జయలలిత: కూర్పుల మధ్య తేడాలు

అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 42:
| party_position = General Secretary
}}
'''జయలలిత''' (జ.[[ఫిబ్రవరి 24]], [[1948]]-- మ.[[డిసెంబరు 5]], [[2016]]) ప్రముఖ రాజకీయనాయకురాలు మరియు [[తమిళనాడు]] రాష్ట్రానికి మే 2015 నుంచి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నది. అంతకు మునుపు 1991 నుంచి 1996, 2001 లో కొంతకాలం, 2002 నుంచి 2006 దాకా కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది. రాజకీయాలలోకి రాకమునుపు [[తమిళం]], [[తెలుగు]], [[కన్నడ]] భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించింది. 1961 నుంచి1980 వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ రీతుల చిత్రాలలో, వైవిధ్యభరితమైన పాత్రలలో నటించింది. నాట్యంలో కూడా ఆమెది అందె వేసినచేయి. ఒకరకంగా తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొద్దికాలం పాటు ఏలింది.<ref>http://www.dailymirror.lk/25952/tamil-nadu-chief-minister-jayalalithaa-on-the-warpath-against-sri-lanka-again</ref> తమిళనాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన [[ఆల్ ఇండియా అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగం]] యొక్క సాధారణ కార్యదర్శి. ఆమె అభిమానులు ఆమెను ''పురట్చి తలైవి'' (విప్లవ నాయకురాలు) అని పిలుచుకుంటా ఉంటారు.
 
ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. ఎం.జీ.ఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. జానకి రామచంద్రన్ తరువాత ఆమె తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి.
"https://te.wikipedia.org/wiki/జయలలిత" నుండి వెలికితీశారు