శ్రీఆంజనేయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
రామాపురం అనే గ్రామంలో ఒక సివిల్ ఇంజనీరు (ప్రకాష్ రాజ్) సీతమ్మ తల్లి డ్యాం అనే ఆనకట్టను కట్టడానికి ప్రభుత్వం నియమిస్తుంది. ప్రాంతీయంగా ప్రాభల్యంగా ఉన్న ఓ రాజకీయ నాయకుడు బ్రహ్మం (పిల్ల ప్రసాద్) దాన్ని అడ్డుకుంటాడు. ఆ ఇంజనీరుబెదిరింపులకు లొంగకపోవడంతో బ్రహ్మం అతన్ని, అతని భార్యను చంపిస్తాడు. వారిద్దరి కొడుకు అంజి అనాథ అయిపోతాడు. అతన్ని ఆ ఊరి రామాలయ పూజారి (చంద్రమోహన్) తో పాటు మిగతా గ్రామస్తులు అతన్ని పెంచి పెద్ద జేస్తాడు. అంజి ఆంజనేయుడికి వీరభక్తుడు.
 
బ్రహ్మానికి ఆ ఊర్లో 100 ఏళ్ళ పురాతనమైన గుడి అడుగున గ్రానైటు శిలలు ఉన్నాయని తెలిసి ఆ గుడిని కూల్చేసి వేరే దగ్గర కొత్త దేవాలయం నిర్మించాలని చూస్తుంటాడు. అంజి దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తాడు కానీ బ్రహ్మం దగ్గరున్న గూండాలను చూసి భయపడుతుంటాడు. ఒక రోజు ఆంజనేయ స్వామి మారు వేషంలో వచ్చి తాను నెరవేర్చవలసిన ధర్మాన్ని గురించి చెప్పడానికి వస్తాడు. అతన్ని అప్పటి దాకా ఆగిపోయిన సీతమ్మ తల్లి డ్యాం ను మళ్ళీ ప్రారంభించేలా అతన్ని ప్రోత్సహిస్తాడు. ఈ ప్రయత్నంలో బ్రహ్మం మనుషులు అతన్ని అనేకరకాలుగా అడ్డుకుంటూ ఉంటారు. వారందరినీ ఎదుర్కొని అంజి తన ధర్మాన్ని ఎలా నెరవేర్చాడన్నది మిగతా కథ.
 
==నటవర్గం==
"https://te.wikipedia.org/wiki/శ్రీఆంజనేయం" నుండి వెలికితీశారు