కండరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[Image:Illu muscle tissues.jpg|thumb|350px|కండరాలలో రకాలు]]
కండరాలు (Muscles) [[శక్తి]]ని ఉపయోగించి [[చలనము]] కలిగిస్తాయి. ఈ చలనము బహిర్గతం కాని అంతర్గతంగా కాని ఉంటుంది. కండరాలలో మూడు రకాలున్నాయి. వీటిలోని [[గుండె]], [[ప్రేగు]] కండరాల సంకోచ వ్యాకోచాలు మనిషి మనుగడకు అత్యవసరం. మనిషి శరీర చలనానికి [[సంకల్పిత కండరాలు]] ముఖ్యం. మనశరీరంలో ఇంచుమించు 639 కండరాలున్నట్లు ఒక అంచనా. గుండె, ప్రేగుల కండరాలు [[అసంకల్పిత కండారాలు]] అనగా వీటి కదలిక మనకు తెలియకుండానే జరిగిపోతుంది.
 
===ముఖ్య లక్షణాలు===
* క్ష్యోభ్యత (Irritability) : కండారాలు ఉద్దీపనలను గ్రహించి వాటికి అనుగుణంగా అనుక్రియను జరుపుతాయి.
* సంకోచత్వం (Contractility) : కండరాలు ప్రేరేపణలు, వాటి బలాలను బట్టి సంకోచిస్తాయి.
* వహనం (Conduction) : కండరంలో ఒకచోట గ్రహించబడిన ఉద్దీపనాన్ని కండరమంతా ప్రసారం చేస్తాయి.
* స్థితిస్థాపకత (Elasticity) : కండరం సంకోచం లేదా సడలిక చెందిన తరువాత తిరిగి తన మామూలు స్థితికి చేరుకుంటుంది.
 
 
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
 
{{మానవశరీరభాగాలు}}
 
"https://te.wikipedia.org/wiki/కండరం" నుండి వెలికితీశారు