ద్వీప వక్రతలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[File:Aleutian Islands.PNG|350 px|right| బేరింగ్ సముద్రం లో ఏర్పడిన అలూషియన్ దీవులు. ఇవి అలస్కా నుంచి కంచట్కా ద్వీపకల్పం వరకూ ఒక ద్వీప వక్రతగా ఏర్పడివుంది (ఎరుపు బోర్డర్ మధ్యలో కనిపిస్తున్న భాగం)]]
లోతైన సముద్ర భాగాలలో సముద్ర కందకాలకు (Oceanic Trenches) లేదా సముద్రాంతర్గత పర్వత పంక్తులకు (Oceanic Ridges) సమాంతరంగా ఒక వక్రం (arc) రూపంలో ఏర్పడిన అగ్ని పర్వత దీవులను ద్వీప వక్రతలు (Island arc) గా పిలుస్తారు. ఇవి రెండు సముద్ర పలకల అభిసరణ సరిహద్దుల వద్ద ఏర్పడతాయి. ఇవి ద్వీప సమూహం (Archipelago) లో ఒక ప్రత్యెక తరగతికి చెందినవి.
 
==లక్షణాలు==
* ఇవి ప్రాధమికంగా వక్రం లేదా చాపాకారంలో (arc shaped) వున్న సముద్ర దీవులు.
* సాధారణంగా ఇవి అగ్నిపర్వతాలను కలిగివుంటాయి. అయితే కొన్ని మాత్రం అగ్నిపర్వతీయం కానివి (Non volcanic) కూడా వుంటాయి. ఉదాహరణకు దక్షిణ ఏజియన్ ద్వీప వక్రతకు చెందిన దీవులు అగ్నిపర్వతీయమైనవి కావు. కనుక ద్వీప వక్రతలు అగ్ని పర్వతీయ (volcanic) మైనవి లేదా అగ్ని పర్వతీయం కానివి (Non volcanic) కూడా అయి వుండవచ్చు.
* ఇవి సముద్ర మట్టం పైన కనిపించ వచ్చు లేదా సముద్ర జలాలలో మునిగి వుండవచ్చు. ఉదాహరణకు జావా దీవులకు దక్షిణంగా వున్న ద్వీప వక్రతలు సముద్రజలాలలో మునిగి కనపడతాయి. జపాన్, తైవాన్ లకు మద్యన వున్న రుక్యు (Ryukyu) దీవులు సముద్ర జలాల పైన కనిపిస్తాయి
* రెండు సముద్ర పలకలు డీఢీ కొన్నప్పుడు పలకల అభిసరణ సరిహద్దుల వద్ద ఇవి ఏర్పడతాయి.
* అభిసరణ పలక సరిహద్దుకు సమాంతరంగా వక్రం లేదా చాపం (Arc) ఆకారంలో ఏర్పడతాయి. ముఖ్యంగా ఇవి చొచ్చుకోనిపోయే పలక (Subducting plate) కు కుంభాకారంగా (Convex) అమరి వుంటాయి
* సముద్ర కందకాలకు (Oceanic Trenches) లేదా సముద్రాంతర్గత పర్వత పంక్తులకు (Oceanic Ridges) లకు సమాంతరంగా ఇవి ఏర్పడతాయి.
 
==అగ్ని పర్వత వక్రత (Volcanic arc) లకు ద్వీప వక్రత (Island arc) లకు గల తేడాలు==
[[File:Hellenic arc.png|thumb|right|మధ్యధరా సముద్రంలోని దక్షిణ ఏజియన్ దీవులు మరియు హేల్లినిక్ దీవులు]]
Line 25 ⟶ 27:
[[పలక విరూపణ సిద్ధాంతం|విరూపకారిక పలకల చర్య]] (Tectonic plate activity) వలన సముద్ర భూతలం మీద ద్వీప వక్రతలు ఆవిర్భవిస్తాయి. [[పలక విరూపణ సిద్ధాంతం]] ప్రకారం రెండు సముద్రపు పలకలు ఢీ కొన్నప్పుడు ఆ పలకల సరిహద్దు మండలంలో ద్వీప వక్రతలు ఏర్పడతాయి.
 
ద్వీప వక్రత (Island arc) లు రెండు సముద్ర పలకల అభిసరణం వల్ల ఏర్పడతాయి. సముద్ర పలకలు ఒకదానికొకటి ఎదురెదురుగా చలిస్తూ డీఢీ కొన్నప్పుడు అభిసరణ సరిహద్దుల వద్ద, అదిక వేగంతో చలించే సాంద్రతర పలక వేరొక పలక లోనికి చొచ్చుకోనిపోతుంది. ఆ విధంగా భూ ప్రావారం లోనికి చొచ్చుకుపోయిన పలక లోని కొంత పటల (Crust) భాగం అధిక లోతుల వద్ద, అధిక ఉష్ణోగ్రతల వలన కరిగిపోతుంది. ఇలా కరిగిన పటలం మాగ్మా రూపంలో నిరంతరం పైకి ఉబికి వస్తుంది. పై పలక యొక్క అశ్మావరణం గుండా పైకి వచ్చిన ఈ మాగ్మా ఘనీభవించడం వలన ఒక వరుస క్రమంలో అగ్నిపర్వతాలు శృంఖలాల (Chains) వలె ఏర్పడ్డాయి. ఈ విధంగా అభిసరణ పలక సరిహద్దుకు సమాంతరంగా వక్రం లేదా చాపం (Arc) ఆకారంలో ఏర్పడిన అగ్నిపర్వత దీవుల వరుసను ద్వీప వక్రతలు (Island Arcs) గా పిలుస్తారు. ఇవి చొచ్చుకోనిపోయే పలక (Subducting plate) కు కుంభాకారంగా (Convex) వుంటాయి. ద్వీప వక్రత ఏర్పడిన ప్రాంతానికి అవతలివైపున అనగా చొచ్చుకుపోతున్న పలక దిశలో సముద్రంలో [[సముద్ర ట్రెంచ్|ట్రెంచ్]] లనబడే లోతైన సముద్ర కందకాలు సబ్ డక్షన్ మండలానికి సమాంతరంగా ఏర్పడతాయి. సముద్ర భూతలంపైన ఏర్పడిన ద్వీప వక్రత లోని దీవులు సముద్రమట్టం పైన కనిపించవచ్చు. లేదా సముద్ర గర్భం లోనే దాగి వుండవచ్చు. సాధారణంగా ఈ ద్వీప వక్రతలు రెండు వక్రాలుగా ఏర్పడుతుంటాయి. ఈ రెండు వక్రతలకు మధ్య దూరం 50 నుంచి 150 కి.మీ. వరకూ ఉండవచ్చు. వీటిలో ఖండభాగం వైపు వున్న వక్రం లోని దీవులలో అగ్నిపర్వత ప్రక్రియ చాలా తీవ్రంగా వుంటుంది. మిగిలిన రెండవ వక్రంలోని దీవులలో అగ్నిపర్వత ప్రక్రియ దాదాపుగా కనిపించదు.
 
మెరియానా దీవులు, కురిల్ (కుర్లీ) దీవులు, అలూషియన్ దీవులు ద్వీప వక్రతలకు చక్కని ఉదాహరణలు.
Line 36 ⟶ 38:
ఒఖొటోస్క్ సముద్రపు పలక (Okhotsk Plate) లోనికి పసిఫిక్ సముద్ర పలక వేగంగా చొచ్చుకొనిపోయినప్పుడు కురిల్ ద్వీప వక్రతలు ఏర్పడ్డాయి. కంచట్కా ద్వీపకల్పం (రష్యా) నుండి హోక్కైడో దీవి (జపాన్) వరకూ 1300 కి.మీ. పొడుగునా 50 పైగా దీవులతో ఒక వక్రం ఆకారంలో ఏర్పడినవే ఈ కురిల్ దీవులు. ఈ దీవులకు సమాంతరంగా, సముద్ర మట్టం నుండి 10,542 మీటర్ల లోతులో 'కురిల్-కంచట్కా ట్రెంచ్' ఏర్పడింది.
 
పసిఫిక్ సముద్రపు పలక, మెరియానా చిన్న సముద్ర పలక లోనికి చొచ్చుకొనిపోయినపుడు అగ్నిపర్వత దీవులు ఒక చాపం (arc) ఆకారంలో మెరియానా దీవులుగా ఏర్పడ్డాయి. ఈ ద్వీప వక్రతకు సమీపంలోనే ప్రపంచంలో అతిలోతైన సముద్ర కందకం ‘మెరియాన ట్రెంచ్’ (లోతు 11,034 మీటర్లు) ఏర్పడింది.
 
యురేషియా పలక లోనికి ఇండో-ఆస్ట్రేలియన్ పలక చొచ్చుకొనిపోయినప్పుడు అండమాన్ సముద్రంలో ఒక చాపం ఆకారంలో అండమాన్ మరియు నికోబార్ దీవులు ఏర్పడ్డాయి. వీటికి సమీపంలో ఉత్తర జావా ట్రెంచ్ కనిపిస్తుంది.
 
ఉత్తర అమెరికా పలక క్రిందకు ఫసిఫిక్ పలక చొచ్చుకొనిపోయినప్పుడు అలూషియన్ దీవులు ఏర్పడ్డాయి. 14 పెద్ద మరియు చిన్న అగ్నిపర్వాతాలతో కూడి వున్న ఈ దీవులు అలస్కా ద్వీపకల్పం (యు.ఎస్.ఏ.) నుండి కంచట్కా ద్వీపకల్పం (రష్యా) వరకూ 1900 కి.మీ. పొడుగునా ఒక వక్రం ఆకారంలో వున్నాయి. ఈ దీవులకు సమాంతరంగా 'అలూషియన్ ట్రెంచ్' (అత్యధిక లోతు 7,822 మీటర్లు) ఏర్పడింది.
 
ప్యూర్టోరికో దీవి కరేబియన్ పలక-ఉత్తర అమెరికా పలక సరిహద్దుల వద్ద వుంది. కరేబియన్ పలకను ఉత్తర అమెరికా పలక మరియు దక్షిణ అమెరికా పలకలు ఢీ కొన్నప్పుడు ప్యూర్టోరికో దీవి మరియు lesser Antillas దీవులతో కూడిన ఒక ద్వీప వక్రత ఏర్పడుతుంది. ప్యూర్టోరికో దీవికి ఉత్తరంగా ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ప్యూర్టోరికో ట్రెంచ్ ఏర్పడింది.
 
==ఉదాహరణలు==
Line 85 ⟶ 89:
 
[[సముద్ర ట్రెంచ్]]
 
==మూలాలు==
* Island Arcs: Japan and Its Environs - A. Sugimura, S. Uyeda - Elsevier Scientific Publishing Company, online edition 2013, ISBN 9781483256931 [https://www.amazon.in/Island-Arcs-Japan-Its-Environs-ebook/dp/B01M1BHNGW]
"https://te.wikipedia.org/wiki/ద్వీప_వక్రతలు" నుండి వెలికితీశారు