బి.వి.ఎస్.రామారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
భావరాజు వెంకట సీతారామారావు [[రాజమండ్రి]]లో 1932లో జన్మించాడు. భావరాజు సత్యనారాయణ, సత్యవతి గారలు ఇతని తల్లిదండ్రులు. ప్రముఖ రచయిత [[బి.వి.రమణారావు]], ప్రముఖ ఇంద్రజాలికుడు [[బి.వి.పట్టాభిరామ్]], ప్రముఖ కార్టూనిస్ట్ [[సత్యమూర్తి]] ఇతని సోదరులు. ఇతడు మెకానికల్, సివిల్ విభాగాలలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. [[మద్రాసు]]లోని కేసరి స్కూలులో చదువుకునే సమయంలో ఇతనికి [[ముళ్ళపూడి వెంకటరమణ]], [[బాపు]]లతో స్నేహం ఏర్పడి అది చివరిదాకా కొనసాగింది.
==ఉద్యోగం==
ఇంజనీరింగ్ పూర్తి అయ్యాక ఇతడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా ఉద్యోగంలోనికి చేరాడు. గోదావరి ప్రాజెక్టులో 15 సంవత్సరాలు జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ తదితర హోదాలలో పనిచేశాడు. ఆ సమయంలో ఆనకట్టల రిపేర్లు, కొత్త ఆనకట్టల నిర్మాణం, బ్యారేజీ నిర్మాణం, హైడ్రాలిక్ గేట్ల నిర్మాణం వంటి పనులలో భాగస్వామ్యం వహించాడు. అనేక వర్క్‌షాపులను నిర్వహించాడు. తర్వాత హైదరాబాదుకు[[హైదరాబాదు]]కు బదిలీ అయ్యి 4 సంవత్సరాలు పనిచేసి పదవీవిరమణ చేశాడు. పిమ్మట ఒక ప్రయివేటు సంస్థలో పాతిక సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నాడు.
 
==కుటుంబం==
"https://te.wikipedia.org/wiki/బి.వి.ఎస్.రామారావు" నుండి వెలికితీశారు