ద్వీప వక్రతలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
 
==విస్తరణ==
[[File:Sea of Okhotsk map.png|thumb|కంచట్కా ద్వీపకల్పం (రష్యా) నుండి హోక్కైడో దీవి (జపాన్) వరకూ వక్రం ఆకారంలో ఏర్పడిన కురిల్ దీవులు]]
[[File:Aleuten Lage.png|thumb|బేరింగ్ సముద్రంలో అలస్కా నుంచి కంచట్కా ద్వీపకల్పం వరకూ వక్రం ఆకారంలో ఏర్పడిన అలూషియన్ దీవులు]]
ద్వీప వక్రతలు ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రంలో విస్తరించి వున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ద్వీప వక్రతలలో అలూషియన్ దీవులు, కురిల్ దీవులు, రుక్యు దీవులు, ఫిలిప్పైన్ దీవులు, మెరియానా దీవులు, టోoగా దీవులు మొదలైనవి ముఖ్యమైనవి. మధ్యధరా సముద్రానికి చెందిన ఏజియన్ సముద్రం లోని హెల్లినిక్ దీవులు, హిందూ మహాసముద్రానికి చెందిన అండమాన్ మరియు నికోబార్ దీవులు, అట్లాంటిక్ మహాసముద్రానికి చెందిన కరేబియన్ సముద్రంలోని ఏంటిల్లస్ (Antilles) దీవులు ఇతర ద్వీప వక్రతలకు ఉదాహరణలు.
 
ఒఖొటోస్క్ సముద్రపు పలక (Okhotsk Plate) లోనికి పసిఫిక్ సముద్ర పలక వేగంగా చొచ్చుకొనిపోయినప్పుడు కురిల్ ద్వీప వక్రతలు ఏర్పడ్డాయి. కంచట్కా ద్వీపకల్పం (రష్యా) నుండి హోక్కైడో దీవి (జపాన్) వరకూ 1300 కి.మీ. పొడుగునా 50 పైగా దీవులతో ఒక వక్రం ఆకారంలో ఏర్పడినవే ఈ కురిల్ దీవులు. ఈ దీవులకు సమాంతరంగా, సముద్ర మట్టం నుండి 10,542 మీటర్ల లోతులో 'కురిల్-కంచట్కా ట్రెంచ్' ఏర్పడింది.
 
పసిఫిక్ సముద్రపు పలక, మెరియానా చిన్న సముద్ర పలక లోనికి చొచ్చుకొనిపోయినపుడు అగ్నిపర్వత దీవులు ఒక చాపం (arc) ఆకారంలో మెరియానా దీవులుగా ఏర్పడ్డాయి. ఈ ద్వీప వక్రతకు సమీపంలోనే ప్రపంచంలో అతిలోతైన సముద్ర కందకం ‘మెరియాన ట్రెంచ్’ (లోతు 11,034 మీటర్లు) ఏర్పడింది.
 
యురేషియా పలక లోనికి ఇండో-ఆస్ట్రేలియన్ పలక చొచ్చుకొనిపోయినప్పుడు అండమాన్ సముద్రంలో ఒక చాపం ఆకారంలో అండమాన్ మరియు నికోబార్ దీవులు ఏర్పడ్డాయి. వీటికి సమీపంలో ఉత్తర జావా ట్రెంచ్ కనిపిస్తుంది.
 
ఉత్తర అమెరికా పలక క్రిందకు ఫసిఫిక్ పలక చొచ్చుకొనిపోయినప్పుడు అలూషియన్ దీవులు ఏర్పడ్డాయి. 14 పెద్ద మరియు చిన్న అగ్నిపర్వాతాలతో కూడి వున్న ఈ దీవులు అలస్కా ద్వీపకల్పం (యు.ఎస్.ఏ.) నుండి కంచట్కా ద్వీపకల్పం (రష్యా) వరకూ 1900 కి.మీ. పొడుగునా ఒక వక్రం ఆకారంలో వున్నాయి. ఈ దీవులకు సమాంతరంగా 'అలూషియన్ ట్రెంచ్' (అత్యధిక లోతు 7,822 మీటర్లు) ఏర్పడింది.
"https://te.wikipedia.org/wiki/ద్వీప_వక్రతలు" నుండి వెలికితీశారు