క్షీరసాగర మథనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 101:
 
== ధన్వంతరి అమృత కలశం తో పుట్టడం-మహావిష్ణువు మోహిని అవతారం దాల్చడం ==
ఆ తరువాత [[ధన్వంతరి]] అమృత కలశంతో ఆవిర్భవిస్తాడు. అమృతాన్ని చూడగానే దానవులు ఒకరి మీద మరొకరు పడి కొట్టుకోవడం ఆరంభించారు. [[దానవులు]] కొట్టుకోవడంతో అమృతం చేతులు మారి పోతోంది. దేవతలు దీన వదనులై శ్రీమహావిష్ణువుని ప్రార్థించారు. శ్రీమహావిష్ణువు వారిని ఓదార్చి [[జగన్మోహిని]] అవతారం ఎత్తి ఆ దానవుల వద్దకు వస్తాడు. జగన్మోహినీ రూపుడైన శ్రీ మహావిష్ణువు వయ్యారాలు ఒలక పోసుకొంటూ అటు ఇటు తిరుగుతుంటే రాక్షసులు ఆ జగన్మోహిని వెంటబడి అప్పటి వరకు జరిగిన గాథ చెప్పి దేవదానవులు అన్నదమ్ములు అవుతారని, సాగర మథనం వల్ల అమృతం వచ్చిందని, ఆ అమృతాన్ని వారిద్దరకి పంచమని కోరుతారు. అప్పుడు ఆ జగన్మోహిని దేవదానవులను రెండు పంక్తులలో కోర్చోబెట్టి, దర్భలమీద అమృతకలశాన్ని పెట్టి, దేవతలకు అమృతం పోస్తూ, దానవులను తన వయ్యారాలతో మభ్యపెట్టింది. [[రాహువు]] అనే రాక్షసుడు అది గ్రహించి దేవతల పంక్తిలో కూర్చొంటాడు. ఆ విషయాన్ని [[సూర్యుడు|సూర్య]][[చంద్రుడు|చంద్రులు]] సంజ్ఞ ద్వారా మహావిష్ణువు (జగన్మోహిని) కి తెలుపగా విష్ణువు [[సుదర్శన చక్రం|సుదర్శన చక్రము]]తో వాడి తల తెగ నరికాడు. ఆ విషయం ప్రక్కన ఉన్న దానవులకు తెలియలేదు. అమృతం పంచడం అయిపోయింది. జగన్మోహిని అదృశ్యమై పోయింది.
 
== సూర్య, చంద్ర గ్రహణాలు ==
"https://te.wikipedia.org/wiki/క్షీరసాగర_మథనం" నుండి వెలికితీశారు