ద్వీప వక్రతలు: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ ద్వీప వక్ర్రతలు ను ద్వీప వక్రతలు కు తరలించారు: సరైన పేరు
పంక్తి 33:
 
ఒఖొటోస్క్ సముద్రపు పలక (Okhotsk Plate) లోనికి పసిఫిక్ సముద్ర పలక వేగంగా చొచ్చుకొనిపోయినప్పుడు కురిల్ ద్వీప వక్రతలు ఏర్పడ్డాయి. కంచట్కా ద్వీపకల్పం (రష్యా) నుండి హోక్కైడో దీవి (జపాన్) వరకూ 1300 కి.మీ. పొడుగునా 50 పైగా దీవులతో ఒక వక్రం ఆకారంలో ఏర్పడినవే ఈ కురిల్ దీవులు. ఈ దీవులకు సమాంతరంగా, సముద్ర మట్టం నుండి 10,542 మీటర్ల లోతులో 'కురిల్-కంచట్కా ట్రెంచ్' ఏర్పడింది.
 
ఉత్తర అమెరికా పలక క్రిందకు ఫసిఫిక్ పలక చొచ్చుకొనిపోయినప్పుడు అలూషియన్ దీవులు ఏర్పడ్డాయి ఇవి అలస్కా ద్వీపకల్పం (యు.ఎస్.ఏ.) నుండి కంచట్కా ద్వీపకల్పం (రష్యా) వరకూ 1900 కి.మీ. పొడుగునా ఒక వక్రం ఆకారంలో వున్నాయి. ఈ దీవులకు సమాంతరంగా 'అలూషియన్ ట్రెంచ్' (అత్యధిక లోతు 7,822 మీటర్లు) ఏర్పడింది.
"https://te.wikipedia.org/wiki/ద్వీప_వక్రతలు" నుండి వెలికితీశారు