క్షీరసాగర మథనం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
== క్షీరసాగర మథనానికి పూనుకోవడానికి కారణం ==
రాక్షసుల బాధ పడలేక దేవతలు [[శివుడు|శివుని]], [[బ్రహ్మ|బ్రహ్మను]] వెంట బెట్టుకొని [[విష్ణువు|శ్రీ మహావిష్ణువు]] వద్దకు వెళ్ళి వారి క్లేశాలు చెప్పుకొంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి "ఇప్పుడు [[రాక్షసులు]] బలంగా ఉన్న కారణం చేత వారితో సఖ్యంగా ఉండండి. వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మథనం(పాల సముద్రం చిలకండి) జరపండి" అని చెబుతాడు. "ఆ మథనానికి కవ్వంగా [[మందరగిరి]] ని వాడండి. త్రాడు గా [[వాసుకి]] ని వినియోగించండి. ఆ మథన సమయం లో [[అమృతం]] పుడుతుంది. దానిని మీరు ఆరగించి, క్లేశాలు వారికి మిగల్చండి" అని విష్ణువు సెలవిస్తాడు.
 
ఆమాటలు విని, దేవతలు ఆనందించి వారివారి గృహాలకు వెళ్ళిపోతారు. కొంతమంది రాక్షసులు దేవతా సంహారానికి ముందుకువస్తుంటే [[బలి]] చక్రవర్తి వారిని వారిస్తాడు. ఆ తరువాత అలా కాలం వెళ్లబుచ్చుతున్న సమయంలో ఒకరోజు [[ఇంద్రుడు]] రాక్షసులకు క్షీరసాగర మథనం జరిపితే అమృతం పుడుతుందని, అమృతం సేవిస్తే [[మృత్యువు]] దరి చేరదని చెబుతాడు. దీనితో ప్రేరితులైన రాక్షసులు క్షీరసాగర మథనానికి ముందుకు వస్తారు.
 
== క్షీరసాగర మథనం ప్రారంభించడం ==
"https://te.wikipedia.org/wiki/క్షీరసాగర_మథనం" నుండి వెలికితీశారు