"దాగుడు మూతలు (1964 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

చి (→‎చిత్రకథ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధృడ → దృఢ using AWB)
 
== చిత్రకథ ==
ఒక శ్రీమంతుడి (గుమ్మడి) కుమారుడు తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకుంటాడు. ఐతే, శ్రీమంతుని కుమారుడు, కోడలు మరణిస్తారు. మనసు మారిన శ్రీమంతడి మనవడి కోసం పరితపస్తూ ఉంటాడు. వారసుడు రాడని దృఢనిశ్చయంతో ఉన్న శ్రీమంతుని దూరపు బంధువులు (రమణారెడ్డి, సావిత్రిసూర్యకాంతం) ఆస్తి కోసం గోతి కాడ నక్కల్లా కాసుక్కూర్చొంటారు. ఆబంధువులలో ఒకనికి కుమార్తె (శారద). ఒకామెకు కుమారుడు (పద్మనాభం). ఆ కుమారుని ఆ ధనవంతుడికి దత్తత ఇచ్చి ఆస్తంతా చుట్టేయాలని చూస్తారు.
ఆ శ్రీమంతుడి ఫాక్టరీ ఎదురుగా ఒక క్యాంటీన్ నడుపూతూ ఉంటాడు ఒక యువకుడు (ఎన్.టి.రామారావు). మానవత్వమున్న అతడు, అనాథలను ఆశ్రయిస్తాడు. ఒక యువతి (బి.సరోజా దేవి) ఇష్టంలేని పెళ్ళి తప్పించుకోడానికి అచ్చటకు వస్తుంది. ఆమెకు ఆ యువకుడు ఆశ్రయమిస్తాడు.
శ్రీమంతుడు వారసుడు ఆ క్యాంటీన్ ఓనర్ అని తెలుస్తుంది. అతని దశ మారిపోతుంది.బంధువుల నోట్లో వెలక్కాయ పడుతుంది. ఐతే, బంధువు కుమార్తె (శారద)ను యువకునికి (ఎన్.టి.ఆర్)కి ఇచ్చి పెళ్ళి చేసి ఆస్తి స్వంతం చేసుకోవాలని చూడడంతో వాళ్లతో విభేదాలు మొదలవుతాయి.యువకునితో పాటు యవతి కూడా శ్రీమంతుని ఇంటికి చేరుతుంది. ఈ లోగా శ్రీమంతుడు మరణిస్తాడు. ఆబంధువుల సంతానం (పద్మనాభం, శారద) పరస్పరం ప్రేమించుకుంటారు. యువకుడు ఆశ్రయమిచ్చిన యవతిని వదలాడానికి అంగీకరించడు. దానితో ఆ యువకునికి పిచ్చి పట్టిందని పిచ్చి ఆసుపత్రిలో చేరుస్తారు. బంధువుల డబ్బు పిచ్చి వదిలించి వాళ్ల ఆట కట్టిస్తాడా యువకుడు.
10,679

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2033600" నుండి వెలికితీశారు