"2005 మహారాష్ట్ర వరదలు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{Underlinked|date=అక్టోబరు 2016}}
2005 లో [[మహారాష్ట్ర]]లో సంభవించిన వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. భారత పశ్చిమ తీరాన అరేబియన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న [[ముంబై]] నగరం, మరియు ఇతర ప్రాంతాలు జలమయ్యాయి. దాదాపు 1,094 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. జూన్ 2005 లో [[గుజరాత్]] లో సంభవించిన రెండు నెలలకే ఇక్కడ కూడా వరదలు రావడం గమనార్హం. ఇప్పటికీ చాలామందికి [[జులై 26]] అనగానే ముంబై నగరం జల దిగ్భందంలో చిక్కుకున్న రోజే గుర్తుకు వస్తుంది.
 
చాలామంది ప్రజలు రోడ్లలోనే చిక్కుకు పోయారు. పలువురు తమ ఇళ్ళు కోల్పోయారు. కార్యాలయాల్లో పనిచేసే చాలామంది చాలాదూరం నడుచుకుంటూనే తమ ఇళ్ళు చేరుకున్నారు. జులై 26 2005 న ఒక్క రోజులోనే 944 మి.మీ (37.17 అంగుళాలు) వర్షపాతం నమోదయింది. ఒక్క రోజులనే నమోదయిన వర్షపాతాలలో ఇది ఎనిమిదో అత్యధికం. కేవలం ఉదయం 8 గంటలనుండి రాత్రి 8 గంటల వ్యవధిలో 644మి.మీ (25.35 అంగుళాలు) వర్షం పడింది. ఇదే వర్షం మరుసటి వారం కూడా కొనసాగింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2031859" నుండి వెలికితీశారు