ప్రకాశించిందని చెప్పాలి. ఆయన వ్రాసిన కథలు మానవతా వాదాన్ని చిత్రిస్తున్నాయి. దళిత వాదాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఆయన రచించిన నవలల్లోనూ దళితవాద దృక్కోణం చోటు చేసుకున్నది. దళితవాదంలో కవిత్వం వచ్చినంత బలంగా వచన రచనలు రాలేదని చెప్పాలె. కాని తెలంగాణ నుంచి మాత్రం దళిత వాదాన్ని చిత్రిస్తూ కథలు, నవలలు వంటి వచన ప్రక్రియల్లో రచనలు చాలా వచ్చాయి. అటువంటి వచన ప్రక్రియల్లో రచనలు చేసిన ప్రముఖ రచయిత, సీనియర్‌ రచయిత బోయ జంగయ్యనే. పద్యం, కవిత్వం వ్రాయటం సులభం కాని వచనం వ్రాయటం కఠినం. అందులో చక్కని సమగ్రమైన అర్ధవంతమైన విషయావగాహన కలిగించే వచనం వ్రాయటం అంతగా సులభమైన పనికాదు. కాని బోయ జంగయ్య కథల్లోగాని నవలల్లోగాని వచన రచన సమగ్రంగా వుంటుంది. చక్కని శైలిలో ఆయన వచన రచన చేశాడు.
 
డా బోయ జంగయ్య బాలల కోసం అనేక పుస్తకాలు ప్రచురించారు. పిల్లల కోసం కథలు, గేయాలు, కవితలు, నాటికలు రాశారు. 2006లో వీరు ప్రచురించిన ‘మన వడు చెప్పిన కథలు’ మంచి గుర్తింపు పొందిం ది. 1999లో ‘గుజ్జనగూళ్ళు’ అదే సంవత్స రం పిల్లల కోసం ‘ఆటలు-పాటలు’ పుస్తకాలు ప్రచురితమయ్యాయి. 2002లో ‘మాటల ఆటలు’, 2003లో ‘చిలకల పలుకులు’, 2004లో ‘మన నేతలు’, అదే సంవత్సరం ‘టీవీ ముచ్చట్లు’, 2005లో ‘మనం మారాలి’ పుస్తకాలు ప్రత్యేకంగా పిల్లల కోసం రాసినవే. ఈ పుస్తకాలన్నీ డా బోయజంగయ్యను బాల సాహితీశిల్పిగా నిలబెట్టాయి. జంగయ్యగారిని సాహితీప్రియులు, సన్నిహితులు ముద్దుగా ‘బోజ’ అని పిలుచుకుంటారు.
"https://te.wikipedia.org/wiki/బోయ_జంగయ్య" నుండి వెలికితీశారు